RIP Sidharth Shukla: బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మృతితో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 40 ఏళ్ళకే యువనటుడు గుండెపోటుతో మృతి చెందడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. తీవ్రమైన గుండెపోటు రావడంతో గురువారం ఉదయం 10.30 నిమిషాలకు సిద్ధార్థ్ తుదిశ్వాస విడిచారు. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉల్లాసంగా కనిపించే సిద్ధార్థ్ లేడన్న వార్త అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే సిద్ధార్థ్ ఘటన జరగడానికి ముందురోజు సైతం వర్కవుట్స్ చేసినట్లు సమాచారం.
చదవండి : సిద్ధార్థ్ శుక్లా చివరి క్షణాలు ఇవేనంటూ వీడియో వైరల్.. నిజం ఏంటంటే?
రాత్రి 8గంటలకు ఇంటికి చేరుకున్న సిద్ధార్థ్..పది గంటల సమయంలో జాగింగ్‌తో పాటు కొన్ని వర్కవుట్స్ చేశాడని తెలుస్తుంది. అనంతరం నిద్రపోయే ముందు అతను కొన్ని మెడిసిన్స్ తీసుకున్నాడని, అయితే తెల్లవారుజామున 3గంటలకు ఛాతిలో నొప్పి రావడంతో తన తల్లికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఆమె స్వయంగా నీళ్లు తాగించిందని, అనంతరం నిద్రపోయిన సిద్ధార్థ్ మళ్లీ మేల్కోలేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే సిద్ధార్థ్ ప్రతిరోజు క్రమం తప్పకుండా దాదాపు 3గంటల పాటు వ్యాయామం చేసేవాడట. అయితే వర్కవుట్ సమయాన్ని కాస్త కుదించమని ఇటీవలె వైద్యులు సలహా ఇచ్చినట్లు సమాచారం. తీవ్రమైన వర్కవుట్స్ కూడా ప్రమాదమేనని వైద్యులు అంటున్నారు. ఆర్థిక జీవనశైలితో పాటు ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే గుండెపోటు తలెత్తడం వంటివి జరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. శారీరక దాడృత్యంతో పాటు మాససిక ప్రశాంతత కూడా ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు.
చదవండి : Sidharth Shukla: ఆరోజు రాత్రి ఏం జరిగింది.. పోస్ట్‌మార్టం నివేదికలో ఏముంది?
Comments
Please login to add a commentAdd a comment