World Wrestling Entertainment
-
Virgil: WWE సూపర్‌స్టార్ కన్నుమూత
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ సూపర్‌స్టార్ మైకేల్ జోన్స్ కన్నుమూశాడు. డబ్ల్యుడబ్ల్యుఈ ప్రపంచంలో వర్జిల్‌గా ప్రసిద్ధి పొందిన అతడు 61 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని మైకేల్ జోన్స్ స్నేహితుడు, ప్రొ- రెజ్లింగ్ రిఫరీ మార్క్ చార్ల్స్ III సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘‘మనందరం ఎంతగానో ప్రేమించే మైకేల్ జోన్స్.. వర్జిల్, విన్సెంట్, సౌల్ ట్రెయిన్‌గా సుపరిచితుడైన మన స్నేహితుడు ఇక లేరనే విషాద వార్తను బాధాతప్త హృదయంతో మీతో పంచుకుంటున్నా. వర్జిల్ ప్రశాంతంగా ఆస్పత్రిలోనే కన్నుమూశాడు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని మార్క్ చార్ల్స్ సంతాపం వ్యక్తం చేశాడు. డబ్ల్యుడబ్ల్యుఈ కూడా మైకేల్ జోన్స్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ అతడి కుటుంబం, అభిమానులకు సానుభూతి ప్రకటించింది. WWE is saddened to learn that Michael Jones, known to WWE fans as Virgil, has passed away. WWE extends its condolences to Jones’ family, friends and fans. pic.twitter.com/i9QDodn9BD — WWE (@WWE) February 28, 2024 కాగా 1962లో అమెరికాలోని పెన్సిల్వేనియాలో జన్మించిన మైక్ జోన్స్ 1980వ దశకంలో సౌల్ ట్రైన్ జోన్స్ పేరిట ప్రొఫెషనల్ రెజ్లర్‌గా మారాడు. 1986లో డబ్ల్యుడబ్ల్యుఈలో లూయిస్ బ్రౌన్‌గా అడుగుపెట్టి.. ఆ తర్వాత వర్జిల్‌గా కొనసాగాడు. ఈ క్రమంలో 1994లో డబ్ల్యుడబ్ల్యుఈ నుంచి బయటకు వచ్చిన జోన్స్ రెండేళ్లపాటు ఆ తర్వాత ఇండిపెండెంట్ సర్య్కూట్లో పలు పోటీల్లో పాల్గొన్నాడు. ఇక తరచూ అనారోగ్యం బారిన పడటం మూలాన వైద్య పరీక్షలు చేయించుకోగా తనకు కొలన్ క్యాన్సర్(పెద్ద పేగు క్యాన్సర్) ఉన్నట్లు తేలిందని మైక్ జోన్స్ 2022లో ప్రకటించాడు. అదే విధంగా డిమోన్షియా(మతిమరుపు)తో బాధపడుతున్నట్లు తెలిపాడు. కాగా గతంలో రెండుసార్లు అతడికి మైల్డ్ స్ట్రోక్ కూడా వచ్చినట్లు సమాచారం. RIP to Michael Jones, known to #WWE fans as Virgil. Here’s him beating Ted DiBiase for the Million Dollar title at SummerSlam 1991! pic.twitter.com/3PURPeKGzC — Nick Lombardi 💻✍ (@NickLombardiSK) February 28, 2024 -
తీవ్ర విషాదం.. 30వ ఏట డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ సారా లీ హఠాన్మరణం
WWE- Sara Lee: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) మాజీ రెజ్లర్ సారా లీ హఠాన్మరణం చెందారు. తన ప్రదర్శనతో రెజ్లింగ్ అభిమానులను అలరించిన ఆమె తన 30వ ఏట చనిపోయారు. ఈ విషయాన్ని సారా తల్లి టెర్రీ లీ శుక్రవారం ధ్రువీకరించారు. సోషల్ మీడియా వేదికగా కూతురి మరణవార్తను తెలియజేశారు. సారా ఈ లోకాన్ని వీడి శాశ్వతంగా వెళ్లిపోయిందని.. ఆమె అంత్యక్రియల ఏర్పాట్లు కూడా ఇంకా పూర్తి కాలేదంటూ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశారు. ఈ విషాద సమయంలో తమ కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. అయితే, ఆమె మరణానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. కాగా 2015లో డబ్ల్యూడబ్ల్యూఈ రియాలిటీ కాంపిటీషన్ ‘టఫ్ ఎనఫ్’ సిరీస్ విజేతగా నిలిచిన సారా లీ మృతి పట్ల డబ్ల్యూడబ్ల్యూఈ విచారం వ్యక్తం చేసింది. మహిళా క్రీడాలోకంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఇక లేరనే విషాదకర వార్త తెలిసిందని.. ఆమె కుటుంబం, స్నేహితులు, అభిమానులకు సంతాపం తెలిపింది. WWE is saddened to learn of the passing of Sara Lee. As a former "Tough Enough" winner, Lee served as an inspiration to many in the sports-entertainment world. WWE offers its heartfelt condolences to her family, friends and fans. pic.twitter.com/jtjjnG52n7 — WWE (@WWE) October 7, 2022 అదే విధంగా డబ్ల్యూడబ్ల్యూఈ మహిళా రెజ్లర్లు పలువురు సారాతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘హృదయం ముక్కలైంది. ఈ విషాదాన్ని ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు’’ అంటూ సరాయా, చెల్సీ గ్రీన్.. సారాతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. కాగా సహచర రెజ్లర్ వెస్టిన్ బ్లేక్‌ను పెళ్లాడిన సారాకు ముగ్గురు సంతానం ఉన్నట్లు సమాచారం. No tweet or amount of words can bring back this beautiful human, but all of my heart goes out to @TheWestinBlake & their family. Sara Lee will be missed greatly. ♥️ The photo on the left is how I will always remember her - laughing, smiling, carefree. pic.twitter.com/XLlLFXDOcF — CHELSEA GREEN (@ImChelseaGreen) October 6, 2022 చదవండి: Ind Vs SA- WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023కి మేము ‘అర్హత’ సాధించడం కష్టమని తెలుసు! అయినా.. BCCI Electoral Rolls: గంగూలీ, జై షా కాదు.. బీసీసీఐ తదుపరి అధ్యక్షుడు అతడేనా..? -
అందమైన భామల మధ్య వేలంవెర్రి పోటీ!
‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్’ పోటీలను వేలంవెర్రిలాగా చూస్తున్న జనాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారనే విషయం తెల్సిందే. అదే తరహాలో ఇప్పుడు బ్రిటన్ విద్యార్థులకు వేలం వెర్రిలాగ ఓ ఆట పట్టుకుంది. అదే బాక్సింగ్. డబ్లూడబ్లూఎఫ్ పోటీల్లో పాల్గొనే కండల వీరులు కదం తొక్కుతు రింగ్‌లోకి వస్తుంటే అందమైన భామలు కరతాల ధ్వనులతో హావభావాలతో వారికి స్వాగతం చెప్పడం, నిర్వాహకులు హంగామా చేయడం తెల్సిందే. అదే తరహాలో లండన్‌లో జరుగుతున్న బాక్సింగ్‌లో పాల్గొనే విద్యార్థులు చొక్కా లేకుండా వేదికపైకి వస్తుంటే పొగ గొట్టాలు చిమ్మడం, గాలి బుడగల నురుగు ఎగిసి పడటం, స్వర్ణ కాంతులు విరజిమ్మడం చూడముచ్చటగా ఉంటుంది. అంతకన్నా ముచ్చటగా ఉండే ముద్దుగుమ్మలు హొయలుపోతూ పోటీదారులకు స్వాగతం చెప్పడం, కరతాళ ధ్వనులతో తోటి విద్యార్థినులే వారిని ప్రోత్సహించడం అంతా ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌లా ఉంటుంది. అదిరిపోయే సంగీత హోరు మధ్య బాక్సర్లు ఒకరికొకరు తలపడుతుంటే తాగుతున్న విద్యార్థి, కుర్రకారులోకం తన్మయులై చూస్తుంటారు. తెల్లారాక తీరిగ్గా ఇల్లు వెతుక్కుంటూ వెళతారు. డబ్లూడబ్లూఎఫ్ పోటీలు లైసెన్స్‌తో నడుస్తున్నాయి. కానీ విద్యార్థులు పాల్గొంటున్న ఈ బాక్సింగ్ పోటీలకు మాత్రం ఎలాంటి లైసెన్స్‌లు లేవు. పర్యవసానంగా కొన్నిసార్లు విద్యార్థులు మత్యువాత కూడా పడుతున్నారని తెలుస్తోంది. లైసెన్స్డ్ బాక్సింగ్ పోటీలు ప్రభుత్వ హయాంలో నడుస్తుంటే లైసెన్స్ లేకుండా చాటుమాటుగా రాత్రిపూట నడుస్తున్న బాక్సింగ్ పోటీలను ప్రైవేటు కంపెనీలు నిర్వహిస్తున్నాయి. కార్డిఫ్ నగరంలో ఇలాంటి పోటీలను ‘పేపర్ ఏజెన్సీ యూకే’ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ పోటీలకు విద్యార్థులనే ఎన్నుకోవడానికి కారణం. గ్యాధరింగ్ ఎక్కువగా ఉంటుందని, ప్రచారం ఎక్కువగా లభిస్తుందని. ఇదే విషయమై పేపర్ ఏజెన్సీని మీడియా ప్రశ్నించగా, తాము టాలెంట్ హంట్లాగా విద్యార్థులకు ఉపయోగపడుతున్నామని, ప్రభుత్వ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం అందరికి రాదని, అందుకనే తాము మున్ముందు బాక్సింగ్‌లో రాణించగల జాతి రత్నాలను ఇప్పటి నుంచే వెలికి తీస్తున్నామని చెప్పారు. పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. తలకు రక్షణగా హెల్మెట్, చేతికి సరైన గ్లౌజులతోనే పోటీకి అనుమతిస్తామని, పోటీదారులకు కూడా ప్రొఫెషనర్స్తోనే శిక్షణ ఉంటుందని, పోటీదారులకు భారత కరెన్సీలో 20 కోట్ల రూపాయల వరకు జీవిత బీమా చేసినట్టు చెప్పారు. ఈ పోటీలతో కార్డిఫ్ యూనివర్శిటీ, కార్డిఫ్ మెట్రోపాలిటన్ యూనివర్శిటీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తమకు కూడా ఎలాంటి సంబంధం లేదని ఇగ్లండ్ బాక్సింగ్, వేల్ష్ అమెచ్యూర్ బాక్సింగ్ అసొసియేషన్ స్పష్టం చేశాయి. ఈ ప్రైవేటు పోటీలు సురక్షితం కావని, బాక్సింగ్ పోటీలకు అనవసరంగా చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉందని ఇంగ్లండ్ బాక్సింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గెతిన్ జెన్కిన్స్ హెచ్చరించారు. తాను మాత్రం గత ఏడు వారాలుగా ప్రొఫెషనల్ బాక్సర్‌తోనే శిక్షణ తీసుకుంటున్నానని కార్డిఫ్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనబోతున్న 22 ఏళ్ల క్రిస్ కాన్వే తెలిపారు. బాక్సింగ్ పోటీలప్పుడు వైద్యులు అందుబాటులో ఉంటారని, అయితే పోటీదారులకు ముందుగానే హెల్త్ చెకప్‌లు చేయడం ఏమీ ఉండదని గతంలో ఈ పోటీల్లో పాల్గొన్న ఎక్సెటర్, బాత్, న్యూకాజల్, గ్లాస్గో, సెయింట్ ఆండ్రీస్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోటీలకు ముందుగా బాక్సర్లు వైద్య పరీక్షలు చేసుకొని ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అనధికారికంగా జరుగుతున్న పోటీలు రేపు ‘ఐపీఎల్ బాక్సింగ్’ పోటీలకు దారితీయవచ్చేమో! -
కండలరాణి.. కవితా దేవి రికార్డ్!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న గేమ్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ). భారత్‌లోనూ ఈ గేమ్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ ఆదరణను క్యాష్ చేసుకొని.. ఇక్కడి మార్కెట్లోనూ పాగా వేసేందుకు డబ్ల్యూడబ్ల్యూఈ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ భారత మహిళా రెజ్లర్ కవితా దేవిని తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈలో తీసుకున్నారు. ఇటీవల న్యూఢిల్లీ పర్యటనకు వచ్చిన డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్ జిందర్ మహాల్ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తద్వారా డబ్ల్యూడబ్ల్యూఈలో పాల్గొంటున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా కవితా దేవి రికార్డు సృష్టించారు. హరియాణకు చెందిన కవితా దేవి ప్రముఖ రెజ్లర్ ద గ్రేట్ ఖలీ (దిలీప్‌సింగ్ రాణా) వద్ద శిక్షణ పొందారు. బీబీ బుల్బుల్ అనే రెజ్లర్‌ను ఓడించడం ద్వారా కవితా దేవి పాపులర్ అయ్యారు. 2016లో దక్షిణాసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని గెలుపొందారు. -
ట్రూ ఇండియన్
సంప్రదాయం గాలిలో ఉన్న ఈ మల్లయోధురాలి పేరు డకోటా కాయ్. దేశం.. న్యూజిలాండ్. ఇక ఆమెను గాలిలోకి ఎత్తిపట్టుకున్న ‘మల్లమ్మ’.. మన అమ్మాయి కవిత! ‘ది గ్రేట్ కాళి’ దిలీప్ సింగ్ (పంజాబ్) శిష్యురాలు. యు.ఎస్.లో జూలైలో మొదలై నిన్నటితో ముగిసిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్ మెంట్ పోటీలలోని ‘మే యంగ్ క్లాసిక్’ స్మారక ఈవెంట్లో గత నెల కవిత, కాయ్తో తలపడింది. ఆ పోటీలో ఓడిపోయినప్పటికీ.. చుడీదార్ వేసుకుని, నడుముకు దుపట్టా చుట్టుకుని, బూట్లు ధరించి బరిలోకి దిగిన కవిత తన ప్రత్యర్థిని ఎత్తిపట్టుకుని పై చెయ్యి సాధించిన దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్లో భారతీయ ఆత్మను రెపరెపలాడిస్తోంది. అఫిషియల్ యూట్యూబ్ చానల్లో ఈ ఫైటింగ్ వీడియోను ఆగస్టు 31న అప్లోడ్ అయినప్పటి నుంచీ ఇప్పటి వరకు 48 లక్షల మంది వీక్షించారు! ఈ తరహా వరల్డ్ రెజ్లింగ్ లో పాల్లొన్న తొలి భారతీయ యువతిగా కన్నా కూడా, భారతీయ వస్త్రధారణతో పోటీలో పాల్గొన్న అచ్చమైన ఇండియన్‌గా కవిత ప్రశంసలు పొందుతున్నారు. కవిత రెజ్లర్ మాత్రమే కాదు. వెయిట్ లిఫ్టర్ కూడా. 2016లో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో 75 కిలోల విభాగంలో స్వర్ణపతకాన్ని గెలుచుకున్నారు. ఈ నెల 20న కవిత పుట్టినరోజు. రెజ్లింగ్‌లో గెలిచి ఉంటే అదొక మంచి సందర్భం అయిఉండేది. అయితే అంతకంటే మంచి కానుకను ఆమె ఫైటింగ్ కాస్ట్యూమ్స్ ఆమెకు తెచ్చిపెట్టాయి. -
చరిత్ర సృష్టించిన కవిత.. వైరల్ వీడియో
-
అంతా ఉత్తుత్తిదే!
అవన్నీ నిజం ఫైట్స్ కాదు డబ్ల్యూడబ్ల్యూఈ ఓ టీవీ సీరియల్ దాదాపు రెండు దశాబ్దాల క్రితం భారత్‌లో కొత్తగా కేబుల్ ప్రసారాలు ప్రారంభమైన రోజులవి... స్పోర్ట్స్ చానల్లో వచ్చే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పిల్లల్ని కట్టిపడేసింది. బయట ఆటలకు కూడా పోకుండా టీవీలకు అతుక్కునేలా చేసింది. ఇద్దరు బలమైన వ్యక్తులు ఒకరినొకరు భయంకరంగా రక్తం వచ్చేలా కొట్టుకునేవాళ్లు. దాదాపు 20 సంవత్సరాలు గడిచిపోయాయి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పేరు మార్చుకుని డబ్ల్యూడబ్ల్యూఈ అయ్యింది. అప్పట్లో టీవీలకు అతుక్కుని దీనిని చూసిన వాళ్లు... ఇప్పుడు తమ పిల్లలు దీనిని చూస్తుంటే రిమోట్ ఇచ్చేస్తున్నారు. చూసే తరాలు మారినా వినోదం అలాగే ఉంది. అయితే ఇది నిజమైన యుద్ధం కాదని, కేవలం స్క్రిప్ట్ ప్రకారం సాగే ఓ సీరియల్ మాత్రమే అని తెలిసిన వాళ్లు తక్కువే. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు ‘కుస్తీ’... భారతీయులకు పెద్దగా పరిచయం అక్కర్లేని క్రీడ. కండలు తిరిగిన వస్తాదులు పోటీపడుతుంటే ఆసక్తిగా చూసే వాళ్లకు కొదువే ఉండదు. అంతర్జాతీయంగా దీన్ని రెజ్లింగ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒలింపిక్స్‌లో కూడా క్రీడాంశమే. ఈ రెజ్లింగ్‌కు కాస్త గ్లామర్ జోడిస్తే అదే డబ్ల్యూ.డబ్ల్యూ.ఈ. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల రెజ్లర్లు డబ్ల్యూడబ్ల్యూఈలో పాల్గొంటారు. ఈ రెజ్లింగ్‌ను అభిమానించే వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల మంది ఉన్నారు. అయితే ఇది అంతగా ఆకట్టుకోవడానికి కారణం ఆ ఆటలోని ప్రత్యేకత. కండలు తిరిగిన రెజ్లర్లు ప్రత్యర్థిని ఇష్టమొచ్చినట్లుగా కొట్టడమే ఈ రెజ్లింగ్. రకరకాల ఫీట్లు ఈ రెజ్లింగ్‌కు మరింత వన్నె తెచ్చిపెట్టాయి. రెజ్లింగ్‌ను టీవీల్లో చూసిన వాళ్లకు ఇలా కొట్టుకుంటే ఎవరైనా బతుకుతారా అనే సందేహం రాక మానదు.. అలా ఉంటాయి ఫీట్లు. స్టోరీ-స్క్రీన్‌ప్లే-డెరైక్షన్... ఒళ్లు గగుర్పొడిచే ఈ ఫీట్లు చేస్తే ఎవరైనా కచ్చితంగా ఆస్పత్రి పాలు కావాల్సిందే . కానీ ఈ రెజ్లర్లకు మాత్రం సాధారణంగా ఏమీ కాదు. ఇందుకు కారణం ఇదంతా డ్రామానే. ఒకడు కొడుతుంటాడు.. ఇంకొకడు చేష్టలుడిగిపోయి దెబ్బతింటుంటాడు... మనకు కనిపించేది అంతవరకే. కానీ అదంతా తూచ్. డబ్ల్యూడబ్ల్యూఈ అంతా నటన. రెజ్లింగ్‌ను వినోదాత్మకంగా చూపించడమే దీని పని. స్క్రిప్ట్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయి. ఎలా ఆడాలి.. ఎలా రక్తికట్టించాలి.. అన్నదే ఇందులో ప్రధానం. అయితే ఇదంతా నిజం అని భ్రమ కల్పించేలా ఫీట్లు ఉంటాయి. అవి అంతవరకే నిజం. నిజానికి ఈ రెజ్లింగ్ మ్యాచ్‌లు అచ్చం సినిమాల్లో కథలా, టీవీల్లో సీరియల్లా సాగుతాయి. కథనంతో మ్యాచ్‌లను రక్తికట్టిస్తారు.. ఎప్పుడూ ఒకేలా పోటీలు జరిగితే ఎవరికీ ఆసక్తి ఉండదు. అందుకే శృంగార సంబంధాలు, ఒకడి లవర్‌ను మరొకడు ఎత్తుకెళ్లడం, ముక్కోణపు ప్రేమ కథలు, పెళ్లిళ్లు, ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకోవడం, జాతి వివక్ష, కిడ్నాప్‌లు... ఇలా డబ్ల్యూడబ్ల్యూఈలో స్క్రిప్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కసారి డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ చూస్తే ఇందులో ఎంత డ్రామా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది.‘డబ్ల్యూడబ్ల్యూఈలో ట్రిపుల్ హెచ్ స్టార్ రెజ్లర్.. అతనికో గర్ల్‌ఫ్రెండ్ ఉంది. పేరు స్టెపనీ మెక్‌మహోన్. తోటి రెజ్లర్ (డానియల్ బ్రయాన్) ఆమెతో అనుచితంగా ప్రవర్తిస్తాడు. ఈవిషయాన్ని స్టెపనీ, ట్రిపుల్ హెచ్ దగ్గర మొర పెట్టుకుంటుంది. ఎందుకిలా చేశావంటూ అతను బ్రయాన్‌ను నిలదీస్తాడు. అయితే అనుచితంగా ప్రవర్తించిన బ్రయాన్‌ను చితక్కొడతాడని ఆమె అనుకుంటుంది. కానీ ట్రిపుల్ హెచ్ ఏమీ చేయకపోవడంతో స్టెపనీ, సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదు చేస్తుంది. వాళ్లొచ్చి అతని చేతికి బేడీలు వేస్తారు. నీవేమీ చేయలేకపోయావంటూ ట్రిపుల్హెచ్పై మండిపడుతుంది. దీంతో అతనికి ఎక్కడా లేని కోపం వస్తుంది. బేడీలతో ఉన్న బ్రయాన్‌ను ట్రిపుల్ హెచ్ చితక్కొట్టేస్తాడు. అంతేకాదు ఆమెతో కూడా కొట్టిస్తాడు. మొత్తానికి తగినశాస్తి జరిగిందంటూ స్టెపనీ తెగ సంబరపడిపోతుంది. చివరికి బ్రయాన్‌ను మ్యాచ్‌లో ఓడించడంతో ఆ ఆనందంలో ట్రిపుల్ హెచ్‌ను ముద్దాడుతుంది. ఇలా ప్రతీ మ్యాచ్ ఆద్యంతం ప్రేక్షకులు ఆసక్తికరంగా చూసేలా ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తారు. సాధారణంగా ప్రొఫెషనల్ రెజ్లింగ్ మ్యాచ్‌లు ఇలా జరగవు. ఉత్తుత్తి మ్యాచ్‌లు కాబట్టే ఇలా సీరియల్లా రక్తికట్టిస్తారు. సూపర్ టెక్నిక్స్... సాధారణంగా రెజ్లింగ్ క్రీడ యుక్తితో కూడుకున్నది. ప్రత్యర్థిని మట్టికరిపించాలంటే బలమొక్కటే సరిపోదు. యుక్తి కూడా ప్రధానం. దీంతో పాటు వేగం, చురుకుదనం రెజ్లింగ్‌లో విజేతను నిర్ణయిస్తాయి. బలంతో కొట్టలేని రెజ్లర్లు ప్రత్యర్థిని టెక్నిక్‌తో చిత్తు చేస్తారు. స్క్రిప్ట్ ప్రకారం పోటీలు జరిగినా...ప్రేక్షకులను ఆకట్టుకునేవి రెజ్లింగ్ టెక్నిక్లే. ఈ రెజ్లింగ్‌లో లెక్కలేనన్ని టెక్నిక్‌లు ఉన్నాయి. ఇవే అభిమానులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. డైవింగ్ బుల్డాగ్, డైవింగ్ హెడ్‌బట్, డైవింగ్ షోల్డర్ బ్లాక్, ఫ్లయింగ్ నెక్ బ్రేకర్, ఫ్లయింగ్ స్పైనంగ్ హీల్ కిక్, సూసైడ్ డైవ్, ప్లాంచా, రోప్ వాక్, సోమర్సాల్ట్, సూపర్ ప్లెక్స్, పవర్ బాంబ్స్, ఫ్రాగ్ స్ప్లాష్, సెన్టెన్ బాంబ్, సీటెడ్ సెన్టెన్ బై సైకిల్ కిక్, సూపర్ కిక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆటలో ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు చాలా టెక్నిక్లే ఉన్నాయి. అయితే వీటిలో చాలా టెక్నిక్‌లు ప్రమాదకరమైనవి. అందుకే వీటిని ప్రదర్శించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ అప్పుడప్పుడు అనుకోని ప్రమా దాలు జరుగుతాయి. రిస్క్‌తో కూడిన టెక్నిక్లను ప్రదర్శించడం ద్వారా రెజ్లర్లు ప్రమాదాల బారిన పడిన సందర్భాలున్నాయి. మనోడూ ఉన్నాడు రాక్, అండర్టేకర్, ట్రిపుల్ హెచ్, కేన్, రికిషి, క్రిస్ బెనాయిట్, స్టోన్ కోల్డ్, రాండీ ఆర్టన్, జాన్ సెనా, క్రిస్ జెరికో...ఇలా డబ్ల్యూడబ్ల్యూఈలో చాలామంది స్టార్స్ ఉన్నారు. ఈ స్టార్స్ జాబితాలో భారతదేశానికి చెందిన ఓ రెజ్లర్కూడా ఉన్నాడు. పేరు... దలిప్ సింగ్ రాణా అలియాస్ ది గ్రేట్ ఖలీ. పంజాబ్‌లో పుట్టి పెరిగిన ఖలీ ఎనిమిదేళ్లుగా డబ్ల్యూడబ్ల్యూఈలో ఆకట్టుకుంటున్నాడు. ఏడు అడుగుల 1 అంగుళం పొడుగు ఉండే ఈ భారీకాయుడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్నట్లు ఖలీ రెజ్లింగ్ పాపులారిటీతో బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. డబ్ల్యూడబ్ల్యూఈలోకి అడుగుపెట్టే కంటే ముందే ద లాంగెస్ట్ యార్డ్ (2005లో)అనే హాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. గెట్ స్మార్ట్ (2008), మెక్ గ్రూబెర్ (2010)తో పాటు 2012లో ఓ ఫ్రెంచ్ సినిమాలో కూడా నటించాడు. 2010లో కుస్తీ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అదే ఏడాది రామా ది సేవిలియర్లో వాలిగా నటించి మెప్పించాడు. ఖలీ బాలీవుడ్, హాలీవుడ్‌లోనే కాదు.. బుల్లితెరపైనా మెరిశాడు. కలర్స్ చానెల్లో బిగ్ బాస్ రియాల్టీ షోలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. తొలి రన్నరప్‌గా నిలిచాడు. డబ్బే డబ్బు... ప్రస్తుతం ఇది వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూ ఈ)గా బాగా ప్రాచుర్యం పొందింది. అయితే గతంలో దీన్ని క్యాపిటల్ రెజ్లింగ్ కార్పొరేషన్, వరల్డ్ వైడ్ రెజ్లింగ్ ఫెడరేషన్, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్‌గా పిలిచేవారు. అమెరికాలోని స్టాంఫోర్డ్ కేంద్రంగా డబ్ల్యూడబ్ల్యూఈ కార్యకలాపాలు సాగుతున్నాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో డబ్ల్యూడబ్ల్యూఈగా ట్రేడవుతోంది. 1952లో ప్రొఫెషనల్ రెజ్లింగ్ ప్రమోషన్‌గా మొదలైన దీనికి జెస్ మెక్‌మహోన్, టూట్స్ మోండ్ సృష్టికర్తలు. అతికొద్ది మందితో మొదలైన ఈ రెజ్లింగ్.. ఇంతింతై అన్నట్లు 62 ఏళ్లుగా అభిమానులకు వినోదాన్ని అందిస్తోంది. ఏడాదికి 320 హౌస్ షోలతో 150 దేశాల్లో రెజ్లింగ్ పోటీలు ప్రసారమవుతున్నాయి. 2013లో డబ్ల్యూడబ్ల్యూఈ రాబడి : రూ. 3955.98 కోట్లు మొత్తం మిగులు ఆదాయం : రూ. 828 కోట్లు లాభం : రూ. 594 కోట్లు ఆస్తుల విలువ : రూ. 20,232 కోట్లు ఈక్విటీ : రూ. 13,248 కోట్లు