నేనేంటో నిరూపించుకుంటా! | Sultan actor Amit Sadh will soon be seen romancing Taapsee Pannu | Sakshi
Sakshi News home page

నేనేంటో నిరూపించుకుంటా!

Published Mon, Jul 18 2016 2:10 AM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

నేనేంటో నిరూపించుకుంటా! - Sakshi

నేనేంటో నిరూపించుకుంటా!

గ్లామరస్ పాత్రలతో తన గౌరవాన్ని తగ్గించారని తాప్సీ ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాదిలో తొలుత తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయమై ఆపై తమిళ సినిమాల్లోకి వచ్చిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ. ఇక్కడ ఆడుగళం తదితర చిత్రాల్లో నటించినా మంచి గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఇప్పుడు తమిళంలో అసలు అవకాశాలు లేవు. తెలుగులో ఒక చిత్రం చేస్తున్నారు. అయితే హిందీలో రెండు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తాప్సీ తన మనోభావాన్ని పంచుకుంటూ తాను నటిగా రంగప్రవేశం చేసినప్పుడు సినీప్రపంచం గురించి ఎక్కువ తెలుసుకోలేకపోయానన్నారు. కథల ఎంపికలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపలేదని పేర్కొన్నారు.

దీంతో నటనకు ప్రాధాన్యం లేని చిత్రాలు చాలా చేశానని అన్నారు. అందులో చాలా చిత్రాల్లో తనను గ్లామరస్‌గా నటింపజేశారని వాపోయారు. ముఖ్యంగా తెలుగు చిత్రాల్లో అలాంటి అవకాశాలు ఇచ్చారని అన్నారు. తద్వారా తన గౌరవాన్ని తగ్గించి ఎక్కువగా అలాంటి అవకాశాలే ఇచ్చారన్నారు. అందుకే తనలోని నటనా ప్రతిభకు అవకాశం రాలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తాజాగా నటిస్తున్న హిందీ చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు పోషిస్తున్నట్లు చెప్పారు.

ఈ చిత్రాల ద్వారా నటిగా తానేమిటో నిరూపించుకుంటానని అన్నారు. బాలీవుడ్‌లో ప్రతిభావంతులైన నటీ మణులు చాలా మంది ఉన్నారని, వారితో పోటీ పడడం అంత సులభం కాదని అన్నారు. అయినా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి పోరాడతానని బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు పొందిన తరువాతనే ఇతర భాషా చిత్రాల్లో నటిస్తానని తాప్సీ అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement