అన్యభాషలు నేర్వాలంటే.. ఈ చిట్కా పాటించండి! | How to identify quick language learners | Sakshi
Sakshi News home page

అన్యభాషలు నేర్వాలంటే.. ఈ చిట్కా పాటించండి!

Published Mon, Jul 4 2016 8:46 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

మాతృభాష కాకుండా వేరే ఏదైనా భాష తోడుగా ఉంటే తప్ప ఉద్యోగం రాని రోజులివీ.

న్యూయార్క్: మాతృభాష కాకుండా వేరే భాష ఏదైనా తోడుగా ఉంటే తప్ప ఉద్యోగం రాని రోజులివీ. ఇలాంటి సమయంలో అన్యభాషలపై పట్టు సంపాదించేందుకు యువత కిందా మీదా పడుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా పరిశోధకులు చెప్పిన వివరాలను పరిశీలిస్తే త్వరగా కొత్త భాషలు నేర్చుకునేవారికి, టెక్నిక్ తెలీక ఇబ్బందిపడేవారికి మధ్య బేధాన్ని ఇట్టే గుర్తించవచ్చు.

కొత్త భాషలను ఇట్టే పట్టేసే వారు ఖాళీ సమయాల్లో, రిలాక్స్ అవుతున్నప్పుడో ఎక్కువశాతం ఆ భాషకు సంబంధించిన ఆలోచనలతో గడుపుతుంటారని పరిశోధకులు చెప్పారు. కొత్త భాషను నేర్చుకునే ఔత్సాహికులను ఐదు నిమిషాల పాటు రిలాక్స్ డ్ స్టేట్ లో కూర్చొబెట్టి వారి మెదడు పనితీరును పరిశీలించగా ఈ విషయం తేలినట్లు వివరించారు. దాదాపు మెదడులోని 60 శాతం ఆలోచనలు అన్యభాషపై పట్టును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. మెదడులోని న్యూరాన్ల సాయంతో లాంగ్వేజ్ లెర్నింగ్ రేట్ ను కనుగొనవచ్చని తెలిపారు.

19మంది 18 నుంచి 31 మధ్య వయసు కలిగి, ఫ్రెంచ్ భాషను రోజూ 30 నిమిషాలపాటు ఆసక్తితో నేర్చుకుంటున్న వారిపై ఈ పరిశోధన నిర్వహించినట్లు పరిశోధకులు వివరించారు. క్లాస్ వినే ముందు ఐదు నిమిషాలు, ఆ తర్వాత మరో ఐదు నిమిషాలు వీరి మెదడు పనితీరుపై పరిశోధనలు చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement