ఐఏఎస్ ఆఫీసర్ కుమార్తె, హైదరాబాద్‌లోనే చదువుకుంది. టెక్ దిగ్గజం భార్య. భర్తకు 450 కోట్ల జీతం. ఆమె స్వయంగా ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్. అయినప్పటికీ, ఉద్యోగంలో రాణించేందుకు అన్ని అర్హతులున్నా పిల్లలు, భర్త కోసం ఇంటికే పరిమితమైంది. వారి బాధ్యతలే ప్రధానంగా భావించింది. ఇంతకీ ఎవరీమె? తెలుసుకుందాం రండి!
అమె మరెవ్వరో కాదు ప్రపంచంలోనే దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ప్రియదర్శిని నాదెళ్ల. అనుగా పాపులర్ అయిన ఈమె.. ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ కుమార్తె. అనుపమ ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే జరిగింది. తరువాత మణిపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
సత్య నాదెళ్ల తండ్రి, అనుపమ తండ్రి కేఆర్ వేణుగోపాల్ ఇద్దరూ బ్యాచ్‌మేట్స్. వీరిద్దరి స్నేహం వియ్యానికి దారి తీసింది. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌లో చేరిన ఏడాదిలోనే (1992)అనుపమ నాదెళ్లను వివాహం చేసుకున్నారు.
పెళ్లి నాటికే సత్యనాదెళ్ల అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్. అయినా అనుపమ వీసా దరఖాస్తును యుఎస్ తిరస్కరించింది. దీంతో పర్యాటక వీసాతో కొంతకాలం కలసి ఉండాల్చి వచ్చింది. అయితే అనుపమను అమెరికా తీసుకెళ్లేందుకు, ఇమ్మిగ్రేషన్ వ్యవహరాలను సులభంగా పూర్తి చేసుకుందుకుగాను గ్రీన్ కార్డును వదులుకొని, తిరిగి హెచ్-1బీ వీసా తీసుకున్నారు. చివరికి ఇద్దరూ అక్కడ శాశ్వత నివాసితులయ్యారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు.
బిడ్డల కోసం
అత్యసవరస్థితిలో సిజేరియన్ ద్వారా తొలి చూరు కాన్పులో మగబిడ్డ జైన్‌కు జన్మనిచ్చింది. కానీ ఈ దంపతుల సంతోషం ఎంతో కాలం నిలవ లేదు. గర్భాశయ శ్వాసలోపం కారణంగా శిశువుగా ఎదగలేదు, తీవరమైన సెరిబ్రల్ పాల్సీ, స్పాస్టిక్ క్వాడ్రిప్లెజియాతో జైన్ బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు. తరువాత ఇద్దరు కుమార్తెలు తారా,దివ్య పుట్టారు. వీరిలో కూడా ఒకరి లెర్నింగ్ సమస్యలు తలెత్తాయి. దీంతో బిడ్డల కోసం ఆర్కిటెక్ట్‌గా తన కెరీర్ నుండి తప్పుకుంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులతో బాధపడుతున్న పిల్లల జీవితాలను అనుపమ నాదెళ్ల సానుకూలంగా తీర్చిదిద్దుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ 2022లో 26 ఏళ్ల కుమారుడు జైన్ మరణం వారి జీవితాల్లో పెద్ద విషాదం. అప్పటినుంచి ఆమె సీటెల్ చిల్డ్రన్స్ హాస్పిటల్, భాగస్వామ్యంతో పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలపై దృష్టి సారించారు.
అంతేకాదు భర్త సత్యకు దీర్ఘకాల భాగస్వామిగా, నాదెళ్ల కుటుంబానికి పెద్ద అండగా నిలబడ్డారు. సమస్యలతో ఉన్న బిడ్డల్ని సాదుకుంటూ, వారిని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వారి అభివృద్ధికి కృషి చేశారు. మైక్రోసాఫ్ట్ బిలియనీర్ సీఈవో భార్యగా ప్రపంచంలోనే అత్యత్తుమ కంపెనీ సీఈవో భార్యగా భర్తకు వెన్నంటి ఉంటూ ఆయన విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ జనవరి 11న 2.87 ట్రిలియన్లడాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 2024 ఫిబ్రవరి నాటికి సత్య నాదెళ్ల నికర విలువ 974 మిలియన్ డాలర్లు.
కాగా కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలు, రైతు కూలీలను ఆదుకునేందుకు అనుపమ పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రైతులు, వ్యవసాయ కూలీల అదనపు ఉపాధి కోసం అనుపమ 2 కోట్ల రూపాయిల విరాళం ప్రకటించారు. అనంతపురం కేంద్రంగా నడుస్తోన్న యాక్షన్ ఫ్రేటార్నా ఎకాలజీ సెంటర్‌కు ఈ విరాళాన్ని అనుపమ అందచేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment