ముంబై: బాలీవుడ్ నటి రాధిక మడన్ వ్యాయమమం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రాధిక ఎలాంటి సపోర్టు లేకుండా చేతుల ఆధారం కాళ్లను పైకి పెట్టి నవ్వుతూ కెమారాకు ఫొజ్ ఇవ్వడం చూసి ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేగాక ఈ పోస్టుకు తను పెట్టిన క్యాప్షన్ నెటిజన్లను మరింత ఆకట్టుకుంటోంది. గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ పోస్టుకు ‘ఈ రోజుల్లో నేలపై పడకండి’ అనే ఈ శీర్షికను రాధిక 1978లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడిన ప్రముఖ పాట నుంచి తీసుకున్నారు. అయితే శీర్షాసనం (తలను ఆధారంగా చేసుకుని తల కిందులుగా ఉండటం) వేయడం అంత సులభం కాదు. ఎంతో కష్టపడితే కానీ ఈ ఆసనంలో ఉండటం కష్టం. (మళ్లీ గోల్‌మాల్)
ఒకవేళ మీరు ఈ ఆసనం వేస్తే మాత్రం దీనివల్ల అనేక అరోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్లే. ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీర సమతుల్యతను పెంచుతుంది. అంతేగాక ఏకాగ్రతను, దృష్టిని మెరుగుపరుస్తుంది. మరీ ఇంకేందుకు ఆలస్యం రాధికలా మీరుకూడా ఈ ఆసనాన్ని వేసి ఆరోగ్యంగా ఉండండి. కాగా రాధిక ‘మేరీ ఆషీకీ తుమ్ సే హై’ సీరియల్‌లో లీడ్‌రోల్‌లోలో నటించారు. ఆ తర్వాత 2018లో వచ్చిన ‘పటాఖా’తో మొదటిసారిగా సినిమాలో నటించారు. ఆ తర్వాత ‘మార్ధ్ కో దర్ధ్ నాహి హోతా’తో పాటు ఇటీవల లెజండరీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించిన అంగ్రేజీ మీడియంలో నటించారు. (బెల్లీ ఫ్యాట్‌కు ఇలా చెక్ పెట్టండి..)
Comments
Please login to add a commentAdd a comment