‘సూర్యుడిలా ప్రకాశించాలంటే ముందు సూర్యుడిలా ప్రజ్వలించాలి’’అని అబ్దుల్ కలామ్ అనేవారు. ఈ మహిళామణులంతా అలా ప్రజ్వరిల్లి, ప్రకాశించినవారే. అందుకే వీరు తొలి మహిళలు అవగలిగారు. భారతావనిలో ఆదర్శవంతులుగా నిలవగలిగారు. ‘మహిళా దినోత్సవం’ సమీపిస్తున్న వేళ.. కొందరు తొలి మహిళల ప్రస్తావన.
లెఫ్టినెంట్ భావనా కస్తూరి
రిపబ్లిక్ డే పరేడ్‌లో (2019) పురుషుల సైనిక దళానికి సారథ్యం వహించిన తొలి మహిళ!
కెప్టెన్ శిఖా సురభి
రిపబ్లిక్ డే పరేడ్ (2019)లో భారత సైన్యం ప్రదర్శించిన మోటార్ సైకిల్ విన్యాస బృందం ‘డేర్ డెవిల్స్’లో తొలి, ఏకైక మహిళా సభ్యురాలు.
డాక్టర్ జి.సి. అనుపమ
ఆస్ట్రొనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (భారత ఖగోళరంగ సంస్థ) తొలి మహిళా అధినేత. దేశంలోని ఖగోళ శాస్త్రవేత్తలంతా ఇందులో అధికారిక సభ్యత్వం కలిగి ఉంటారు.
ఫ్లయిట్ లెఫ్టినెంట్ హీనా జైస్వాల్
భారతీయ వాయుసేనలో (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) తొలి మహిళా ఫ్లయిట్ ఇంజినీర్.
శాంతిదేవి
భారతదేశంలో తొలి మహిళా ట్రక్కు మెకానిక్కు. శాంతిదేవి ఇరవై ఏళ్లుగా భారీ వాహనాలను రిపేర్ చేస్తున్నారు.
ఉషా కిరణ్
చత్తీస్‌గడ్‌లోని కల్లోల బస్తర్ ప్రాంతంలో విధులను స్వీకరించిన తొలి సి.ఆర్.పి.ఎఫ్ మహిళా అధికారి.
కవితాదేవి
డబ్లు్య.డబ్లు్య.ఇ. (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్)లో పాల్గొన్నతొలి భారతీయ మహిళా రెజ్లర్.
అవని చతుర్వేది
ఒంటరిగా ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపిన తొలి మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్.
ఎం.ఎ.స్నేహ
భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా నో క్యాస్ట్, నో రెలిజియన్ ‘సర్టిఫికెట్’ సంపాదించిన తొలి భారతీయ మహిళ.
అరుణిమ సింగ్
జలచరాలను కాపాడే పనిలో ఉన్న తొలి భారతీయ ప్రాణి ప్రేమికురాలు. ఇప్పటివరకు ఆమె 18 ప్రమాదకరమైన నీటి ప్రాణులను ప్రాణగండం నుంచి బయటపడేశారు.
ప్రాంజల్ పాటిల్
కంటిచూపు లేని తొలి భారతీయ మహిళా ఐఎఎస్ అధికారి. గత ఏడాదే ఆమె ఎర్నాకులం జిల్లా (కేరళ) అసిస్టెంట్ కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment