
హాంగ్ కాంగ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు జయ పీసపాటి ఆధ్వర్యంలో హాంగ్ కాంగ్ లో దసరా శరన్నవరాత్రి అంబురాలు సంబరాన్నంటాయి. ముఖ్యంగా భారతీయులు దుర్గ పూజలు, అష్టమి నాడు కన్య పూజలు, విజయదశమి నాడు రావణ దహనం చేయడం స్థానికుల్ని విశేషంగా ఆకట్టుంది. దీంతో హాంగ్ కాంగ్ వీధులు దసరా వేడుకలతో శోభాయమానం సంతరించుకున్నాయి. స్థానికులు సైతం భారతీయుల సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు ఉత్సహం చూపించారు. ముఖ్యంగా దసరా సందర్భంగా 9రోజుల పాటు పూలనే దేవతలుగా ఆరాధించి 9రోజులు 9రూపాల్లో బతుకమ్మను తయారుచేసి, పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పండుగను వయోభేదం లేకుండా ఘనంగా నిర్వహించారు.
ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లగానే ఈ ఏడాది దసర ఉత్సవాల్ని జరిపారు. ప్రతిఏడాది దసరా అంటే స్థానికంగా ఉండే భక్తులు పారాయణనానికి వెళ్ళేటప్పుడు పండ్లు, పూలు, బహుమతులు తీసుకువెళ్ళే వారు. కానీ ఈ సంవత్సరం దసరా వేడుకల్లో భక్తులు కానుకల్ని అందించారు. భక్తులు చదివించిన ఆ కానుకల్ని స్వచ్చంద సంస్థలకు అందించడం సంతోషంగా ఉందంటూ ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు జయ పీసపాటీ ప్రశంసల వర్షం కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment