ఆర్టిఫిషియల్ ఇమేజెస్ హవా మామూలుగా లేదు. ఏఐ ద్వారా ఇప్పటికే సినిమా, క్రీడారంగానికి చెందిన సెలబ్రిటీల ఫోటోలను వివిధ రకాలుగా చిత్రించిన ఏఐ ఆర్టిస్ట్ తాజాగా మరికొన్నింటిని సృష్టించారు. మిడ్ జర్నీని టూల్‌తో ఏఐ ఆర్టిస్ట్ SK MD అబూ సాహిద్ అందమైన స్టార్లను వృద్ధులుగా మార్చేసారు.
ఐశ్వర్యా రాయ్, ప్రియాంక చోప్రా తదితర విమెన్ యాక్టర్స్ సీనియర్ సిటిజెన్స్ అయితే ఎలా ఉంటారో అన్న ఊహ వీటికి ప్రాణమిచ్చింది. అంతేకాదు శ్రద్ధాకపూర్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, అలియా భట్, కృతి సనన్, అనుష్క శర్మ లాంటి ఫోటోలను కూడా మార్చివేయడంతో ఇవి వైరల్‌గా మారాయి. అవేంటో మీరూ ఒకసారి చూసేయండి .
ఇదీ చదవండి: టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు
ముడతలు పడిన చర్మం, నల్లటి వలయాలతో భయంకరంగా కనిపిస్తున్నారంటూ ఫ్యాన్స్ గుండెలు బాదుకుంటున్నారు. "బాప్ రే కృతి సనన్ నా బామ్మగా కనిపిస్తుంది." ఒకరు ఆందోళన వ్యక్తం చేయగా, "శారీరక సౌందర్యం తాత్కాలికం, కానీ అంతర్గత సౌందర్యం శాశ్వతమైనది" ఇలా ఒక్కో పిక్‌పై ఒక్కో రకంగా హిల్లేరియస్ కమెంట్స్‌తో యూజర్లు సందడి చేస్తున్నారు. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?)
కాగా 23 వేల ఇన్‌స్టా ఫాలోయర్లతో ఏఐఆర్టిస్ట్ సాహిద్ సోషల్ మీడియాలో ఏఐ పిక్స్‌తో బాగా పాపులర్ అవుతున్నాడు. క్రికెటర్‌లను ముసలివాళ్లుగా, స్థూల కాయులుగా, ఫుట్‌బాల్ క్రీడాకారులుగా, బిలియనీర్లను బిచ్చగాళ్ళుగా, షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జీలను శిశువులుగా, మెట్ గాలాలో సందడి చేసిన బిలియనీర్లు, డిస్నీ సినిమాల్లో బాలీవుడ్ నటులు ఇలా ఆయన పోస్ట్ చేసిన వెంటనే ఏఐ పిక్స్ వైరల్ కావడం కామన్‌గా మారిపోయింది. (Dr.Vandana Lal Success Story: రూ. 3వేల కోట్ల నికర విలువతో రిచెస్ట్ విమెన్: ఆసక్తికర విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment