శతమానం భవతి.. తొలిరోజు వసూళ్లెంత? | Shatamanam Bhavathi first day collections | Sakshi
Sakshi News home page

శతమానం భవతి.. తొలిరోజు వసూళ్లెంత?

Published Mon, Jan 16 2017 9:09 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

శతమానం భవతి.. తొలిరోజు వసూళ్లెంత?

శతమానం భవతి.. తొలిరోజు వసూళ్లెంత?

సంక్రాంతి పండుగ బరిలో చిరంజీవి 'ఖైదీ నంబర్ 150', బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి'లాంటి చిత్రాలు ఉన్నా.. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'శతమానం భవతి'. చక్కని కుటుంబకథా నేపథ్యంతో పచ్చని పల్లెటూరు వాతావరణంలో  సకుటుంబసమేతంగా చూడదగ్గ సినిమాగా తెరకెక్కిన 'శతమానం భవతి' పెద్ద సినిమాల నడుమ కూడా మంచి వసూళ్లు రాబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తొలిరోజు రూ. మూడు కోట్లు వసూలు చేసినట్టు చెప్తున్నారు. చిన్న సినిమాగా సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమాకు ఇది మంచి ఆరంభమేనని చెప్పవచ్చు.

శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధలు ప్రధాన తారాగణంగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కౌట్‌ అవ్వడం 'శతమానం భవతి'కి ప్లస్ పాయింట్‌ గా మారిందని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement