సినిమా హీరోలంటే.. తమ ఫిట్‌నెస్‌ను, ఫిజిక్‌ను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వాళ్లు నిరంతరం వర్కవుట్లు చేస్తూనే ఉండాలి. చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా కూడా ఇది మాత్రం తప్పదు. ఇక ఇప్పటికే చేతిలో సినిమాలు ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా ఉంటారు. తమిళంలో సెన్సేషనల్ హిట్ అయిన తని ఒరువన్ రీమేక్ 'ధ్రువ' హీరోగా చేస్తున్న హీరో రాంచరణ్ కూడా ఫిట్‌నెస్ ఫ్రీక్ అనే చెబుతుంటారు.