Cooper Hospital
-
డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా?
RIP Sidharth Shukla: బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మృతితో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 40 ఏళ్ళకే యువనటుడు గుండెపోటుతో మృతి చెందడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. తీవ్రమైన గుండెపోటు రావడంతో గురువారం ఉదయం 10.30 నిమిషాలకు సిద్ధార్థ్ తుదిశ్వాస విడిచారు. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉల్లాసంగా కనిపించే సిద్ధార్థ్ లేడన్న వార్త అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే సిద్ధార్థ్ ఘటన జరగడానికి ముందురోజు సైతం వర్కవుట్స్ చేసినట్లు సమాచారం. చదవండి : సిద్ధార్థ్ శుక్లా చివరి క్షణాలు ఇవేనంటూ వీడియో వైరల్.. నిజం ఏంటంటే? రాత్రి 8గంటలకు ఇంటికి చేరుకున్న సిద్ధార్థ్..పది గంటల సమయంలో జాగింగ్‌తో పాటు కొన్ని వర్కవుట్స్ చేశాడని తెలుస్తుంది. అనంతరం నిద్రపోయే ముందు అతను కొన్ని మెడిసిన్స్ తీసుకున్నాడని, అయితే తెల్లవారుజామున 3గంటలకు ఛాతిలో నొప్పి రావడంతో తన తల్లికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఆమె స్వయంగా నీళ్లు తాగించిందని, అనంతరం నిద్రపోయిన సిద్ధార్థ్ మళ్లీ మేల్కోలేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే సిద్ధార్థ్ ప్రతిరోజు క్రమం తప్పకుండా దాదాపు 3గంటల పాటు వ్యాయామం చేసేవాడట. అయితే వర్కవుట్ సమయాన్ని కాస్త కుదించమని ఇటీవలె వైద్యులు సలహా ఇచ్చినట్లు సమాచారం. తీవ్రమైన వర్కవుట్స్ కూడా ప్రమాదమేనని వైద్యులు అంటున్నారు. ఆర్థిక జీవనశైలితో పాటు ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే గుండెపోటు తలెత్తడం వంటివి జరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. శారీరక దాడృత్యంతో పాటు మాససిక ప్రశాంతత కూడా ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు. చదవండి : Sidharth Shukla: ఆరోజు రాత్రి ఏం జరిగింది.. పోస్ట్‌మార్టం నివేదికలో ఏముంది? -
ఆరోజు రాత్రి ఏం జరిగింది.. సిద్దార్థ్ పోస్ట్‌మార్టం నివేదికలో ఏముంది?!
Sidharth Shukla Autopsy: హిందీ బిగ్‌బాస్ సీజన్ 13 విజేత, చిన్నారి పెళ్లికూతురు ఫేం సిద్దార్థ్ శుక్లా పోస్ట్‌మార్టం పూర్తైంది. అకాల మరణం చెందిన సిద్దార్థ్ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని వైద్యులు వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, కెమికల్ అనాలిసిస్ కోసం అంతర్గత అవయవాల నుంచి సేకరించిన నమూనాలు (వెస్కేరా శాంపిల్స్) పంపించారని, ఆ తర్వాతే మరణానికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. కాగా సిద్దార్థ్ గుండెపోటుతో మరణించాడని తొలుత వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. తీవ్రమైన కసరత్తులు చేసే అతడు.. సెప్టెంబరు 1 రాత్రి భోజనం చేసిన తర్వాత ఛాతీలో నొప్పి వచ్చినట్లు చెప్పి, విశ్రాంతి కావాలంటూ నిద్రపోయాడు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన సిద్దార్థ్ స్నేహితులు.. తెల్లారేసరికి కూడా అతడు నిద్రలేవకపోవడంతో గురువారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో కూపర్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో అతడిది సహజ మరణమేనని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోస్ట్‌మార్టం నిర్వహించగా శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తేలడం గమనార్హం. చదవండి: Rip Sidharth Shukla: మరణానికి ముందు తల్లితోనే... ఇక సిద్దార్థ్‌కు తల్లి రీతూ శుక్లా, ఇద్దరు సోదరీమణులు ఉన్న విషయం తెలిసిందే. అతడి మృతి నేపథ్యంలో కుటుంబ సభ్యులు అభిమానులను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘మేమంతా తీవ్ర విషాదంలో ఉన్నాం. దిగ్భ్రాంతికి లోనయ్యాం. సిద్దార్థ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించండి. దయచేసి మాకు కాస్త తేరుకునే సమయం, ప్రైవసీ ఇవ్వండి’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా సిద్దార్థ్ అంత్యక్రియలు నేటి మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, టీవీ సెలబ్రిటీలు అతడి నివాసానికి చేరుకుంటున్నారు. చదవండి: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సిద్ధార్థ్ శుక్లా.. ఫొటో వైరల్ -
రైలు ఎక్కే తొందరలో....
సాక్షి, ముంబై: రైలు ఎక్కడానికి వెళుతూ ప్లాట్‌ఫాం, రైలుకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో పడి మణికట్టు వరకు చేయి పోగొట్టుకున్నాడు. ఈ ఘటన మంగళవారం శాంతాక్రజ్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఖార్లోని సాయిబాబా నగర్ నివాసి అయిన అరుణ్ సావంత్ (35), శాంతాక్రజ్‌లోని రైల్వే స్టేషన్లో పరిగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడ కాలు జారి రైలుకి, ప్లాట్‌ఫాంకి ఉన్న ఖాళీ స్థలంలో పడిపోయాడు. ఈ ఘటనలో మణికట్టు వరకు చేయి తెగిపోయింది. స్పృహ కోల్పోయిన సావంత్‌ను విలేపార్లేలోని కూపర్ ఆసుపత్రికి తరలించామని బాంద్రా గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలిపారు. బాధితుడి కుటుంబానికి సమాచారం అందించామన్నారు. -
డెంగీ బాధితులకు మేయర్ పరామర్శ
సాక్షి, ముంబై: డెంగీ వ్యాధితో బాధపడుతూ అంధేరీలోని కూపర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురిని శుక్రవారం నగర మేయర్ స్నేహల్ అంబేకర్ పరామర్శించారు. అక్కడ వారికి అందుతున్న చికిత్సపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, గత కొద్ది నెలలుగా నగరాన్ని గజగజలాడిస్తున్న డెంగీ మహమ్మారి మరొకరిని బలితీసుకుంది. దీంతో డెంగ్యూతో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. అంధేరిలో నివాసముంటున్న మానసీ (3) అనే చిన్నారికి జ్వరం రావడంతో బుధవారం హోలి స్పిరిట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు డెంగీ అని తేలగా వైద్యం ప్రారంభించారు. కాని చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం చనిపోయింది. గత వారం కిందట డెంగ్యూతో ఐదుగురు చనిపోయారు. అందులో కేం ఆస్పత్రికి చెందిన రెసిడెన్సీ డాక్టర్ శృతి ఖోబ్రగడే (24) కూడా ఉన్నారు. మరో ఏడుగురు రెసిడెన్సీ డాక్టర్లకు సైతం డెంగీ సోకినట్లు పరీక్షల్లో తేలింది. వీరందరు మాహింలోని హిందుజా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదేవిధంగా, నాసిక్‌లో ఇటీవల ఒకేరోజు ఇద్దరు, పింప్రిలో ఒకరు డెంగీతో బాధపడుతూ మరణించారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని నివారించేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఆరోగ్యశాఖ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయినా డెంగీ అదుపులోకి రాకపోవడంతో ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.