across
-
భాషలన్నింటిలో టాప్ ఏవో తెలుసా మీకు?
2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడిన భాషలు ఎన్నో, ఎంతమంది మాట్లాడారో తెలుసా.ప్రతి సంవత్సరం అతిపెద్ద భాషల జాబితాను ప్రచురించే ఎథ్నోలాగ్ తాజా జాబితాను వెల్లడించించింది. ఇందులో అత్యధికంగా అంటే 1.5 బిలియన్లు మంది మాట్లాడిన భాషగా ఇంగ్లీష్ నిలిచింది. అలాగే భారత దేశానికి చెందిన హిందీ భాష మూడో స్థానంలో నిలవడం విశేషం. అలాగే బెంగాలీ భాష 7, ఉర్దూ భాష 10వ స్థానంలో నిలిచాయి. భూమి మొత్తం 200కు పైగా దేశాలు ఉండగా వాటిల్లో మొత్తం 7వేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ జాబితా ఆర్థిక పోకడలు, అధిక జనాభా ఉన్న దేశాలు, వలస చరిత్రను కూడా ప్రతిబింబిస్తాయంటున్నారు విశ్లేషకులు భూమిపై అత్యధికంగా మాట్లాడే 12 భాషలు ఇంగ్లీష్: 1,500,000,000 మాండరిన్: 1,100,000,000 హిందీ: 609,500,000 స్పానిష్: 559,100,000 ఫ్రెంచ్: 309,800,000 ప్రామాణిక అరబిక్: 274,000,000 బెంగాలీ: 272,800,000 పోర్చుగీస్: 263,600,000 రష్యన్: 255,000,000 ఉర్దూ: 231,700,000 ఇండోనేషియన్: 199,100,000 జర్మన్: 133,200,000 -
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట: ఆలయాలు శుభ్రం చేస్తున్న ప్రముఖులు (ఫొటోలు)
-
మలబార్ గోల్డ్ : మహిళలకు గోల్డెన్ చాన్స్
సాక్షి,న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల రంగంలో ఉన్న కేరళ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ భారీ నియామకాలను చేపట్టనుంది. భారత్‌లో రిటైల్‌తోపాటు ఇతర విభాగాల కోసం 5,000 పైచిలుకు మందిని కొత్తగా చేర్చుకోనున్నట్టు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహమ్మద్ మంగళవారం ప్రకటించారు. వీరిలో సగం మంది మహిళలు ఉంటారు. అకౌంటింగ్, డిజైన్, డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, ఆభరణాల తయారీ, సరఫరా నిర్వహణ, ఫైనాన్స్, ఐటీ వంటి విభాగాల్లో కూడా రిక్రూట్మెంట్ ఉంటుంది. అలాగే జువెల్లరీ విక్రయాలు, కార్యకలాపాల కోసం బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన ఫ్రెషర్లకు ఇంటర్న్షిప్స్, ట్రెయినీషిప్స్ సైతం ఆఫర్ చేయనుంది. కొత్తగా చేరినవారు సంస్థ కేంద్ర కార్యాలయం ఉన్న కేరళలోని కోజికోడ్తోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కత ఆఫీస్‌లలో పనిచేయాల్సి ఉంటుంది. ఔత్సాహికులు కంపెనీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 10 దేశాల్లో 260 ఔట్లెట్లను సంస్థ నిర్వహిస్తోంది. వార్షిక టర్నోవర్ సుమారు రూ.33,640 కోట్లు. -
దేశవ్యాప్తంగా భారత్ బంద్
-
ఇంటర్నెట్ సేవలు మళ్లీ బంద్
► విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు కానిస్టేబుల్ ప్రయత్నం ► జమ్ములో తీవ్ర ఉద్రిక్తత.. నిందితుడి అరెస్టు జమ్మూలో పురాతన శివాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనతో చెలరేగిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చల్లబడక ముందే మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం ఓ సస్సెండ్ అయిన జమ్మూకాశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్... స్థానిక ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా నానక్ నగర్ లోని శివాలయ ధ్వంసానికి ఓ వ్యక్తి ప్రయత్నించడం మరోసారి అలజడి రేగింది. దీంతో మూడు రోజులుగా ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. జమ్మూలో గురువారం జరిగిన పురాతన శివాలయ ధ్వంసం ఘటన మరువక ముందే మరో అలజడి రేగింది. సస్పెండెడ్ కానిస్టేబుల్ గుర్బచన్ సింగ్ నానక్ నగర్ లోని ఆలయంలోకి వెళ్ళి అక్కడి శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆలయధ్వంసం ఘటన తెలియడంతో స్థానికులు నిరసనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా, పోలీసులు పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చారు. అంతకు ముందు రూప్ నగర్ లో జరిగిన ఆలయ ధ్వంసానికి, తాజా ఘటనకు ఏదైనా సంబంధం ఉందా అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జమ్మూలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే రెండు రోజులుగా ఆందోళనలతో ఉన్న జమ్మూలో నేడు కొంత ప్రశాంత వాతావరణం కనిపించింది. వ్యాపార సంస్థలు, దుకాణాలు తెరుచుకున్నాయి. రోడ్లపై ట్రాఫిక్ కూడా ఎప్పట్లాగే కనిపించింది. అయితే స్థానికంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు మాత్రం కొనసాగడం లేదు. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సేవలు స్తంభించిపోయాయి. దక్షిణ కాశ్మీర్ లో అమరనాథ్ యాత్ర సందర్భంలోనే మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రణాళికా బద్ధంగా దేవాలయాలను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందన్న అనుమానంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. అయితే నిందితుడు నానక్ నగర్ ఆలయధ్వంసానికి పాల్పడే ముందు సెల్ ఫోన్ లో ఇతరులతో విషయాన్ని వివరించినట్లు జమ్ము డివిజినల్ కమిషనర్ పవన్ కొత్వాల్ తెలిపారు. నానక్ నగర్ ఆలయంలో శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని సస్పెండ్ అయిన పోలీస్ కానిస్టేబుల్ గుర్బచన్ సింగ్ అలియాస్ మింటా గా గుర్తించామని, అతడు ఘటనకు ముందు మాట్లాడిన సెల్ ఫోన్ సంభాషణను బట్టి అతడ్ని ఆదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఫోన్ లో అవతలి వ్యక్తితో సింగ్... చెప్పిన పని పూర్తయిందని, తన ఖాతాలో డబ్బు జమచేయమని చెప్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం సింగ్ ను పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద జమ్ము డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సిమరన్ దీప్ ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించిన ప్రభుత్వం జమ్మూలో మాత్రం మూడోరోజూ నిలిపివేతను కొనసాగిస్తోంది. అంతకుముందు జరిగిన నిరసన ప్రదర్శనలలో వేర్పాటువాదులు పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలను ఎగరేశారు. -
సైకిల్ తో భారత స్వర్ణ చతుర్భుజిని దాటాడు..!
ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లలో తన సైక్లింగ్ ను పూర్తి చేసిన ఓ యువకుడు... ఇప్పుడు తన భారత ప్రయాణంవైపు దృష్టి సారించాడు. సన్నని దారులు, ఇరుకైన ప్రాంతాల్లోని అడ్డంకులను సైతం తప్పించుకొంటూ ప్రయాణించాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే కివి సైకిల్ తో... రికార్డు సాధనే ధ్యేయంగా దూసుకుపోతున్నాడు. భారత ప్రధాన నగరాల్లో పారిశ్రామిక వ్యవసాయ, సాంస్కృతిక కేంద్రాలుగా పనిచేసే రహదారి నెట్వర్క్ స్వర్ణ చతుర్భుజిని దిగ్విజయంగా దాటేశాడు. రెండేళ్ళ క్రితం 24 ఏళ్ళవయసున్న టిమ్ ఛిట్టాక్ తన ఫాస్టెట్ సైక్లింగ్ తో ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ పర్యటనలు ముగించుకొని తాజాగా భారత్ లో ప్రవేశించాడు. న్యూజిల్యాండ్ వైకటో విశ్వవిద్యాలయంనుంచి లా అండ్ ఎకనామిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందిన ఛిటాక్... ఫిబ్రవరి 27న ఢిల్లీలో న్యూజిల్యాండ్ ఎంబసీనుంచీ సైకిల్ ప్రయాణం ప్రారంభించాడు. సగటున 250 కిలోమీటర్ల చొప్పున మొత్తం 24 రోజుల్లో 6000 కిలోమీటర్ల దూరం సైకిల్ ప్రయాణం చేస్తూ చెన్నై, కోల్ కతా, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, జైపూర్, కాన్పూర్, పూనే, సూరత్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం మొదలైన నగరాలన్నీ చుట్టేశాడు. తాను సవాలుగా స్వీకరించిన ఈ సైక్లింగ్ తనకు గొప్ప అనుభవాన్నిచ్చిందని ఛిటాక్ చెప్తున్నాడు. సైక్లింగ్ చేయడానికి జాతీయ రహదారులు కొంత సహకరించేవిగానే ఉంటాయని, ఇన్నర్, లింక్ రోడ్లలో ప్రయాణమే పెద్ద ఛాలెంజింగ్ గా ఉంటుందని చెప్పాడు. తాను ప్రయాణంలో ఉన్నపుడు కనీసం రోజుకు మూడుసార్లు షేవింగ్ చేసుకుంటానని చెప్తున్న ఛిటాక్... ఒకసారి ఓ ట్రక్ కింద పడబోయి తృటిలో తప్పించుకున్నట్లు తెలిపాడు. భారత స్వర్ణ చతుర్భుజిపై సైక్లింగ్ చేసి, గిన్నిస్ రికార్డును సాధించే ప్రయత్నంలో ఛిటాక్ రోజుకు 80 కిలోమీటర్ల చొప్పున సైకిల్ తొక్కినట్లు చెప్పున్నాడు. గిన్నిస్ ను సంప్రదించిన అనంతరం ప్రారంభించిన అతడి ప్రయత్నం ఎంతవరకూ సఫలీకృతమౌతుందో తెలియాల్సి ఉంది. -
30 శాతం మంది నకిలీ లాయర్లే!
దేశంలో నకిలీ లాయర్లను ఏరిపారేసే ప్రక్రియ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లతో ఎంతోమంది న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారని, వారిని వెతికి పట్టుకునేందుకు వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నవారు కనీసం 30 శాతం మందికి నకిలీ డిగ్రీలున్న విషయం బయటపడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నకిలీ లాయర్లను వెతికి పట్టుకునేందుకు బీసీఐ కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ఒకప్పుడు న్యాయవాద వృతిని చేపట్టాలనుకున్నవారు బీసీఐ సర్టిఫికెట్తో రిజిస్టర్ అయితే సరిపోయేది. కానీ తాజాగా అమల్లోకి తెచ్చిన పద్ధతి ప్రకారం వెరిఫికేషన్ సమయానికి న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నవారంతా బీసీఐ సర్టిఫికెట్తో పాటు పదోతరగతి, బోర్డు సర్టిఫికెట్లను, ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. ఈ నేపథ్యంలో కొత్త ఫార్మాట్లో తిరిగి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు బీసీఐ ఛైర్మన్ చెప్పారు. లాయర్లు సమర్పించిన సర్టిఫికెట్ల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియ సదరు విశ్వవిద్యాలయాలు, బోర్డుల సహాయంతో 2016 సంవత్సరం చివరినాటికి పూర్తవుతుందని మనన్ కుమార్ మిశ్రా వెల్లడించారు. బీసీఐ రిజిస్ట్రేషన్ ఉండి ఐదేళ్లుగా ప్రాక్టీస్‌లో లేని న్యాయవాదులను పరిశీలనలో భాగంగా లాయర్లుగా గుర్తించినా.. తిరిగి ప్రాక్టీస్ కు మాత్రం అనుమతించే అవకాశం లేదన్నారు. ఈ నూతన ప్రక్రియను ప్రారంభించేందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో బార్ కౌన్సిల్... వివిధ రాష్ట్రాల్లో న్యాయవాదుల అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి న్యాయవాదికీ అకాడమీ సర్టిఫికెట్ తప్పనిసరి అని, దాంతో ఏ కోర్టులోనైనా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుందని మిశ్రా చెప్పారు. దేశంలో 20 శాతం లాయర్లు సరైన 'లా' డిగ్రీ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నారని బీసీఐ ఛైర్మన్ గతేడాది చెప్పారు. అకాడమీలను ప్రారంభించి, నకిలీ న్యాయవాదులను నిర్మూలించేందుకు సహకరించాలని అప్పట్లో కేంద్రాన్ని నిధుల కోసం ఆశ్రయించారు. అయితే అప్పటికే న్యాయమూర్తులకు శిక్షణ ఇచ్చే జ్యుడీషియల్ అకాడమీలను పొడిగిస్తూ, న్యాయవాదులకు, న్యాయవ్యవస్థలో పనిచేసే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ ఆఫీసర్ల వంటి వారికి కూడా తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, న్యాయ శాఖ బీసీఐకి హామీ ఇచ్చింది. -
భారత్‌లో హైఅలర్ట్ ప్రకటించిన నిఘా వర్గాలు
-
రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు
సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. లక్షలాది అభిమానుల కోరిక నెరవేరింది. జననేత జనం ముందుకు రాబోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయం ప్రకటించగానే రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వీధుల్లోకి వచ్చి మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. బాణాసంచా పేల్చి జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. చివరకు న్యాయమే గెలిచిందని నాయకులు అభిప్రాయపడ్డారు. జగన్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెలువరించేముందు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. జాతీయ మీడియా సైతం ఆసక్తి కనబరిచింది. నాంపల్లి కోర్టుకు భారీ సంఖ్యలో నాయకులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. జగన్ సతీమణి వై.ఎస్.భారతి, చిన్నాన్న వై.ఎస్.వివేకానంద రెడ్డి తదితరులు ముందుగానే కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. జగన్‌కు బెయిల్ మంజూరు చేసినట్టు కోర్టు ప్రకటించగానే రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.