రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు | celebrations across Andhra pradesh | Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు

Sep 23 2013 5:42 PM | Updated on Sep 1 2017 10:59 PM

సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. లక్షలాది అభిమానుల కోరిక నెరవేరింది. జననేత జనం ముందుకు రాబోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది.

సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. లక్షలాది అభిమానుల కోరిక నెరవేరింది. జననేత జనం ముందుకు రాబోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయం ప్రకటించగానే రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వీధుల్లోకి వచ్చి మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. బాణాసంచా పేల్చి జగన్కు అనుకూలంగా నినాదాలు చేశారు. చివరకు న్యాయమే గెలిచిందని నాయకులు అభిప్రాయపడ్డారు.

జగన్ బెయిల్ పిటిషన్పై తీర్పు వెలువరించేముందు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. జాతీయ మీడియా సైతం ఆసక్తి కనబరిచింది. నాంపల్లి కోర్టుకు భారీ సంఖ్యలో నాయకులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. జగన్ సతీమణి వై.ఎస్.భారతి, చిన్నాన్న వై.ఎస్.వివేకానంద రెడ్డి తదితరులు ముందుగానే కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. జగన్కు బెయిల్ మంజూరు చేసినట్టు కోర్టు ప్రకటించగానే రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement