టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు ఎప్పటికప్పుడూ తన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలానే ఈసారి తన వర్క్‌ఔట్‌లకు సంబంధించిన పోటోలను షేర్ చేశారు. అంతేగాదు దానికి 'ఎప్పటికీ ఉదయపు సూర్యుడినే కోరుకుంటారు' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశారు. పైగా వేకువజాముకి మించిన మంచి సమయం మరోకటి లేదు అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది సమంత. ఆ ఫోటోలకు ప్రతిస్పందనగా ప్రముఖ సెలబ్రెటీలు, అభిమానుల కామెంట్లోతో పోస్ట్‌లు వెల్లువలా వచ్చాయి. సమంత ఉదయపు సూర్యుడి కోసం వెతుకుతున్నట్లుగా ఉంది ఆ ఫోజ్ అంటూ ఉదయిస్తున్న సూర్యుడి ఎమోజీలతో పోస్ట్‌లు పెట్టారు.
ఇక ఫిల్మ్ మేకర్ నందిని రెడ్డి చమత్కారంగా ఇప్పుడే రెండుసార్లు వర్క్‌ఔట్‌లు చేశా! అంటూ సన్‌గ్లాసెస్ ఎమోజీలతో పోస్టులు పెట్టారు. అలగే మృణాల్ ఠాకూర్ ఆమె వయసు జస్ట్ 23 అన్నట్లు ఉంది అంటూ హార్ట్ సింబర్ ఎమోజీని పెట్టింది. ఇక సమంత 2022లో మైయోసిటిస్ అని పిలిచే ఆటో ఇమ్యూన్ పరిస్థితితో బాధపడిన సంగతి తెలిసిందే. అందుకోసం నటనకు కొంతకాలం విరామం కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడమే గాక తనలా ఎవ్వరూ అలాంటి స్థితిని ఎదుర్కొనకూడదని 'టేక్ 20' అనే హెల్త్ పాడ్ కాస్ట్‌కి సంబంధించిన ఓ యూట్యూబ్ ఛానెల్‌ని కూడా ఇటీవల ప్రారంభించింది. ఇందులో ప్రముఖ ఆరోగ్య నిపుణుడి సలహాలతో విలువైన సమాచారం అందిస్తామని ఆ ఛానెల్ టీజర్‌ని రీలీజ్‌కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ వెల్లడించారు.
ఈ సమస్య రావడానికి ముందు సంవత్సరం చాలా కష్టంగా గడిచింది. చివరికి కోలుకుని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నా. హాయిగా ఊపిరి పీల్చుకోగులుగుతున్నా అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను నటనపై దృష్టి పెడుతున్నానని, షూటింగ్‌లలో పాల్గొననున్నట్టు తెలిపింది. ఇక ఈ పోడోకాస్ట్‌ని తనలా ఎవ్వరూ ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న కాలుష్య ప్రపంచంలో మనల్ని మనం సేఫ్‌గా ఉంచుకునేలా ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే వాటి గురించి ప్రముఖ నిపుణులతో మాట్లాడి అత్యంత విలువైన సమాచారం ఇవ్వనున్నట్లు వెల్లడించి సమంత.
ఎర్లిమార్నింగ్ వర్క్‌ఔట్‌లు చేస్తే..
సెలబ్రెటీలు, కామన్‌పీపుల్స్.. ఎవ్వరైనా సరే ఉదయమే చేసే వర్క్‌ఔట్‌లు ఎప్పటికీ మనలో నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయి. ఉదయమే చేసే వర్క్ ఔట్‌లతో దేహం చురుకుగా ఉంటుంది. ఎలాంటి రుగ్మతలు ఉన్నా తగ్గడం లేదా అదుపులో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మన ముఖంలో కూడా ఏదో తెలియని వెలుగు కనిపిస్తుంది. ఇలా అందరూ తాము చేయగలిగనన్ని వర్క్‌ఔట్‌లు చేసి ఆరోగ్యంగా ఉండండి. అంతేకాదండోయ్ ఇలా చేస్తే మన జీవితం కూడా ఉదయపు సూర్యుడిలా ప్రకాశవంతంగా సాగిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
(చదవండి: టోపీ, హెల్మెట్లు వల్ల బట్టతల వస్తోందా? నిపుణులు ఏమంటున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment