
బీజింగ్: హాంకాంగ్‌ను పూర్తి స్థాయిలో తమ నియంత్రణలోకి తెచ్చుకున్నామని ప్రకటించారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. దాని ద్వారా అల్లర్ల నుంచి సుపరిపాలన దిశగా హాంకాంగ్ మార్పు చెందినట్లు చెప్పారు. మరోవైపు.. తైవాన్ వేర్పాటువాదంపై చైనా పోరాటం చేస్తోందన్నారు. తైవాన్ తమ అంతర్గత భాగమని, ఆ ప్రాంత సమగ్రతను తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్’లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు జిన్‌పింగ్.
‘హాంకాంగ్‌లో పరిస్థితులు ఆందోళనల నుంచి సుపరిపాలన దిశగా మార్పు చెందాయి. స్వీయ పరిపాలన ద్వీపం తైవాన్‌లో వేర్పాటు వాదం, విదేశీ శక్తుల జోక్యంపై ప్రధానంగా పోరాటం చేస్తున్నాం.’ అని పేర్కొన్నారు జిన్‌పింగ్. తైవాన్‌ను స్వతంత్ర ప్రాంతంగా తాము అంగీకరించబోమని, తైపీ తమ అంతర్గత ప్రాంతమని చాలా సందర్భాలుగా చైనా చెబుతూ వస్తోంది. ఇటీవల అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ, ఇతర చట్ట సభ్యులు తైనాన్‌లో పర్యటించగా.. ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్‌ను అష్టదిగ్భందనం చేసి.. యుద్ధ మేఘాలను ఆవరించింది.
ఇదీ చదవండి: చైనా అధ్యక్షుడిగా ముచ్చటగా మూడోసారి ఆయనే!
Comments
Please login to add a commentAdd a comment