
సాక్షి, హైదరాబాద్: తెలుగు భాష, సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఈ నెల 29 వరకు తెలుగు భాషా అమృతోత్సవాలను జరుపతలపెట్టినట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ కంచర్ల సుబ్బానాయుడు తెలిపారు. రవీంద్రభారతిలో మంగళవారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంత్యుత్సవాలతో ఇవి ప్రారంభమవుతాయని, తొలిరోజు జరగనున్న కార్యక్రమాలకు సమన్వయకర్తలుగా లక్ష్మీ పెండ్యాల, పేరి,, ఖాదర్ బాషా, అమరనేని సుకన్య, ఇమ్మడి రాంబాబు, వడ్డేపల్లి విజయలక్ష్మి వ్యవహరిస్తారని వివరించారు. వారం పాటు ప్రతీ రోజూ సాహితీ సదస్సులు, సాహితీ ప్రక్రియలు, కవి సమ్మేళనాలు, కవులకు గౌరవ పురస్కారాలు, పుస్తకావిష్కరణలు, పుస్తక ప్రదర్శనలు ఉంటాయన్నారు.
(చదవండి: బంగారు కాదు బార్ల తెలంగాణ: షర్మిల)
Comments
Please login to add a commentAdd a comment