జీవ జలాలను గౌరవిద్దాం! | let us respect living water bodies | Sakshi
Sakshi News home page

జీవ జలాలను గౌరవిద్దాం!

Published Tue, May 10 2016 3:16 AM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM

జీవ జలాలను గౌరవిద్దాం!

జీవ జలాలను గౌరవిద్దాం!

విశ్లేషణ
 
మన దేశంలోని నదుల జాబి తాను ఓసారి చూడండి, చాలా పొడవుగా ఉంటుంది. ప్రతి నదీ ఆ పరివాహక ప్రజలకు ఒక్కొక్క అర్థాన్నిచ్చేదై ఉంటుంది లేదా గంగానదిలాగా సువిశాల మైదాన ప్రాంతాల వ్యవసాయానికి ఆధా రమై ఉంటుంది. చాలా నదులు బంగాళాఖాతంలో, కొన్ని అరేబియా మహాసము ద్రంలో కలుస్తాయి. కాగా కచ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది పాక్షిక మెట్ట ప్రాంతాల్లోని నదులు... జీవ ప్రదాతలుగా నదుల పాత్రను నొక్కిచెబుతున్నట్టు అంతర్గతంగానే ప్రవహిస్తాయి.

అయినాగానీ, మనం ఏమంత ఫలదాయకంగాని సాగునీటి వసతి కోసం నదుల మీద డ్యాములు నిర్మించ డానికి మించి వాటి గురించి పెద్దగా ఆలోచించం. కానీ మన పట్టణం లేదా గ్రామం పక్కగా పారే నదులను కలుషితం మాత్రం చేస్తాం. పౌరులకు జీవజలమైన శుభ్రమైన మంచి నీటిని సరఫరా చేయాలని స్థానిక ప్రభుత్వాలను ఆదే శిస్తాం... మనం మాత్రం మరో ఆలోచనే లేకుండా నదుల్లోకి వ్యర్థాలను కుమ్మరించేస్తుంటాం. అవి ఆ వ్యర్థాలను దిగు వకు ప్రవహింపజేసి ఇతరులకు హాని చేస్తాయి. అయినా మనం వాటిని పవిత్ర మైనవిగా పిలవ డానికి సంకోచించం.

మనల్ని పరిశుద్ధం చేసుకోవడం కోసం నదుల్లో స్నానాలూ చేస్తాం, అడ్డూఅదుపూ లేకుండా వాటిని మురికిగానూ చేస్తాం. వాటిని పరిశుభ్రం చేసే ప్రయత్నం ఎన్నడూ సఫలం కాలేదు. నదు లను ఎంతగా కలు షితం చేసేశా మంటే, మనం చేయగలిగినది వాటిని పరిశుభ్రం చేయడం గురించి మాట్లాడటం మాత్రమే. గంగానదిని శుద్ధి చేస్తా మనే మాట ఎంత కాలంగా వినడం లేదు? ఇప్పుడిక మిగతా నదులన్నీ యమునలా దాదాపు గంగతో పోటీపడే స్థాయిలో కలుషితమైపోయాయి. ఢిల్లీ సమీప ప్రాంతాల్లో అవి నురగలు కక్కుతుంటాయి. బహుశా అవి ఎండిపోయి నప్పుడు మాత్రమే శుభ్రంగా కనిపిస్తాయ నుకుంటాను. ఇటీవలి కాలంలో వాటి పూడిక కూడా సమ స్యగా మారింది.

హఠాత్తుగా మనం ఇప్పడు నీరు చాలా ముఖ్యమైనదని గుర్తించాం. చాలా రాష్ట్రాల్లో బావులు, నదీ గర్భాలు కూడా ఎండిపోయేంతగా ఈ ఏడాది నీటికి కరువు ఏర్పడటమే అందుకు కారణం. ట్యాంకర్లలో వచ్చే నీళ్ల కోసం పెద్దవాళ్లే కాదు, పిల్లలు సైతం నీటి  పోరాటాలు చేయాల్సి వస్తోంది. అలా సరఫరా చేసే నీరు ఎక్కడి నుంచి తెస్తున్నదో వాటిని ఉపయోగించేవారికి తెలియకపోవడం ఘోర మైన తప్పు.  

నీటిని మన మనుగడకు అవసరమైన ముఖ్య సరుకుగా గుర్తించడానికి మనం గతంలో కూడా చేరువయ్యాం. నీటిని సంరక్షిస్తూ జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరాన్ని లెక్క చేయని అవివేకానికి సంబంధించి ప్రతి కరువూ దేశానికి గుణ పాఠమే. వచ్చేసారి వానలు సమృద్ధిగా కురిస్తే చాలు, గత ఏడాది ఎంత దుర్భరంగా గడిచిందో, పంటలు దెబ్బ తిని ప్రజలు ఎలా వేరే ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చిందో, కొద్దిగా తాగునీటి కోసం ఎంత సమయాన్ని వెచ్చించాల్సి వచ్చిందో మనమందరం విస్మరిస్తాం. కొన్ని నెలలు గడిచేసరికి, ఎంత దయనీయంగా బతికామనే జ్ఞాప కాలు ఆవిరైపోతాయి. మళ్లీ నీటికి కరువు వచ్చే వరకు గుర్తుకురావు.

ఉత్తమ నీటి నిర్వహణకు ఉదాహరణగా చెప్పే అన్నా హజారే గ్రామం రాలేగావ్‌సిద్ధిలో సైతం ఈసారి బోరు బావులు ఎండిపోయాయి. అతిగా నీటిని తోడేయడం వల్లనే మిగతావి కూడా ఎండి పోయాయని గుర్తించిన హజారే వాటికి అడ్డుకట్ట వేయాలనుకున్నారు. కానీ ఆ గ్రామం అందుకు ఒప్పుకోలేదు. ఆయన గ్రామాన్ని నమూనాగా చూపి ప్రభుత్వం ఇతర ప్రాంతాలలో కూడా అలాంటి గ్రామాలను తయారు చేయాలని కోరింది.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రావడానికి దశాబ్దాల ముందే మహారాష్ట్రకు సొంత ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) ఉండేది. ఇంకుడు గుంతల నిర్మాణం అందులో భాగంగా ఉండేది. వర్షాలు బాగా కురిసిన ఏడాది భూగర్భంలోని నీటి బ్యాంకును అది రీచార్జ్ చేస్తుంది. అయినా బోరు బావులను మరింత లోతుగా తవ్వాల్సి వస్తోంది. 200 అడుగుల లోతుకు మించి తవ్వరాదనే చట్టం అమల్లోకి వచ్చింది. కానీ స్థానిక అధి కారులు దీన్ని పట్టించుకోవడం లేదు. ఇంతకూ ఆ ఇంకుడు గుంతలు ఏమయ్యాయి? లంచగొండి యంత్రాంగం అవి నిర్మాణం కాకుండా చేసి ఉండాలి.

ఇది హజారే నమూనాతో ఉన్న సమస్య కాదు, మనం నీటితో ఎలా వ్యవహరి స్తున్నామనే దానికి సంబంధించినది. నీరు పుష్కలంగా ఉన్న ప్పుడు మనం దాన్ని విలువలేనిదిగా లెక్క చేయనే చేయం. నీటి కొరత మొదలైన ప్పుడు ఆ సంక్షోభాన్ని ఎలాగో ఒకలా  అధిగ మిస్తామని విశ్వసిస్తాం. ఈసారి, అది అంత తేలికగా ఏం జరగడం లేదు. బహుశా ఆ ప్రకృతే జీవజలంపట్ల మన్నన చూపమని మనల్ని కోరు తున్నట్టుంది.

అదృష్టవశాత్తూ ఈ విషయం పట్ల గుర్తింపు అక్కడక్కడా కనిపిస్తోంది. నీటిని సంరక్షించడానికి ఏమైనా చేసినవారికి లేదా చేస్తున్నవారికి ఒక టీవీ చానల్ అవార్డులను ప్రదానం చేసింది.
 మహారాష్ట్రలో నానాపాటేకర్-మార్కండ్ అనాస్‌పురేల ‘నామ్’ వంటి స్వచ్ఛంద సంస్థలు చిన్న చిన్న నదులను విశాలం చేస్తున్నాయి. ఆ ఇద్దరు నటులు అందరి నుంచి చందాలు వసూలు చేస్తున్నారు. ఒక రిక్షావాలా జేబులో ఎంతుంటే అంతా ఇచ్చేస్తే, ఒక రచయిత్రి తన పారితోషి కాన్ని ఇచ్చేస్తారు. అతి తక్కువ ఖర్చుతో, ఎంతో వేగంతో ఆ పని జరిగేలా తోడ్పడుతున్నారు.

మన ముందున్న సమస్య సరళమైనదే. నీటి వినియోగ దారులంగా మనం నీటి వనరులతో ఎలా వ్యవహరిస్తున్నా మనేది ఆలోచించడం లేదు. సంక్షోభం తలెత్తినప్పుడు లేదా సంక్షోభం మధ్య ఉండగా సైతం, కొంత నీటిని నదికి దిగువన ఉన్నవారి కోసం వదులు కోవాలంటే గగ్గోలు పెట్టేయవచ్చు... నాసిక్ నీటిని మరఠ్వాడాకు పంపుతుంటే జరిగినట్టు. అంతేగానీ అక్కడ తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతుండగా, ఇక్కడ నాసిక్ ఘాట్‌లలో ఆ అరుదైన నీటితో మతాచారం కోసం స్నానాలు చేస్తున్నందుకు బాధైనా కలుగదు. వారికి బుద్ధి చెప్పడానికి కోర్టులు కలుగ జేసుకోవాల్సి వచ్చింది.
 
- మహేష్ విజాపుర్కార్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్: mvijapurkar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement