మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'భ్రమయుగం' సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కళ్లు చెదిరే కలెక్షన్స్‌తో రికార్డులు క్రియేట్ చేస్తుంది. మొదట మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 23న తెలుగులో రిలీజ్ అయింది. టాలీవుడ్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని విడుదల చేసింది. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమాని చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ సంయుక్తంగా నిర్మించారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేవలం మూడు పాత్రలతో అది కూడా బ్లాక్ అండ్ వైట్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు.
తాజాగా ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అన్ని భాషలతో కలుపుకుని రూ. 50 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్ వారు ప్రకటించారు. సినిమా పట్ల మంచి టాక్ రావడంతో రూ. 100 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరుస హిట్లతో సౌత్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మమ్ముట్టి సత్తా చాటుతున్నాడు.
భ్రమయుగం ఓటీటీ రైట్స్ కూడా సుమారు రూ. 25 కోట్లకు పైగా సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల హక్కులు మొత్తం సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలిసింది. కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతుంది. మార్చి చివరి వారంలో సోనీ లివ్‌లో భ్రమయుగం స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment