ఒకరోజు మీ ఫ్రెండ్ ఫోన్ చేసి ‘వొద్దకో జినెసో?’ అని అడగవచ్చు. ఎప్పుడైనా ఏ ఫ్రెండ్‌కో మీరు ఫోన్ చేసి ‘హౌ ఆర్ యూ?’ అని అడిగితే అటునుంచి ‘చైల్ చినెమో’ అని జవాబు రావచ్చు. కొరియన్‌లో ‘వొద్దకో జినెసో?’ అంటే ‘ఎలా ఉన్నావు?’ అని, ‘చైల్ చినెమో’ అంటే ‘ఐయామ్ ఫైన్’ అని అర్థం. ఒక్క కొరియన్ మాత్రమే కాదు ప్రపంచంలోని పలు భాషలు చూస్తూ చూస్తూనే నేర్చుకోవచ్చు.... నెట్‌ఫ్లిక్స్‌లో!
మీరు ఫ్రెంచ్ భాష నేర్చుకోవాలనుకుంటున్నారా? ‘30 రోజుల్లో...’లాంటి పుస్తకాలు చదవనక్కర్లేదు. ఏ ఇన్‌స్టిట్యూట్‌కో వెళ్లి శిక్షణ పొందనక్కర్లేదు. మీ ఇంట్లోనే ఎటు కదలకుండా నెట్‌ఫ్లిక్స్‌లో లుపిన్, ఇన్ టూ ది నైట్, కాల్ మై ఏజెంట్...ఇంటర్నేషనల్ టీవీడ్రామాలు, మిల్ఫ్, ఆఫ్రికన్ డాక్టర్, ది క్లైంబ్...కామెడీలు, ఏజ్ ఆఫ్ టాంక్స్, టోనీ పార్కర్–ది ఫైనల్ షాట్, కిల్ హిట్లర్...డాక్యుమెంటరీలు చూస్తే చాలు! కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమాలు, వెంట్రుకలు నిక్కబొడుచుకునే హారర్ సినిమాలు, పిడికిళ్లు బిగిసే యాక్షన్ సినిమాలు చూస్తూనే ప్రపంచంలోని ఏదో ఒక భాష ఎంతో కొంత నేర్చుకుంటే ఎంత హ్యాపీ!
‘లాంగ్వేజ్ లెర్నింగ్ విత్ నెట్‌ఫ్లిక్స్’ (ఎల్‌ఎల్‌ఎన్) అనే క్రోమ్ ఎక్సెటెన్షతో ఇది సాధ్యమవుతుంది. ఈ ఎక్స్‌టెన్షన్‌ను డేవిడ్ వికిన్‌సన్, ఒగ్న్‌జెన్‌లు రూపొందించారు. ‘ఇష్టమైన మాధ్యమంలో ఎలాంటి కష్టం లేకుండా సరదా సరదాగా కొత్త భాషలు నేర్చుకోవచ్చు’ అంటాడు వికిన్‌సన్. ప్రేక్షక ఆదరణ పొందిన సిరీస్‌కు సంబంధించిన అల్టర్‌నెటివ్ ఆడియోట్రాక్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వేరే భాషలకు సంబంధించిన ఆడియోలకు, సబ్‌టైటిల్స్ మ్యాచ్ కావు. ఈ పరిమితిని సరిదిద్దారు. నిజానికి 2017లోనే ఒకే సమయంలో రెండు సబ్ టైటిల్స్ ప్రదర్శితమయ్యే లెర్నింగ్ మోడ్‌ను వికి(స్ట్రీమింగ్ సర్వీస్ ఫర్ ఏషియన్ డ్రామాస్) ప్రవేశపెట్టింది.
మన పనిని సులభతరం చేయడానికి విస్తృతమైన కెటలాగ్ కూడా ‘ఎల్‌ఎల్‌ఎన్’లో రెడీగా ఉంది. లాంగ్వేజ్ యూ స్టడీ, యువర్ నెట్‌ఫ్లిక్స్ కంట్రీలలో మనకు ఇష్టమైనవి ఎంపిక చేసుకోవచ్చు. సినిమా పోస్టర్, సినాప్సిస్, నిడివి, రేటింగ్, జానర్, ఏ దేశంలో అందుబాటులో ఉన్నాయి...మొదలైన వివరాలు ఈ కెటలాగ్‌లో మనకు కనిపిస్తాయి. సెట్టింగ్స్‌లో మెషిన్, హ్యూమన్ ట్రాన్స్‌లెషన్ ఆప్షన్స్ ఉన్నాయి. మెషిన్ ట్రాన్స్‌లేషన్‌లో మక్కీకిమక్కీ అనువాదం ఉన్నా, మన టార్గెట్ లాంగ్వేజ్‌కి సంబంధించిన వాక్యనిర్మాణంపై స్పష్టత వస్తుంది. అయితే ఈ మెషిన్‌లో తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు.
కీ బోర్డ్‌లో...
‘ఎ’ ప్రీవియస్ సబ్ టైటిల్
‘యస్’ రిపీట్ సబ్‌టైటిల్స్
‘డి’ నెక్ట్స్ సబ్‌టైటిల్
టస్పేస్‌బార్–ప్లే, పాజ్
వెకబలరీ హైలిటింగ్ ఫీచర్ నుంచి పాప్–అప్ డిక్షనరీ వరకు ‘ఎల్‌ఎల్‌ఎన్’లో రకరకాల భాషలలోని పదాలు, వాక్యాలపై పట్టు పెంచుకోవచ్చు. మెల్ల మెల్లగా మాట్లాడనూ వచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి చూడండి మరి.
Comments
Please login to add a commentAdd a comment