
రాశీ ఖన్నా
కెరీర్ స్టార్టింగ్‌లో బొద్దుగా ఉండేవారు రాశీ ఖన్నా. ఇప్పుడు స్లిమ్‌గా మారిపోయారు. ఈ మార్పు వెనక రెండేళ్ల శ్రమ ఉందట. ప్రస్తుతం ‘నాకు నేనే నా బెస్ట్ వెర్షన్‌లా’ అనిపిస్తున్నాను అంటున్నారామె. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ – ‘‘నేను తరచూ వర్కవుట్స్ చేస్తూనే ఉంటాను. ఫలితాలు ఎప్పుడూ ఓవర్‌నైట్‌లో రావు. అలాగే కఠినమైన డైటింగ్‌ల మీద పెద్దగా ఆసక్తి చూపించను. కానీ ప్రస్తుతానికి చాలా ఫిట్‌గా అనిపిస్తున్నాను. ఇక్కడి వరకూ రావడానికి నాకు రెండేళ్ల సమయం పట్టింది. ప్రస్తుతం హ్యాపీగా, హెల్తీగా ఉన్నాను. వారంలో ఆరు రోజులు వ్యాయామం చేస్తాను’’ అన్నారు. ప్రస్తుతం రాశీ ఖన్నా తెలుగులో ‘వెంకీ మామ’, తమిళంలో ‘సంఘతమిళన్’ సినిమాలతో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment