మహిళా రెజ్లర్ కవితా దేవి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న గేమ్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ). భారత్‌లోనూ ఈ గేమ్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ ఆదరణను క్యాష్ చేసుకొని.. ఇక్కడి మార్కెట్‌లోనూ పాగా వేసేందుకు డబ్ల్యూడబ్ల్యూఈ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ భారత మహిళా రెజ్లర్ కవితా దేవిని తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈలో తీసుకున్నారు. ఇటీవల న్యూఢిల్లీ పర్యటనకు వచ్చిన డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్ జిందర్ మహాల్ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తద్వారా డబ్ల్యూడబ్ల్యూఈలో పాల్గొంటున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా కవితా దేవి రికార్డు సృష్టించారు.
హరియాణకు చెందిన కవితా దేవి ప్రముఖ రెజ్లర్ ద గ్రేట్ ఖలీ (దిలీప్‌సింగ్ రాణా) వద్ద శిక్షణ పొందారు. బీబీ బుల్‌బుల్ అనే రెజ్లర్‌ను ఓడించడం ద్వారా కవితా దేవి పాపులర్ అయ్యారు. 2016లో దక్షిణాసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment