మహా బలశాలిని: గ్యాస్‌ బండతో మహిళ ఫీట్లు వైరల్‌ | Viral Video: Woman Performs Squats By Lifting Gas Cylinder | Sakshi
Sakshi News home page

మహా బలశాలిని: గ్యాస్‌ బండతో మహిళ ఫీట్లు వైరల్‌

Published Wed, Jun 9 2021 9:07 PM | Last Updated on Wed, Jun 9 2021 10:43 PM

Viral Video: Woman Performs Squats By Lifting Gas Cylinder - Sakshi

గ్యాస్‌ సిలిండర్‌తో ఏం ఉపయోగమంటే ఏం చెప్తాం.. వంటలు చేసుకునేందుకు అని. కానీ ఈ మహిళ గ్యాస్‌బండను కసరత్తులు చేసేందుకు ఉపయోగిస్తోంది. గ్యాస్‌ బండను అమాంతం ఎత్తేసి ఎక్ససైజ్‌లు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అది కూడా చీర ధరించి చేయడం గమనార్హం. ఆమెనే షైలీ చికరా. ఈమె ఫిట్‌నెస్‌ నిపుణురాలు. ఆమెకు సాహసాలు చేయడం అలవాటు. వ్యాయామాలు కొత్త తరహా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

తాజాగా ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ను షైలీ వరండాలోకి తీసుకువచ్చి అమాంతం సింపుల్‌గా ఎత్తేసింది. రెండుసార్లు పైకి కిందకు ఎత్తి దింపింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘చూద్దాం నా వీడియో ఎక్కడెక్కడకు వెళ్తుందో’ అని మెసేజ్‌ చేసి పోస్టు చేసింది. ఈ వీడియోను చూసిన వారందరూ ఆమెను అభినందిస్తున్నారు. షైలీ గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసింది. గతనెలలో పంటితో గ్యాస్‌ సిలిండర్‌ ఎత్తేసి ఔరా అనిపించింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటివరకు రెండున్నర లక్షల మందికిపైగా ఆమెను ఫాలోవుతున్నారు. ఆమె ఐటీ ఉద్యోగిని అని కూడా తెలుస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement