Translate
-
మరిన్ని భాషల్లో గూగుల్ సెర్చ్ రిజల్ట్స్
గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ఇప్పుడు మరిన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చింది. గతంలో కేవలం 13 భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 21కి చేరింది. ఇంతకీ ఇప్పుడు అందుబాటులో ఉన్న భాషలు ఏవి, అందులో భారతీయ భాషలు ఎన్ని అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో కొత్తగా చేరిన భాషలు మొత్తం ఎనిమిది. అవి అరబిక్, గుజరాతీ, కొరియన్, పర్షియన్, థాయ్, టర్కిష్, ఉర్దూ, వియత్నామీస్. ఇప్పటికే 13 భాషల్లో ఇది వినియోగంలో ఉంది. దీంతో మొత్తం భాషలు 21కి చేరాయి. అంటే గూగుల్ సెర్చ్ ఫలితాలు అరబిక్, బెంగాలీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, గుజరాతీ, హిందీ, ఇండోనేషియా, కన్నడ, కొరియన్, మలయాళం, మరాఠీ, పర్షియన్, పోర్చుగీస్, స్పానిష్, తమిళం, తెలుగు, థాయ్, టర్కిష్, ఉర్దూ, వియత్నామీస్ భాషల్లో కూడా పొందవచ్చు.ఈ మొత్తం 21 భాషల్లో భారతీయ భాషలు.. బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దూ. సెర్చ్ రిజల్ట్స్ ఇప్పుడు మరిన్ని భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల మరింత మంది యూజర్స్ దీన్ని ఉపయోగించే అవకాశం ఉంది. -
గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో మరో 110 కొత్త భాషలు
ఏదైన ఒక భాష నుంచి మరో భాషకు అనువాదం (ట్రాన్స్‌లేట్) చేయాలంటే అందరికి గూగుల్ ట్రాన్సలేట్ గుర్తొస్తుంది. ఇప్పటికే సుమారు 243 భాషలకు సపోర్ట్ చేస్తున్న గూగుల్ ట్రాన్స్‌లేట్ ఇప్పుడు మరో 110 భాషలకు సపోర్ట్ చేయడానికి సన్నద్ధమైంది. ఈ కొత్త భాషలను విస్తరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించనున్నట్లు గూగుల్ తెలిపింది.2006లో ప్రారంభమైన గూగుల్ ట్రాన్స్‌లేట్ 2022లో జీరో-షాట్ మెషిన్ అనువాదాన్ని ఉపయోగించి 24 కొత్త భాషలను జోడించింది. కాగా 2024 జూన్ నాటికి 243 భాషలల్లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే 1000 భాషలకు మద్దతు ఇచ్చే AI మోడల్లను రూపొందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.ప్రపంచ జనాభాలో ఎనిమిది శాతం మందికి అనువాదాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని 100 మిలియన్లకు పైగా మాట్లాడే ప్రధాన భాషలు, మరికొన్ని స్థానిక ప్రజల చిన్న భాషలు ఉన్నాయి. తాజాగా గూగుల్ యాడ్ చేసిన కొత్త భాషల జాబితాలో ఫాన్, లువో, గా, కికోంగో, స్వాతి, వెండా, వోల్ఫ్ వంటి మరిన్ని ఆఫ్రికన్ భాషలతో పాటు అవధి, బోడో, ఖాసి, కోక్బోరోక్, మార్వాడీ, సంతాలి, తుళు వంటి ఏడు భారతీయ భాషలు ఉన్నట్లు తెలుస్తోంది. -
వాట్సాప్‌కు పోటీగా టెలిగ్రాంలో కొత్త ఫీచర్స్..
కొత్త అప్డేట్స్ ఎల్లప్పుడూ యాప్స్‌కు బూస్టింగ్‌నిచ్చే అంశాలేనని భావిస్తోంది టెలిగ్రామ్. ఇందులో భాగంగా వాట్సాప్ పోటీని తట్టుకునేందుకు టెలిగ్రామ్ సరికొత్త అప్డేట్స్తో లేటెస్ట్ ఫీచర్స్‌ను విడుదల చేసింది. వినియోగదారుల చాట్స్‌ను ట్రాన్స్‌లేట్ చేసే ఫీచర్‌ను జోడించింది. ప్రొఫైల్ పిక్చర్, ఎమోజీ కేటగిరితో పాటు ఇతర ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. తాజాగా అందుబాటులోకి తెచ్చిన ఫీచర్‌తో మొత్తం చాట్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం లభించినట్లయింది. టెలిగ్రామ్‌లో ఎగువన ఉన్న ట్రాన్స్‌లేటింగ్ ఎంటైర్ చాట్స్ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ ఫీచర్ సేవలను పొందొచ్చు. వినియోగదారులను ఉత్తేజపరిచే ఫీచర్స్‌లో ఇదీ ఒకటిగా నిలవనుందని టెలిగ్రామ్ అంచనా వేస్తోంది. ప్రీమియం కస్టమర్లకు మాత్రమే.. ట్రాన్స్‌లేటింగ్ ఎంటైర్ చాట్స్ కేవలం టెలిగ్రాం ప్రీమియం కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర వినియోగదారులు ఈ ఫీచర్‌ను పొందాలంటే వ్యక్తిగత సందేశాలను ఎంచుకుని అనువాదం నొక్కితే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా అదే ట్రాన్స్‌లేట్ అవుతుంది. ఇక ప్రొఫైల్ ఫోటో మేకర్‌తో వినియోగదారులు తమ ప్రొఫైల్ చిత్రంలో ఏదైనా స్కిక్కర్ లేదా యానిమేటెడ్ ఎమోజీని మార్చుకునేందుకు అనుమతిస్తుంది. టెలిగ్రామ్ ప్రీమియం లేకపోయిన్పటికీ.. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాల కోసం యానిమేటెడ్, అలాగే అనుకూల ఎమోజీలను ఉపయోగించవచ్చని టెలిగ్రామ్ ప్రకటించింది. అంతేకాకుండా టెలిగ్రామ్ కూడా కొన్ని ప్రత్యేక ఎమోజీలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా స్టిక్కర్లు, ఎమోజీలను వర్గాల వారీగా క్రమబద్ధీకరించింది. దీంతో వినియోగదారులు పది లక్షల కంటే ఎక్కువ విభిన్న స్టిక్కర్లు, ఎమోజీలను షేర్ చేసే అవకాశముంది. టెలిగ్రామ్ మరో సరికొత్త ఫీచర్ "నెట్వర్క్ యూసేజ్"ను కూడా తమ కస్టమర్లకు పరిచయం చేసింది. దీని ద్వారా వైఫై, మొబైల్ డేటాను కస్టమర్లు ఎంత వినియోగించారో తెలుసుకునేందుకు టెలిగ్రామ్ అనుమతిస్తుంది. వారి డేటాకు అనుగుణంగా ఆటో డౌన్లోడ్ సెట్టింగ్‌లను మార్చుకునే సౌలభ్యాన్ని కల్పించింది. "ఆటో-సేవ్ ఇన్కమింగ్ మీడియా" ఫీచర్ ద్వారా వీడియా పరిమాణం, వీడియో రకం, ఏ చాట్ నుంచి వీడియో వచ్చిందనే విషయాలను సులభంగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. చదవండి: చైనా యాప్‌లపై కేంద్రం కొరడా.. ఈసారి ఏకంగా -
గాంధీజీ ప్రసంగం అనువాదం! వెంకట సుబ్బమ్మ
భారత జాతీయోద్యమంలో గాంధీ శకం మొదలై, ఉద్యమం ఊపందుకున్న రోజులు అవి. దేశ ప్రజలందరిలో జాతీయత భావం ఒకేరకంగా ఉన్నప్పటికీ భాష వేరు కావడం వల్ల పోరాటం సంఘటిత శక్తిగా మారడంలో విఫలమవుతోందని గ్రహించిన గాంధీజీ ‘దక్షిణ భారత హిందీ ప్రచారసభ’ను ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ నేర్పించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. గూడూరులో బహిరంగ సభ హిందీ ప్రచారంలో భాగంగా దక్షిణాదిలో ఎక్కువగా పర్యటించారు గాంధీజీ. అలాగే హరిజనోద్ధరణ కోసం కూడా ఆయన విస్తృతంగా గ్రామాలను సందర్శించారు. 1934లో గాంధీజీ చెన్నై నుంచి రైల్లో గూడూరు మీదుగా నెల్లూరుకు పర్యటిస్తున్నప్పుడు గూడూరులో ధర్మరాజు ఆలయం ముందు ఒక బహిరంగ సభ జరిగింది. ఆ సభలో గాంధీజీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించడానికి హిందీ, తెలుగు తెలిసిన వారొకరు కావలసి వచ్చారు. అప్పుడు గాంధీజీ ప్రసంగాన్ని తెనుగీకరించింది ఓ పదమూడేళ్ల అమ్మాయి! ఆమె పేరు తన్నీరు వెంకటసుబ్బమ్మ. అనువాదం ఒక్కటే కాదు, ఆనాటి జాతీయోద్యమంలో వెంకటసుబ్బమ్మగారు అనేక విధాలుగా పాల్పంచుకున్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఆమె కుమారుడు డాక్టర్ బెజవాడ రవికుమార్ సాక్షి ‘జైహింద్’తో పంచుకున్నారు. ‘బాలకుటీర్’లో నేర్చుకుంద ‘‘మా అమ్మ పుట్టిల్లు తిరుపతి జిల్లా గూడూరు (అప్పటి నెల్లూరు జిల్లా). మా తాత తన్నీరు రమణయ్య సోడా వ్యాపారి. స్వాతంత్య్రపో రాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన గూడూరు పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి. జాతీయోద్యమంలో పాల్గొన్నందుకు కొంతకాలం బళ్లారిలో జైలు శిక్షను కూడా అనుభవించారు. గాంధీజీ హిందీ ప్రచారోద్యమాన్ని చేపట్టినప్పుడు హిందీ నేర్చుకోవడానికి మా అమ్మను గూడూరులోని ‘బాల విద్యాకుటీర్’లో చేర్పించారు మా తాతయ్య. గూడూరులో శిక్షణ తర్వాత చురుగ్గా ఉన్న ముగ్గురిని ఎంపిక చేసి ప్రయాగ మహిళా విద్యాపీఠంలో విదుషీ పట్టా కోర్సు కోసం అలహాబాద్‌కు పంపించారు వాళ్ల హిందీ టీచర్ గుద్దేటి వెంకట సుబ్రహ్మణ్యంగారు. అలా అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)లో హిందీ నేర్చుకుంటూ, కస్తూర్బా ఆశ్రమంలో జాతీయ నాయకులకు సహాయంగా పని చేసే అవకాశం వచ్చింది అమ్మకు. సరోజినీ నాయుడు, జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ, అనిబీసెంట్, విజయలక్ష్మీ పండిట్ వంటి నాయకుల మధ్య జరిగే చర్చలను దగ్గరగా చూశారామె. ఆమెలో జాతీయోద్యమ స్ఫూర్తికి బీజాలు పడిన సందర్భం అది. బాపూజీ ముగ్ధులయ్యారు కోర్సు పూర్తయిన తర్వాత ఇక పెళ్లి సంబంధాలు చూడాలనే ఉద్దేశంతో అమ్మను గూడురుకు తీసుకువచ్చేశారు మా తాతయ్య. గాంధీజీ హరిజనోద్ధరణ మూవ్మెంట్లో భాగంగా దక్షిణాది యాత్ర చేసినప్పుడు అమ్మ దుబాసీగా గాంధీజీ ప్రసంగాన్ని తర్జుమా చేయడంతోపాటు బాపూజీకి స్వాగతం పలుకుతూ సన్మాన పత్రం చదివింది. స్పష్టమైన ఉచ్చారణకు, ధీర గంభీరంగా చదివిన తీరుకు ముగ్ధుడైన బాపూజీ అమ్మ చేతిని ముద్దాడి, తన మెడలో ఉన్న ఖాదీ మాలను తీసి అమ్మ మెడలో వేశారు. తాను రాసుకుంటున్న పెన్నును కూడా బహూకరించారు. ఆ సమయంలో అమ్మ నడుముకు వెళ్లాడుతున్న ఒక తాళం చెవిని గమనించారాయన. అది మా అమ్మ ట్రంకు పెట్టె తాళం చెవి. ‘చాబీ ఇస్తావా’ అని అడిగారట. అప్పుడు అమ్మ నిర్మొహమాటంగా ‘ఇవ్వను’ అని చెప్పిందట. అప్పుడాయన అమ్మ తల మీద చెయ్యి వేసి పుణుకుతూ నవ్వారట. అమ్మ తరచూ ఆ సంగతులను చెబుతూ ఉండేది. జాతీయ పతాకావిష్కరణ సందర్భంగా 80 ఏళ్ల వయసులో వెంకట సుబ్బమ్మ హిందీలో దేశభక్తి గీతాలను ఆలపించినప్పటి చిత్రం అలహాబాద్ జ్ఞాపకాలు అమ్మకు పదిమంది సంతానం. నేను తొమ్మిదో వాడిని. నేను, మా ఆవిడ డాక్టర్లం కావడంతో అమ్మ ఆరోగ్యరీత్యా కూడా మా దగ్గర ఉండడమే ఆమెకు సౌకర్యం అనే ఉద్దేశంతో అమ్మను నేనే చూసుకు న్నాను. అలా రోజూ సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్య అమ్మ దగ్గర కూర్చుని ఆమె చెప్పే కబుర్లు వినడమే నేను ఆమెకిచ్చిన ఆనంద క్షణాలు. ఆ సమయంలో నాకు ఆమె అలహాబాద్ జ్ఞాపకాలను ఎన్నిసార్లు చెప్పిందో లెక్కేలేదు. ఆమె 83 ఏళ్లు జీవించి 2004లో పరమపదించారు. ఆశ్చర్యం ఏమిటంటే... అంతకు ముందు మూడేళ్ల కిందట జాతీయపతాకావిష్కరణ సందర్భంగా ఆమె హిందీలో దేశభక్తి గీతాలను ఆలపించారు. ఆమె మంచి రచయిత కూడా. చరణదాసు శతకాలు రెండు, కాలేజ్ అమ్మాయిల కోసం నాటకాలు, ప్రభోద గీతాలు రాశారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆమె బయోగ్రఫీ రాసుకున్నారు. కానీ అప్పుడు కొంత అప్పుడు కొంత రాస్తూ ఉండడంతో కొన్ని పేజీలు లభించలేదు. ఆ రచనను పరిష్కరించి ప్రచురించడం నాకు సాధ్యం కాలేదు..’’ అని తన తల్లికి చేయాల్సిన సేవ మరికొంత మిగిలిపోయిందన్నట్లు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ రవి కుమార్. నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని ఆయన ఇల్లు... తల్లి రాసిన పుస్తకాల ప్రతులు, ఆమె పుస్తకావిష్కరణల ఫొటోలతో వెంకటసుబ్బమ్మ జాతీయోద్యమ జ్ఞాపకాల దొంతరలా ఉంటుంది. – వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: బోస్ భుజాల మీద హిట్లర్ చెయ్యి వేశాడా! నిజమా?! కథనమా?) -
‘ట్రాన్స్‌లేట్’ టూల్‌ను అప్‌గ్రేడ్ చేసిన గూగుల్
న్యూఢిల్లీ: స్థానిక భాష మాట్లాడే వారిని ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి గూగుల్ చాలానే శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే ఇది తాజాగా ‘గూగుల్ ట్రాన్స్‌లేట్’ టూల్‌ను ‘న్యూరల్ మెషీన్ ట్రాన్స్లేషన్’ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేసింది. ఈ టెక్నాలజీ సాయంతో గూగుల్ ట్రాన్స్‌లేట్ ఇంగ్లిష్ వాక్యాలను బెంగాలీ, మరాఠీ, తమిళ్, తెలుగు, గుజరాతీ, పంజాబీ, మలయాళం, కన్నడ భాషలోకి అనువాదం చేస్తుంది. క్రోమ్ బ్రౌజర్లో ఇది ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. అంటే యూజర్లు వెబ్ కంటెంట్‌ను తొమ్మిది భాషల్లో పొందొచ్చు. ‘న్యూరల్ మెషీన్ ట్రాన్స్లేషన్’ టెక్నాలజీ సేవలను గూగుల్ సెర్చ్, మ్యాప్స్‌కు కూడా విస్తరించినట్లు కంపెనీ తెలిపింది. దీంతో రివ్యూలను మనకు అనువైన భాషలో చూడొచ్చు. ఇక జీ–బోర్డు కీబోర్డు యాప్ 22 దేశీ భాషలను సపోర్ట్ చేస్తుందని పేర్కొంది. అలాగే కంపెనీ గూగుల్ సెర్చ్‌కు హిందీ డిక్షనరీని కలిపింది. ‘భారత్‌లో 23.4 కోట్ల మంది ఆన్లైన్ యూజర్లు దేశీ భాషలను ఉపయోగిస్తున్నారు. ఇంగ్లిష్ వెబ్ యూజర్ల సంఖ్య 17.5 కోట్లుగా ఉంది. వచ్చే నాలుగేళ్లలో మరో 30 కోట్ల మంది దేశీ భాషలను విరివిగా వాడే వారు ఆన్‌లైన్‌లోకి రావొచ్చు’ అని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (ఇండియా, దక్షిణ–తూర్పు ఆసియా) రాజన్ ఆనందన్ తెలిపారు. కాగా గూగుల్ కేపీఎంజీతో కలిసి ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. 2021 నాటికి స్థానిక భాష మాట్లాడే ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 18 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధితో 53.6 కోట్లకు చేరుతుంది. -
పరభాషా సాహిత్యం అనువాదంపై విచక్షణ అవసరం
విశాఖ–కల్చరల్ తెలుగు సాహిత్య ఆరంభాలే అనువాదంపై ఆధారపడ్డ బలమైన నిర్మాణాలని పలువురు సాహితీవేత్తలు సూచించారు. విభిన్న మానవ సమాజంల్లోని ప్రజలు ఒక సమాజంలో ఏం జరుగతున్నదీ తెలుసుకోవాలంటే...ఆ భాషలో రాసింది ఇంకోక భాషలోకి వెళ్లడం చాలా అవసరమని పేర్కొన్నారు. అనువాద రంగంలో తొలిసారిగా సాహిత్య అకాడమి ‘అనువాద ధోరణలు–నైపుణ్యాలు’అనే అంశంపై ప్రముఖ అనువాద సాహితీవేత్తలు అనువాద అనుభవాలను క్రోడికరించి ఒక రోజు సదస్సు నిర్వహించారు. విశాఖ పౌరగ్రంథాలయంలో సాహిత్య అకాడమి, మొజాయిక్ సాహిత్య సంస్థ సంయుక్తంగా ఆదివారం ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిథిగా çహాజరైన ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ పరిభాష సాహిత్య అనువాద ప్రాముఖ్యతను వివరించారు. సంస్కత రచనలు ఎలా తొలినాళ్ల కవులను ప్రభావితం చేసాయో అలానే ఆధునికసాహిత్య ఆరంభాలు కూడా మన పూర్వమహాకవులు మూలాలు ఆధారంగానే తొలి సామాజిక రచనలు, నవలలు, వచనలు పూర్వభూమికలు అయ్యాయన్నారు. ప్రబంధ కవుల కాలం నుంచి సొంత కల్పన,కొంత పౌరాణిక ఇతివత్తాలతో మేళవించి రాయడం మొదలై, తెలుగు కవులు రచనలు స్వతంత్ర ప్రతిపత్తితో వెలుగొందాయని గుర్తి చేశారు. సాహిత్య అకాడమి దక్షిణ ప్రాంతీయ కార్యదర్శి ఎస్. పి.మహాలింగేశ్వర్ మాట్లాడుతూ అనువాదరంగంలో నగరానికి చెందిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎల్.ఆర్.స్వామి, డాక్టర్ ఎ. శేషారత్నం, డాక్టర్ చాగంటి తులసి, వంటి లబ్ది ప్రతిష్టులూ, పురస్కార గ్రహీతలతోపాటుగా, మరికొందరు మహానుభావులు భాషాపటిమతో కషి చేయడం ప్రశంనీయమన్నారు. అనువాద సాహితీవేత్త డాక్టర్ ఎన్. గోపి మాట్లాడుతూ అనువాద లక్షణాలపై వివరించారు. పరభాష సాహిత్యాన్ని అనువదించడంలో అనువధికునికి రెండు భాషలపై పట్టు, నిబద్ధత, నైపుణ్యత అవసరమన్నారు. ముఖ్యంగా విచక్షణ పాటించాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు. బహుముఖ భాషాప్రజ్ఞశాలి ఎల్.ఆర్.స్వామి కీలక ప్రసంగం చేశారు. ఆసక్తిగా పత్రాలు సమర్పణ అనంతరం ఏడు భాషల నుంచి పత్ర సమర్పణ కార్యక్రమం ఆసక్తిగా రేపింది. పత్ర సమర్చకులుగా హిందీ, ఇంగ్లీష్, ఒడియా, బెంగాళీ, కన్నడ, మళయాళీ, ఉర్దూభాల నుంచి తెలుగులోకి అనువాదాలపై రెండు భాగాలుగా సదస్సు జరిగింది. మొదటి సభను డాక్టర్ ఎ. శేషారత్నం(హిందీ) అధ్యక్షతన మహీధర రామశాస్త్రి(ఒడియా), రెండోది అబ్దుల్ వాహేద్(ఉర్ధూ) అనువాదాలపైన నిర్వహించారు. కవయిత్రి జగద్దాత్రి(తెలుగు నుంచి ఇంగ్లీష్) అధ్యక్షతన, రామతీర్ధ(బెంగాళీ), శాఖమూరు రాంగోపాల్(కన్నడ), మాటూరి శ్రీనివాస్(ఇంగ్లీష నుంచి తెలుగు)అనువాదాలపైన పత్రసమర్ఫణ చేశారు. పత్రసమర్ఫణ అనంతరం డాక్టర్ చాగంటి తులసి సమాపన ప్రసంగం చేశారు. ఆకట్టుకున్న కథసంధి సాయంత్రం జరిగిన సదస్సులో సీనియర్ పాత్రికేయుడు చింతకింది శ్రీనివాసరావు నిర్వహించిన కథా సంధి ప్రత్యేక కార్యక్రమం ఆకట్టుకుంది. తను రచించిన క£ý పఠనం, చర్చాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి,సాహిత్య విమర్శకుడు, అనువాదికుడు రామతీర్ధ మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగంలో విశేష ప్రాధాన్యత గల అనువాద కషులకు అభినందనలు తెలిపారు.సదస్సులో ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, కవులు ఆచార్య చందు సుబ్బారావు, ద్విభాష్యం రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
యంగ్ టైగర్ ముఖ్యమంత్రి అట?
అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న ప్రముఖ సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్ మరోసారి తప్పులో కాలేసింది. టాలీవుడ్ హీర్ నందమూరి నటవారసుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేసింది. అవును..గూగుల్ ట్రాన్స్‌లేట్ ఆప్షన్ లో తారక్ (Tarak) అని టైప్ చేసినపుడు ముఖ్యమంత్రి అని తర్జుమా చేస్తోంది. దీంతో తెలుగు సినీలోకం గర్వించ దగ్గ నటుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న జూ. ఎన్టీఆర్ ఇపుడు ముఖ్యమంత్రిగా అవతరించారు. వివిధ భాషలకు సంబంధించిన అర్ధాలను తెలుసుకోవడానికి ఉపయోగించే ఈ టూల్ తమ అభిమాన నటుడి పేరుకి ముఖ్యమంత్రి అర్థాన్ని చెబుతుడడంతో ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యంతో పాటూ...మరింత సంతోషానికి లోనవుతున్నారట. తాత సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న యంగ్ హీరో ఆయన రాజకీయ వారసత్వాన్ని కూడా అందుకోనున్నాడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తిరుగులేదని... గూగుల్ నిజం చేసిందంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారట! అయితే గూగుల్ ట్రాన్స్‌లేట్ పై గతంలో కూడా విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో లీగల్ నోటీసులు కూడా జారీ అయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాంతీయ భాషలపై పట్టులేకపోవడం వలనే ఇది జరిగిందని, ఒక్క 'తారక్' విషయంలోనే కాదు, అనేక పదాల అనువాదం విషయంలోనూ నెటిజన్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయంటూ భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఏదైమైనా 'తారక్' అనే పదానికి 'ముఖ్యమంత్రి' అని తర్జుమా చేయడం విశేషమే. మరి దీనిపై గూగుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా జూ. ఎన్టీఆర్ ని అభిమానుల ముద్దుగా తారక్ అని పిలుచుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న జనతా గ్యారేజ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
డిసెంబర్ కు అష్టాదశ పురాణాల అనువాదం
యూనివర్సిటీ క్యాంపస్: అష్టాదశ పురాణాల అనువాద ప్రక్రియను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని టీటీడీ ఈవో సాంబశివరావు పండితులను కోరారు. తిరుపతి శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో రెండు రోజుల పాటు జరిగిన పండిత పరిషత్ సమావేశం శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఈవో సాంబశివరావు మాట్లాడుతూ... అష్టాదశ పురాణాల్లో 3.70 లక్షల శ్లోకాలు ఉండగా ఇప్పటి వరకు 2.57 లక్షల శ్లోకాల అనువాదం పూర్తయిందని... మిగిలిన అనువాదం కూడా పూర్తి చేసి డిసెంబర్ నాటికి ముద్రించాలని సూచించారు. అలాగే, వ్యాస భారతం, వాల్మీకి రామాయణం గ్రంథాల ప్రచురణ పూర్తికావచ్చిందన్నారు. పబ్లికేషన్ ద్వారా భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్.ముక్తేశ్వరరావు ప్రసంగిస్తూ... అష్టాదశ పురాణాలను ఒక్కో పురాణాన్ని ఓ చిన్న పుస్తకం రూపంలో భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు చెప్పారు. -
భాగ్యనగరిపై.. చెరగని సంతకం
సలాం కలాం అణు శాస్త్రవేత్తగా ప్రస్థానం... వైద్య రంగంలో అత్యాధునిక పరికరాల సృష్టికర్తగా ఆవిష్కరణం... రాష్ట్రపతిగా అరుదైన గౌరవం... సామాజిక సేవతో చైతన్యం... వ్యక్తిత్వ వికాస నిపుణునిగా స్ఫూర్తిదాయకం...ఇలా జీవితపు ప్రతి మలుపులోనూ భాగ్యనగ రితో ఆయనది మరువరాని అనుబంధం. అన్ని విశిష్టతల విలక్షణమూర్తి... మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. ఆయన ఇక లేరన్న నిజాన్ని తట్టుకోలేక మహా నగరం శోక సంద్రంలో మునిగిపోయింది. ‘కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి’ అంటూ కర్తవ్య బోధ చేసిన స్ఫూర్తి ప్రదాతను మరి చూడలేమంటూ యువలోకం చిన్నబోయింది. ఓయూతో విడదీయరాని అనుబంధం ఉస్మానియా యూనివర్సిటీ: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ఎంతో అనుబంధం ఉంది. కలామ్ సైంటిస్టుగా ఉన్నడు క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఆర్‌అండ్‌టీ యూనిట్ ఫర్ నావిగేషనల్ ఎలక్ట్రానిక్స్ స్థాపించి తొలి డెరైక్టర్‌గా పనిచేశారు. ఈ సంస్థ ద్వారా అనే పరిశోధనలు చేసి రక్షణ రంగానికి అందచేశారు. ఓయూను అనేక సార్లు సందర్శించిన కలాం రాష్ట్రపతి హోదాలో దివగంత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో కలసి క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉంది. ప్రస్తుత టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ (గతంలో ఓయూ విద్యార్థి) స్నాతకోత్సవంలో జై తెలంగాణ నిదాలు చేయగా.. ఓపిక పట్టాలని కలాం శాంతింప చేశారు. గత ఏడాది ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల బయోమెడిసిన్ ఇంజినీరింగ్ విభాగంలో నానో, బయో, టెక్నో, కాగ్నో (ఎన్‌బీఐసీ) అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు కలాం హాజరయ్యారు. అదే రోజు ఓయూ రోడ్డులోని శ్రీ అరంబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులను ఉత్తేజపరిచేలా ప్రసంగించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు చెప్పారు. ఇప్పటికీ కళ్లలో మెదులుతున్న ఆ దృష్యాలు చెదరక ముందే ఆ గొప్ప దార్శనికుడు కన్నుమూయడం దేశానికి ఎంతో లోటని ఓయూ బయోమెడిసిన్ ఇంజినీరింగ్ అధ్యాపకుడు మేడిపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఉపాన్యాసాన్ని ట్రాన్స్‌లేట్ చేశా సాక్షి,సిటీబ్యూరో: మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం స్ఫూర్తి, కీర్తి దేశానికి అవసరమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి అన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 4న ఎల్బీ స్టేడియంలో లీడ్ ఇండియా 2020 కార్యక్రమంలో కలాం ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించానని, ఆ భాగ్యం తనకు దక్కడం పూర్వ జన్మ సుకృతమన్నారు. కలాం మన జాతి రత్నమని, శాస్త్రవేత్తగా, వేదాంతిగా, భగవద్గీత, ఖురాన్‌లను అవగాహన చేసుకొన్న మేధావి అని కొనియాడారు. ప్రపంచం శ్లాఘించదగ్గ శాస్త్రవేత్త ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. కలాం మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక ్తం చేస్తున్నట్లు తెలిపారు. రేడియోలో ప్రసంగాలు తర్జుమా చేశా: డా. చెన్నయ్య రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముఖ్య దినాల్లో జాతినుద్దేశించి చేసే ప్రసంగాలు ఏడాదికి ఆరు సార్లు చాలా సంవత్సరాలు తెలుగులోకి ఆకాశవాణిలో అనువాదం చేసినట్లు తెలుగు వ ర్సిటీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ జె. చెన్నయ్య తెలిపారు. ఆయన మృతి భారతజాతికి తీరనిలోటన్నారు. జాతిరత్నం మృతిని జీర్ణించుకోలేం: విరాహత్ అలీ భారత జాతి రత్నం అబ్దుల్ కలాం మృతి జీర్ణించుకోలేమని ఐజేయూ అనుబంధ విభాగం టీయూడబ్ల్యూజే తెలంగాణ రాష్ట్ర ముఖ్యనేత విరాహత్ అలీ అన్నారు. జర్నలిస్టులకు కూడా ఆయన జీవనశైలి ఆదర్శప్రాయంగా నిలిచిందని, ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ సమయం చిన్నారులతోనే.. చాంద్రాయణగుట్ట: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు పాతబస్తీతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన సైంటిస్ట్‌గా కొనసాగిన డీఆర్డీవో కూడా పాతబస్తీలోనే ఉంది. ఆయన రాష్ట్రపతిగా నియమితులైన అనంతరం 2004 జనవరి 19న పాతబస్తీ లాల్ దర్వాజాలోని ఇంద్ర విద్యానికేతన్ హైస్కూల్‌ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. డీఆర్డీవోలో ఆయనతో కలిసి పనిచేసిన పాఠశాల చైర్మన్ ఆర్.ఎన్.అగర్వాల్ ఆహ్వానం మేరకు ఆయన పాఠశాలకు విచ్చేశారు. దాదాపు రెండు గంటల పాటు విద్యార్థులతో మాట్లాడారు. ఆ సమయంలో స్థానికంగా ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థులను కూడా ఇక్కడికి రప్పించి ఆయనతో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ఈ సమయంలో పాఠశాల యాజమాన్యం మరికొన్ని కార్యక్రమాలు రూపొందించినా ఆయన కేవలం విద్యార్థులతో ముచ్చటించేందుకే సమయాన్ని కేటాయించారు. అలాంటి గొప్ప వ్యక్తి మృతి వార్త తెలుసుకుని పాఠశాల ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు. తప్పు చేస్తే ‘హీరో ఆఫ్‌ది డే’ అనేవారు కలాం అధ్వర్యంలో జరిగిన అగ్ని, పృథ్వి మిస్సైల్ ప్రాజెక్టులో ఐదేళ్ల పాటు పనిచేసే భాగ్యం నాకు దక్కింది. విధి నిర్వహణలో చిన్నచిన్న పొరపాట్లు చేస్తే ఆయన కోపగించుకునేవారు కాదు. ‘ఈ రోజు హీరో ఆఫ్ ది డే నువ్వే’ అనేవారు. జరిగిన లోపాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆయన నిరంతరం మాకు సూచించేవారు. అర్ధరాత్రి, అపరాత్రి పరిశోధనలే ఆయన ప్రపంచం. ఆర్సీఐలో పనిచేస్తున్న సమయంలోనే పద్మవిభూషణ్ అవార్డు కలాంను వరించింది. విధుల్లో ఎలాంటి సందేహాలు తలెత్తినా ఆయనను అడిగితే ఓర్పుతో సమాధానం ఇచ్చేవారు. తన కింద పనిచేస్తున్న ఉద్యోగులతో మిత్రుడిగా, సహచరుడిగా మెలిగేవారు. కష్టపడి పనిచేసేవారిని ఎప్పుడూ మెచ్చుకునేవారు. - టి.వి.రెడ్డి, ఆర్సీఐ రిటైర్డ్ టెక్నికల్ అధికారి