గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో మరో 110 కొత్త భాషలు | Google Translate Expands To 110 New Languages | Sakshi
Sakshi News home page

గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో మరో 110 కొత్త భాషలు

Published Sun, Jun 30 2024 4:02 PM | Last Updated on Sun, Jun 30 2024 7:20 PM

Google Translate Expands To 110 New Languages

ఏదైన ఒక భాష నుంచి మరో భాషకు అనువాదం (ట్రాన్స్‌లేట్‌) చేయాలంటే అందరికి గూగుల్ ట్రాన్సలేట్ గుర్తొస్తుంది. ఇప్పటికే సుమారు 243 భాషలకు సపోర్ట్ చేస్తున్న గూగుల్ ట్రాన్స్‌లేట్‌ ఇప్పుడు మరో 110 భాషలకు సపోర్ట్ చేయడానికి సన్నద్ధమైంది. ఈ కొత్త భాషలను విస్తరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించనున్నట్లు గూగుల్ తెలిపింది.

2006లో ప్రారంభమైన గూగుల్ ట్రాన్స్‌లేట్‌ 2022లో జీరో-షాట్ మెషిన్ అనువాదాన్ని ఉపయోగించి 24 కొత్త భాషలను జోడించింది. కాగా 2024 జూన్ నాటికి 243 భాషలల్లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే 1000 భాషలకు మద్దతు ఇచ్చే AI మోడల్‌లను రూపొందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రపంచ జనాభాలో ఎనిమిది శాతం మందికి అనువాదాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని 100 మిలియన్లకు పైగా మాట్లాడే ప్రధాన భాషలు, మరికొన్ని స్థానిక ప్రజల చిన్న భాషలు ఉన్నాయి. తాజాగా గూగుల్ యాడ్ చేసిన కొత్త భాషల జాబితాలో ఫాన్, లువో, గా, కికోంగో, స్వాతి, వెండా, వోల్ఫ్ వంటి మరిన్ని ఆఫ్రికన్ భాషలతో పాటు అవధి, బోడో, ఖాసి, కోక్‌బోరోక్, మార్వాడీ, సంతాలి, తుళు వంటి ఏడు భారతీయ భాషలు ఉన్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement