Kavita Devi
-
కన్నీటి రుచి తెలిసింది మాకే
మధ్యప్రదేశ్‌లో ఓ కుగ్రామం. పేరు కుంజన్ పూర్వ. అక్కడ దాదాపుగా అన్ని కుటుంబాలూ చదువుసంధ్యల పట్ల పెద్దగా పట్టింపులేనివే. పుట్టింది ఆడపిల్ల అని తెలిసినప్పటి నుంచి ఎంత త్వరగా పెళ్లి చేసి అత్తవారింట్లో వదిలి పెడదామా అనే ధ్యాస తప్ప ఆడపిల్లను కూడా చదివిద్దాం అనే ఆలోచన ఏ మాత్రం లేని అనేక కుటుంబాల్లో అదీ ఓ కుటుంబం. తన చుట్టూ చాలామంది ఆడపిల్లల్లాగానే ఈ అమ్మాయి కూడా పన్నెండేళ్లకే పెళ్లి పీటల మీద కూర్చోవాల్సి వచ్చింది. అక్కడితో తన ఆలోచనలకు పరిసమాప్తి పలికి వంటగది కే పరిమితమై ఉంటే ఈ రోజు ఆమె గురించి మాట్లాడుకోవడానికి ఏ ప్రత్యేకతా ఉండేది కాదు. అయితే ఆమె వేసిన అభ్యుదయపు అడుగులే కవితాదేవి అనే ఒక సామాన్య దళిత మహిళను ఈ రోజు ఎడిటర్స్ గిల్డ్ మెంబర్‌ను చేశాయి. కన్నీటి రుచి తెలిసింది మాకే కవితాదేవి ‘ఖబర్ లహరియా’ అనే పత్రికకు ఎడిటర్. ఆమె స్థాపించిన డిజిటల్ రూరల్ నెట్‌వర్క్‌లో ముప్పై మంది రిపోర్టర్లు సేవలందిస్తున్నారు. అందరూ మహిళలే. రిపోర్టందరూ మహిళలే ఎందుకని ఆమెను అడిగిన వాళ్లకు ‘మా వెనుకబడిన ప్రాంతంలో జర్నలిజం మగవాళ్ల కే పరిమితం అనే అపోహ ఇంకా రాజ్యమేలుతూనే ఉంది. ఆ అపోహను తుడిచేయడానికే’ అంటారామె. అలాగే ‘మా పత్రికలో ప్రధానం గా మహిళల సమస్యలను, ముఖ్యంగా దళిత మహిళలు సమాజంలో ఎదుర్కొనే సమస్యలనే ప్రస్తావిస్తాం. అలాగే కష్టాలకు ఎదురు నిలిచి మేము సాధించిన విజయాలను కూడా గొప్పగా చెప్పుకుంటాం. మగవాళ్లకు అది చిన్న విజయంగా తోచవచ్చు. కానీ మా కష్టాలు మాకే బాగా అర్థమవుతాయి. మా చిన్న గెలుపు కూడా మాకు గొప్పగానే ఉంటుంది. మాకు ఎదురయ్యే కష్టం మరో మగవాడి నుంచే. ఒక మగవాడి కారణంగా మాకు కలిగే బాధను మరో మగవాడు మనసు పెట్టి అర్థం చేసుకోగలడా అనేది కూడా సందేహమే. కన్నీళ్ల రుచి ఎరిగిన మగవాళ్లు ఎంతమంది ఉంటారు? అందుకే మా పత్రిక కు వార్తలను, వార్తాకథనాలను అందించే రిపోర్టర్లందరూ మహిళలే’ అంటూ సున్నితమైన మరో కారణాన్ని కూడా వివరించారు కవితాదేవి. ఇలా మొదలైంది కవితాదేవి పెళ్లయి అత్తగారింట్లో అయోమయంగా రోజులు గడుపుతున్న కాలమది. దళిత వాడల్లో మహిళలకు ఎదురయ్యే కష్టాలను అక్షరబద్ధం చేయాలనే ఉద్దేశంతో ఆ గ్రామానికి ఒక ఎన్జీవో వచ్చింది. ఆ ఎన్జీవో సభ్యులు ఉత్సాహవంతులైన మహిళలకు వార్తలు రాయడంలో శిక్షణనిచ్చారు. ఆ శిక్షణకు హాజరు కావడం కోసం ఇంట్లో వాళ్ల అనుమతి కావాలి. అనుమతి సంపాదించడం కవితాదేవికి ఒక పోరాటమే అయింది. శిక్షణ తర్వాత బుందేలీ భాషలో విడుదలయ్యే ‘మహిళాదకియా’ మంత్లీ న్యూస్‌లెటర్‌కు రిపోర్టర్‌గా సేవలందించింది కవితాదేవి. ఉత్తరప్రదేశ్‌లోని కుగ్రామాల మహిళలకు ఆ పత్రిక ఒక ఆశ్చర్యం, తమ గురించి కూడా పేపర్లో అచ్చు కావడం వాళ్లకు పెద్ద అబ్బురం. పత్రిక కోసం ఎదురు చూడడం అలవాటైంది వాళ్లకు. కొంతకాలానికి ఆ పత్రిక ఆగిపోవడంతో తీవ్రమైన నిరుత్సాహానికి లోనయ్యారంతా. అప్పుడు కవితాదేవి ఢిల్లీకి చెందిన మరో ఎన్జీవో సహకారంతో తనే స్వయంగా ‘ఖబర్ లహరియా’ అనే డిజిటల్ మ్యాగజైన్‌ను ప్రారంభించింది. ప్రధాన స్రవంతి మీడియా దృష్టి పెట్టని మహిళల కష్టాలను మహిళ కళ్లతో చూసి, మహిళ మనసుతో అర్థం చేసుకుని అక్షరీకరించడం వల్లనే తమ పత్రిక అనతికాలంలోనే పాఠకాదరణ పొందిందని చెబుతారు కవితాదేవి. ప్రస్తుతం ఖబర్ లహరియాకు వివిధ డిజిటల్ మాధ్యమాల్లో కోటి మంది పాఠకులున్నారు. -
ప్రముఖ క్రీడాకారులు.. డిప్యూటీ డైరెక్టర్లుగా నియామకం
చంఢీగడ్ : భారత రెజ్లర్ బబితా ఫోగాట్, కబడ్డీ క్రీడాకారిణి కవితా దేవిలను క్రీడా, యువజన వ్యవహారాల శాఖ డిప్యూటీ డైరెక్టర్లుగా నియమిస్తూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2018 జూలై 29న వెలువడ్డ ఉత్తర్వులకు అథ్లెట్లు ఇద్దరూ దరఖాస్తు చేసుకోగా.. ఇద్దరికీ చోటుకల్పించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నెలరోజుల్లోగా ఇద్దరు అథ్లెట్లు సంబంధిత విభాగంలో రిపోర్టు చేయాలని తెలిపారు. ప్రసిద్ధ రెజ్లింగ్ కోచ్ మహావీర్ ఫోగాట్ కుమార్తె బబితా. ఫోగట్ సోదరీమణుల జీవితం ఆధారంగా రూపొందించిన బాలీవుడ్ చిత్రం దంగల్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఫోగాట్ పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగి పోయింది. (వారికి సాయం చేయండి: విరుష్క) కొత్త బాధ్యతలను చేపట్టడంపై బబితా స్పందిస్తూ.. తన నియామకంపై సీఎం మనోహర్ లాల్ ఖట్టార్, క్రీడల మంత్రి సందీప్ సింగ్‌లకు ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఒక క్రీడాకారిణిగా ఆటగాళ్లకు అవసరమైన అన్ని సదుపాయాలు లభించేలా కృషి చేస్తానని తెలిపింది. ఒక ప్రశ్నకు సమాధానంగా భారత మాజీ హాకీ జట్టు కెప్టెన్ క్రీడా మంత్రి సందీప్ సింగ్‌తో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నట్లు పేర్కొంంది. ఇక 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బబితా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇక ప్రముక కబడ్డీ క్రీడాకారిణి కవితాదేవి 2014 ఇంచియాన్ ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించింది. (జాతీయ క్రీడా అవార్డులు ఆలస్యం! ) खेल विभाग हरियाणा में उप निदेशक पद पर नियुक्त करने के लिए हरियाणा के माननीय मुख्यमंत्री @mlkhattar जी,माननीय राज्यसभा सांसद एवं हरियाणा के प्रभारी @aniljaindr जी,माननीय खेल मंत्री @flickersingh जी,प्रदेश अध्यक्ष @OPDhankar जी,संगठन महामंत्री @sureshbhattbjp जी का बहुत बहुत आभार। pic.twitter.com/59rxq5EKtr — Babita Phogat (@BabitaPhogat) July 30, 2020 -
సూర్యచంద్రికలు
‘సూర్యుడిలా ప్రకాశించాలంటే ముందు సూర్యుడిలా ప్రజ్వలించాలి’’అని అబ్దుల్ కలామ్ అనేవారు. ఈ మహిళామణులంతా అలా ప్రజ్వరిల్లి, ప్రకాశించినవారే. అందుకే వీరు తొలి మహిళలు అవగలిగారు. భారతావనిలో ఆదర్శవంతులుగా నిలవగలిగారు. ‘మహిళా దినోత్సవం’ సమీపిస్తున్న వేళ.. కొందరు తొలి మహిళల ప్రస్తావన. లెఫ్టినెంట్ భావనా కస్తూరి రిపబ్లిక్ డే పరేడ్‌లో (2019) పురుషుల సైనిక దళానికి సారథ్యం వహించిన తొలి మహిళ! కెప్టెన్ శిఖా సురభి రిపబ్లిక్ డే పరేడ్ (2019)లో భారత సైన్యం ప్రదర్శించిన మోటార్ సైకిల్ విన్యాస బృందం ‘డేర్ డెవిల్స్’లో తొలి, ఏకైక మహిళా సభ్యురాలు. డాక్టర్ జి.సి. అనుపమ ఆస్ట్రొనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (భారత ఖగోళరంగ సంస్థ) తొలి మహిళా అధినేత. దేశంలోని ఖగోళ శాస్త్రవేత్తలంతా ఇందులో అధికారిక సభ్యత్వం కలిగి ఉంటారు. ఫ్లయిట్ లెఫ్టినెంట్ హీనా జైస్వాల్ భారతీయ వాయుసేనలో (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) తొలి మహిళా ఫ్లయిట్ ఇంజినీర్. శాంతిదేవి భారతదేశంలో తొలి మహిళా ట్రక్కు మెకానిక్కు. శాంతిదేవి ఇరవై ఏళ్లుగా భారీ వాహనాలను రిపేర్ చేస్తున్నారు. ఉషా కిరణ్ చత్తీస్‌గడ్‌లోని కల్లోల బస్తర్ ప్రాంతంలో విధులను స్వీకరించిన తొలి సి.ఆర్.పి.ఎఫ్ మహిళా అధికారి. కవితాదేవి డబ్లు్య.డబ్లు్య.ఇ. (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్)లో పాల్గొన్నతొలి భారతీయ మహిళా రెజ్లర్. అవని చతుర్వేది ఒంటరిగా ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపిన తొలి మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్. ఎం.ఎ.స్నేహ భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా నో క్యాస్ట్, నో రెలిజియన్ ‘సర్టిఫికెట్’ సంపాదించిన తొలి భారతీయ మహిళ. అరుణిమ సింగ్ జలచరాలను కాపాడే పనిలో ఉన్న తొలి భారతీయ ప్రాణి ప్రేమికురాలు. ఇప్పటివరకు ఆమె 18 ప్రమాదకరమైన నీటి ప్రాణులను ప్రాణగండం నుంచి బయటపడేశారు. ప్రాంజల్ పాటిల్ కంటిచూపు లేని తొలి భారతీయ మహిళా ఐఎఎస్ అధికారి. గత ఏడాదే ఆమె ఎర్నాకులం జిల్లా (కేరళ) అసిస్టెంట్ కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. -
కండలరాణి.. కవితా దేవి రికార్డ్!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న గేమ్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ). భారత్‌లోనూ ఈ గేమ్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ ఆదరణను క్యాష్ చేసుకొని.. ఇక్కడి మార్కెట్లోనూ పాగా వేసేందుకు డబ్ల్యూడబ్ల్యూఈ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ భారత మహిళా రెజ్లర్ కవితా దేవిని తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈలో తీసుకున్నారు. ఇటీవల న్యూఢిల్లీ పర్యటనకు వచ్చిన డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్ జిందర్ మహాల్ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తద్వారా డబ్ల్యూడబ్ల్యూఈలో పాల్గొంటున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా కవితా దేవి రికార్డు సృష్టించారు. హరియాణకు చెందిన కవితా దేవి ప్రముఖ రెజ్లర్ ద గ్రేట్ ఖలీ (దిలీప్‌సింగ్ రాణా) వద్ద శిక్షణ పొందారు. బీబీ బుల్బుల్ అనే రెజ్లర్‌ను ఓడించడం ద్వారా కవితా దేవి పాపులర్ అయ్యారు. 2016లో దక్షిణాసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని గెలుపొందారు. -
చరిత్ర సృష్టించిన కవిత.. వైరల్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ : వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ)లో భారతనారి సంచలనం సృష్టించారు. సల్వార్ కమీజ్ ధరించి మరీ ఆమె చేసిన పోరాటం అభిమానులను కట్టిపడేసింది. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆమె పోరాటం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ (WWE)లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా గతంలో గ్రేట్ ఖాలీ సంచలనం సృష్టించాడు. హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ గెలిచి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు హరియాణాకు చెందిన రెజ్లర్ కవితా దేవీ అదే పనిచేశారు. ఈ రింగ్‌లో అడుగుపెట్టిన భారత తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఇటీవల జరిగిన మే యంగ్ క్లాసిక్ టోర్నీలో న్యూజిలాండ్ రెజ్లర్ డకోటా కైతో ఆమె తలపడి తన ప్రతాపం చూపించారు. ప్రత్యర్థిని తన కండబలంతో పలుమార్లు పైకి ఎగరేసి కింద పడేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కవిత ఓడినా తన పోరాటంతో మెప్పించారు. ఇక్కడ నెటిజన్లను అమితంగా ఆకర్షించింది ఆమె వస్త్రధారణ. కాషాయ రంగు సల్వార్ కమీజ్ ధరించిన కవిత నడుం చుట్టూ దుపట్టా కట్టుకొని కుస్తీ పట్టిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఆ వీడియోను 35 లక్షల మంది వీక్షించారు. వెయిట్ లిఫ్టర్ అయిన కవితా దేవి 2016 ఏసియా గేమ్స్‌లో 75 కేజీల విభాగంలో స్వర్ణాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.