కజన్: గ్లోబల్ సౌత్ దేశాలు కలిసికట్టుగా ఆధునికత దిశగా ముందుకు సాగుతుండడం ప్రపంచ చరిత్రలో, మానవ నాగరికతలో అపూర్వమైన ఘట్టమని చైనా అధినేత జిన్‌పింగ్ ప్రశంసించారు. శాంతి, ఉమ్మడి భద్రత కోసం బ్రిక్స్ ప్లస్ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన బ్రిక్స్ ఔట్‌రీచ్ సదస్సులో ప్రసంగించారు.
బ్రిక్స్‌ప్లస్ దేశాల శాంతి ప్రపంచ శాంతితో ముడిపడి ఉందన్నారు. ఉమ్మడి ప్రగతి కోసం ఆయా దేశాలన్నీ స్వయంగా చోదక శక్తిగా మారాలని సూచించారు. దేశాల మధ్య సమాచార మారి్పడి, సంప్రదింపులు మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ గ్లోబల్ సౌత్‌ను ఎప్పటికీ తమ గుండెల్లో నిలుపుకుంటామని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. తమ మూలాలను మర్చిపోవడం లేదన్నారు.
ముగిసిన బ్రిక్స్ సదస్సు
రష్యాలో మూడు రోజులపాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసింది. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలు కాగా, కొత్తగా ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా, యూఏఈ, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. కూటమిలో సభ్యత్వం కోసం తుర్కియే, అజర్‌బైజాన్, మలేసియా దరఖాస్తు చేసుకున్నాయి. మరికొన్ని దేశాలు సైతం బ్రిక్స్‌లో చేరడానికి ఆసక్తి ప్రదర్శించాయి. ముగింపు సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రసంగించారు. రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా సాగించిన ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. ప్రపంచంలో బ్రిక్స్ పాత్రను పశి్చమ దేశాలకు ప్రత్యామ్నాయంగా అభివరి్ణంచారు.
Comments
Please login to add a commentAdd a comment