తీవ్ర విషాదం.. 30వ ఏట డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌ సారా లీ హఠాన్మరణం | WWE Former Star Sara Lee Passes Away At Age Of 30 Fans Mourn | Sakshi
Sakshi News home page

WWE: తీవ్ర విషాదం.. 30వ ఏట డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌ సారా లీ హఠాన్మరణం

Published Fri, Oct 7 2022 6:38 PM | Last Updated on Fri, Oct 7 2022 6:54 PM

WWE Former Star Sara Lee Passes Away At Age Of 30 Fans Mourn - Sakshi

సారా లీ (PC: WWE Twitter)

WWE- Sara Lee: వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌(డబ్ల్యూడబ్ల్యూఈ) మాజీ రెజ్లర్‌ సారా లీ హఠాన్మరణం చెందారు. తన ప్రదర్శనతో రెజ్లింగ్‌ అభిమానులను అలరించిన ఆమె తన 30వ ఏట చనిపోయారు. ఈ విషయాన్ని సారా తల్లి టెర్రీ లీ శుక్రవారం ధ్రువీకరించారు. సోషల్‌ మీడియా వేదికగా కూతురి మరణవార్తను తెలియజేశారు. 

సారా ఈ లోకాన్ని వీడి శాశ్వతంగా వెళ్లిపోయిందని.. ఆమె అంత్యక్రియల ఏర్పాట్లు కూడా ఇంకా పూర్తి కాలేదంటూ ఉద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేశారు. ఈ విషాద సమయంలో తమ కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎన్‌ఎన్‌ తన కథనంలో పేర్కొంది. అయితే, ఆమె మరణానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.

కాగా 2015లో డబ్ల్యూడబ్ల్యూఈ రియాలిటీ కాంపిటీషన్‌ ‘టఫ్‌ ఎనఫ్‌’ సిరీస్‌ విజేతగా నిలిచిన సారా లీ మృతి పట్ల డబ్ల్యూడబ్ల్యూఈ విచారం వ్యక్తం చేసింది. మహిళా క్రీడాలోకంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఇక లేరనే విషాదకర వార్త తెలిసిందని.. ఆమె కుటుంబం, స్నేహితులు, అభిమానులకు సంతాపం తెలిపింది.

అదే విధంగా డబ్ల్యూడబ్ల్యూఈ మహిళా రెజ్లర్లు పలువురు సారాతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘హృదయం ముక్కలైంది. ఈ విషాదాన్ని ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు’’ అంటూ సరాయా, చెల్సీ గ్రీన్‌.. సారాతో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. కాగా సహచర రెజ్లర్‌ వెస్టిన్‌ బ్లేక్‌ను పెళ్లాడిన సారాకు ముగ్గురు సంతానం ఉన్నట్లు సమాచారం.

చదవండి: Ind Vs SA- WC 2023: వన్డే వరల్డ్‌కప్‌-2023కి మేము ‘అర్హత’ సాధించడం కష్టమని తెలుసు! అయినా..
BCCI Electoral Rolls: గంగూలీ, జై షా కాదు.. బీసీసీఐ తదుపరి అధ్యక్షుడు అతడేనా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement