సంగీతానికి మంగళం | Mangalam music | Sakshi
Sakshi News home page

సంగీతానికి మంగళం

Published Fri, Feb 21 2014 5:06 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

సంగీతానికి మంగళం

సంగీతానికి మంగళం

  •     సంగీత కళాశాలలో చారిత్రక కోర్సులకు ముగింపు
  •      అధికారుల అనాలోచిత నిర్ణయాలు
  •  సంగీత ప్రియుడు శ్రీవేంకటేశ్వరునికి నిత్య స్వరార్చన చేయడంలో ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులది కీలకపాత్ర. శాస్త్రీయ సంగీతానికి ప్రాణం పోస్తున్న కళాశాలను టీటీడీ నిర్వహిస్తోంది. అరుుతే అధికారులు, కొందరు అధ్యాపకుల అనాలోచిత నిర్ణయూలతో ఈ సంగీత కళాశాల మూతపడే పరిస్థితులు నెలకొంటున్నారుు.
     
    తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: ఆధ్యాత్మిక భావాలు, కళలపై ఆసక్తి ఉండడంతో అప్పటి టీటీడీ ఈవో చెలికాని అన్నారావు 1959లో సంగీత కళాశాలను ఏర్పాటు చేశారు. కళాశాల ప్రారంభంలో సంగీత విశారద, సంగీత ప్రవీణ కోర్సులను ప్రవేశపెట్టారు. అరుుతే 55 ఏళ్ల నుంచి ఉన్న ఈ చారిత్రక కోర్సులకు టీటీడీ అధికారులు మంగళం పాడేందుకు నిర్ణయించారు. శాస్త్రీయ కళలు, సంగీతంపై అవగాహన లేని, ఆధ్యాత్మిక చింతనలేని ఓ అధికారి ఈ చారిత్రక తప్పిదానికి కారణమయ్యాడు. కళాశాలలో ఈ కోర్సుల్లో మాత్రమే అత్యధికంగా విద్యార్థులు ఉంటారు. అలాంటి ఈ కోర్సులకు మంగళం పాడాలని నలుగురు అధ్యాపకులు కంకణం కట్టుకున్నారు. వీరి ప్రతిపాదనలను ఆమోదిస్తూ అధికారులు కోర్సులకు మంగళం పలికేందుకు పచ్చజెండా ఊపేశారు. తొలగింపు కోర్సుల ఫైల్ చక చక నడిపేస్తున్నారు. దీనిపై వచ్చే పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
     
    టీటీడీ విద్యాలయూల్లో కలికితురాయి

     ఎస్వీ సంగీత నృత్య కళాశాల టీటీడీ విద్యాలయూల్లో కలికితురాయిగా నిలిచింది. దేశంలో మరెక్కడా లేనన్ని వసతులు, కోర్సులతో విరాజిల్లుతోంది. శాస్త్రీయ సంగీతానికి పుట్టినిల్లుగా ఉన్న తమిళనాడులోనూ ఇన్ని సౌకర్యాలతో పగటి పూట సంగీత కళాశాల లేదు. అలాంటి కళాశాలలో ప్రక్షాళన పేరుతో సంగీతం గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది. విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే మరే కళాశాలకు దీనికి పోటీ ఉండదు.  ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా శ్రీవారికి నిత్య సంగీత కైంకర్యం జరుగుతోందంటే అది సంగీత కళాశాల ఘనతే.

    శ్రీవారి సేవలు, ఉత్సవాల్లో పెద్ద ఎత్తున సంగీత కైంకర్యాలు కళాశాల నిర్వహణలోనే జరుగుతున్నాయి. అలాంటి కళాశాలలో కోర్సుల ఎత్తివేత నిర్ణయంతో మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది. గత ఈవోలు సంగీత కళాశాల నిర్వహణకు వెనకడుగు వేయలేదు.  మిగతా విద్యాసంస్థల నిర్వహణ వేరు... ఈ కళాశాల నిర్వహణ వేరు అని భావించి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చేవారు. కళాశాలకు ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. అసలు కళాశాల ఉండడమే దండగని భావిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
     
    కళాశాలను మూసే కుట్ర

     
    దశలవారీగా కళాశాలను మూత వేసేందుకు కుట్ర జరగుతోంది. ఈ కుట్రలో నలుగురు అధ్యాపకులు ఓ అధికారితో భాగస్వామి అయ్యారు. తొలుత కోర్సుల తగ్గింపు, తరువాత దశల వారీగా కోర్సులను ఎత్తివేత ద్వారా విద్యార్థులను తగ్గించవచ్చు అని భావిస్తున్నారు. తద్వారా విద్యార్థులు లేరని కళాశాలకు శాశ్వతంగా తాళం వేసే కుట్ర శరవేగంగా జరిగిపోతోంది. డే కళాశాలలో మెత్తం 10 డిపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. సంగీత విశారద, ప్రవీణ కోర్సుల్లో(3 సంవత్సరాలు కలిపి) 182 మంది ఉన్నారు. బీమ్యూజిక్, ఎంఏ మ్యూజిక్ కోర్సుల్లో కేవలం 64 మంది విద్యార్థులు ఉన్నారు. అధికారులు నిర్ణయించినట్టు విశారద, ప్రవీణ కోర్సులకు మంగళం పలికితే కళాశాలలో విద్యార్థుల సంఖ్య పూర్తిస్థాయిలో పడిపోతుంది.  
     
    కాంట్రాక్ట్ లెక్చరర్ల తొలగింపే లక్ష్యంగా...
     
    సంగీత కళాశాలలో 28 మంది పర్మినెంట్, 20 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. విశారద కోర్సులను తొలగిస్తే మిగిలే విద్యార్థుల సంఖ్య కేవలం 64 మంది మాత్రమే. వీరికి 48 మంది అధ్యాపకులు అవసరమా అని యాజమాన్యం ఆలోచించక తప్పదు. తద్వారా కాంట్రాక్ట్ లెక్చరర్‌లను తొలగించవచ్చనేది టీటీడీ అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగించే కుట్రలో భాగంగా కోర్సులను ఎత్తివేయడానికి ప్రయత్నించడం బాధాకరం.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement