డబ్ల్యుడబ్ల్యుఈ సూపర్‌స్టార్ కన్నుమూత (PC: WWE)
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ సూపర్‌స్టార్ మైకేల్ జోన్స్ కన్నుమూశాడు. డబ్ల్యుడబ్ల్యుఈ ప్రపంచంలో వర్జిల్‌గా ప్రసిద్ధి పొందిన అతడు 61 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచాడు.
ఈ విషయాన్ని మైకేల్ జోన్స్ స్నేహితుడు, ప్రొ- రెజ్లింగ్ రిఫరీ మార్క్ చార్ల్స్ III సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘‘మనందరం ఎంతగానో ప్రేమించే మైకేల్ జోన్స్.. వర్జిల్, విన్సెంట్, సౌల్ ట్రెయిన్‌గా సుపరిచితుడైన మన స్నేహితుడు ఇక లేరనే విషాద వార్తను బాధాతప్త హృదయంతో మీతో పంచుకుంటున్నా.
వర్జిల్ ప్రశాంతంగా ఆస్పత్రిలోనే కన్నుమూశాడు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని మార్క్ చార్ల్స్ సంతాపం వ్యక్తం చేశాడు. డబ్ల్యుడబ్ల్యుఈ కూడా మైకేల్ జోన్స్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ అతడి కుటుంబం, అభిమానులకు సానుభూతి ప్రకటించింది.
WWE is saddened to learn that Michael Jones, known to WWE fans as Virgil, has passed away.
WWE extends its condolences to Jones’ family, friends and fans. pic.twitter.com/i9QDodn9BD— WWE (@WWE) February 28, 2024
కాగా 1962లో అమెరికాలోని పెన్సిల్వేనియాలో జన్మించిన మైక్ జోన్స్ 1980వ దశకంలో సౌల్ ట్రైన్ జోన్స్ పేరిట ప్రొఫెషనల్ రెజ్లర్‌గా మారాడు. 1986లో డబ్ల్యుడబ్ల్యుఈలో లూయిస్ బ్రౌన్‌గా అడుగుపెట్టి.. ఆ తర్వాత వర్జిల్‌గా కొనసాగాడు.
ఈ క్రమంలో 1994లో డబ్ల్యుడబ్ల్యుఈ నుంచి బయటకు వచ్చిన జోన్స్ రెండేళ్లపాటు ఆ తర్వాత ఇండిపెండెంట్ సర్య్కూట్‌లో పలు పోటీల్లో పాల్గొన్నాడు.
ఇక తరచూ అనారోగ్యం బారిన పడటం మూలాన వైద్య పరీక్షలు చేయించుకోగా తనకు కొలన్ క్యాన్సర్(పెద్ద పేగు క్యాన్సర్) ఉన్నట్లు తేలిందని మైక్ జోన్స్ 2022లో ప్రకటించాడు. అదే విధంగా డిమోన్షియా(మతిమరుపు)తో బాధపడుతున్నట్లు తెలిపాడు. కాగా గతంలో రెండుసార్లు అతడికి మైల్డ్ స్ట్రోక్ కూడా వచ్చినట్లు సమాచారం.
RIP to Michael Jones, known to #WWE fans as Virgil.
Here’s him beating Ted DiBiase for the Million Dollar title at SummerSlam 1991! pic.twitter.com/3PURPeKGzC— Nick Lombardi 💻✍ (@NickLombardiSK) February 28, 2024
Comments
Please login to add a commentAdd a comment