సాక్షి, బనశంకరి(కర్ణాటక): మంచి నడవడికతో చట్టసభల గౌరవం పెంచాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైనే ఉందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయన శనివారం బెంగళూరులో విధానసౌధలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సభా గౌరవం పెంచడంలో ప్రజాప్రతినిధుల పాత్ర అపారమైనదన్నారు. ఏదైనా చట్టం తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వనిదే. స్పీకర్ దీనిపై చర్చ జరిగేలా చూసుకోవాలి అని చెప్పారు. తరచూ చట్టసభల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడటం పట్ల స్పీకర్ స్పందిస్తూ సభను సజావుగా నడిపించే బాధ్యత సభాపతిదేనన్నారు.
పార్టీ ఫిరాయింపుల చట్టంపై నివేదిక..
పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టానికి సంబంధించి రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి నేతృత్వంలోని కమిటీ నివేదిక అందజేసిందని, దీనిపై ఈ నెల 26 నుంచి 28 వరకు సిమ్లాలో జరిగే సమ్మేళనంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. స్పీకర్ పరిధి, నిబంధనల్లో స్పష్టత, ఏ కాల పరిమితిలోగా చర్యలు తీసుకోవాలనేదానిపై ఇందులో నియమావళి ఉంటుందని చెప్పారు.
చదవండి: న్యాయమూర్తులకు నైతికతే కీలకం
Comments
Please login to add a commentAdd a comment