Bricks Summit
-
ఉమ్మడి భద్రత కోసం పనిచేయాలి: జిన్‌పింగ్
కజన్: గ్లోబల్ సౌత్ దేశాలు కలిసికట్టుగా ఆధునికత దిశగా ముందుకు సాగుతుండడం ప్రపంచ చరిత్రలో, మానవ నాగరికతలో అపూర్వమైన ఘట్టమని చైనా అధినేత జిన్‌పింగ్ ప్రశంసించారు. శాంతి, ఉమ్మడి భద్రత కోసం బ్రిక్స్ ప్లస్ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన బ్రిక్స్ ఔట్రీచ్ సదస్సులో ప్రసంగించారు. బ్రిక్స్‌ప్లస్ దేశాల శాంతి ప్రపంచ శాంతితో ముడిపడి ఉందన్నారు. ఉమ్మడి ప్రగతి కోసం ఆయా దేశాలన్నీ స్వయంగా చోదక శక్తిగా మారాలని సూచించారు. దేశాల మధ్య సమాచార మారి్పడి, సంప్రదింపులు మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ గ్లోబల్ సౌత్‌ను ఎప్పటికీ తమ గుండెల్లో నిలుపుకుంటామని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. తమ మూలాలను మర్చిపోవడం లేదన్నారు. ముగిసిన బ్రిక్స్ సదస్సు రష్యాలో మూడు రోజులపాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసింది. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలు కాగా, కొత్తగా ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా, యూఏఈ, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. కూటమిలో సభ్యత్వం కోసం తుర్కియే, అజర్బైజాన్, మలేసియా దరఖాస్తు చేసుకున్నాయి. మరికొన్ని దేశాలు సైతం బ్రిక్స్‌లో చేరడానికి ఆసక్తి ప్రదర్శించాయి. ముగింపు సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రసంగించారు. రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా సాగించిన ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. ప్రపంచంలో బ్రిక్స్ పాత్రను పశి్చమ దేశాలకు ప్రత్యామ్నాయంగా అభివరి్ణంచారు. -
పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ
మాస్కో:పదహారవ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రష్యా వెళ్లారు. పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ సమావేశమై చర్చలు జరిపారు.ఈ పర్యటనలో చైనా అధ్యకక్షుడు జిన్‌పింగ్‌తోనూ ప్రధాని సమావేశమవనున్నారు. 22,23 తేదీల్లో జరిగే బబ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకుగాను ప్రధాని మంగళవారం రష్యాలోని కజన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘనస్వాగతం లభించింంది. కాగా, మూడు నెలల వ్యవధిలో ప్రధాని రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఇదీ చదవండి: బ్రిక్స్ సదస్సు.. రష్యాలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం -
పెట్టుబడులకు భారత్ బెస్ట్..!
బ్రెజిలియా: పెట్టుబడులు పెట్టేందుకు భారత్.. ప్రపంచంలోనే అత్యంత అనువైన దేశమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాజకీయ స్థిరత్వం, వ్యాపారాలకు అనువైన సంస్కరణలు ఇందుకు తోడ్పడుతున్నాయని చెప్పారు. ‘2024 నాటికి భారత్ అయిదు లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని లకి‡్ష్యంచుకుంది. ఇందులో భాగంగా ఇన్ఫ్రా రంగానికే 1.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు కావాలి. అందుకని భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి. అపరిమిత అవకాశాలు అందిపుచ్చుకోండి’ అని కార్పొరేట్లను ఆయన ఆహ్వానించారు. బ్రిక్స్ కూటమి బిజినెస్ ఫోరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. అయిదు సభ్య దేశాల బ్రిక్స్ కూటమి మాత్రం ఆర్థిక వృద్ధికి సారథ్యం వహిస్తోందని ఆయన చెప్పారు. ‘ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 50% బ్రిక్స్ దేశాలదే. అంత ర్జాతీయంగా మందగమనం ఉన్నా బ్రిక్స్ దేశాలు వృద్ధి నమోదు చేయడంతో పాటు కోట్ల మందిని పేదరికం నుంచి బైటికి తెచ్చాయి. కొంగొత్త సాంకేతిక ఆవిష్కరణలు చేశాయి’ అని మోదీ చెప్పారు. బ్రెజిల్, భారత్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా కలిసి బ్రిక్స్ కూటమిని ఏర్పాటు చేశాయి. భవిష్యత్ ప్రణాళిక అవసరం... బ్రిక్స్ కూటమి ఏర్పాటై పదేళ్లయిన నేపథ్యంలో భవిష్యత్తు కోసం సరికొత్త ప్రణాళికలను రూపొందించుకోవాలని మోదీ సూచించారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరిగేలా వ్యాపార నిబంధనలు సరళతరం కావాలన్నారు. సభ్య దేశాలు కలిసి పనిచేసేందుకు వీలున్న రంగాలు గుర్తించాలని, పరస్పరం సహకరించుకుని ఎదగాలని ప్రధాని సూచించారు. ‘ఒక దేశానికి టెక్నా లజీ ఉండొచ్చు. మరో దేశం ముడివనరులు సరఫరా చేస్తుండవచ్చు. ఎలక్ట్రిక్ వాహనా లు, డిజిటల్ టెక్నాలజీ, ఎరువులు, వ్యవసాయోత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్.. పరస్పరం సహకరించుకునేందుకు ఇలాంటి అనువైన రంగాలెన్నో ఉన్నాయి. వచ్చే బ్రిక్స్ సదస్సు నాటికి ఇలాంటివి కనీసం 5 రంగాలైనా గు ర్తించి, జాయింట్ వెంచర్స్‌కి అవకాశాలను అధ్యయనం చేయాలి’ అని చెప్పారు. -
ఉగ్రవాదంపై కఠిన చర్యలు
ఒసాకా: ఉగ్రవాద ముఠాలకు ఆర్థిక సాయం అందకుండా చూడటంతోపాటు, తమ భూభాగాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రపంచ దేశాలన్నీ కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలు శుక్రవారం కోరాయి. ఉగ్రవాదంపై తాము పోరాడతామనీ, అక్రమ నిధుల ప్రవాహాన్ని అడ్డుకుంటామని ఆ ఐదు దేశాలు ప్రతినబూనాయి. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ–20 దేశాల సదస్సు కోసం అక్కడకు వచ్చిన బ్రిక్స్ దేశాధినేతలు ప్రత్యేకంగా ఓ అనధికారిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల అధ్యక్షులు వరుసగా షీ జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్, సిరిల్ రమఫోసా, జాయిర్ బోల్సొనారోలు ఆ భేటీలో పాల్గొన్నారు. నల్లధనం, అవినీతి, అక్రమ ఆర్థిక నిధుల ప్రవాహంపై కూడా కలిసికట్టుగా, ఒకరికొకరు సహకరించుకుంటూ పోరాడాలని ఐదు దేశాల అధినేతలు నిర్ణయించారు. ఆర్థిక వ్యవస్థలకూ నష్టమే: మోదీ మానవాళికి ఉగ్రవాదమే అతిపెద్ద ముప్పు అని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఒసాకాలో జరిగిన బ్రిక్స్ దేశాధినేతల భేటీలో అన్నారు. ఉగ్రవాదం అనే భయంకర భావజాలం వల్ల అమాయకుల ప్రాణాలు పోవడమే కాకుండా దేశాల ఆర్థికాభివృద్ధి, సామాజిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)ను తక్షణం బలోపేతం చేయడం, రక్షణాత్మక వర్తక విధానాలను గట్టిగా వ్యతిరేకించడం, అందరికీ ఇంధన భద్రత కల్పించడం, ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవడం అనేవి ప్రపంచ దేశాల తక్షణ కర్తవ్యాలని మోదీ పేర్కొన్నారు. పుతిన్, జిన్‌పింగ్‌లతో త్రైపాక్షిక భేటీ ఒసాకాలోనే పుతిన్, జిన్‌పింగ్‌లతో కలిసి మోదీ ప్రత్యేకంగా ఆర్ఐసీ (రష్యా, ఇండియా, చైనా) సమావేశంలోనూ పాల్గొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు సహా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. ‘ప్రపంచపు ఆర్థిక, రాజకీ, భద్రత పరిస్థితులపై మనం చర్చించడం ముఖ్యం’ అని మోదీ పేర్కొన్నారు. -
ఆర్థిక నేరగాళ్లకు ఆశ్రయమొద్దు
బ్యూనోస్ ఎయిర్స్: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల కేసుల్లో జీ–20 (గ్రూప్ ఆఫ్ 20) దేశాల మధ్య బలమైన, చురుకైన సహకారం ఉండాలని భారత్ కోరింది. దీనికి సంబంధించి 9 అంశాలతో కూడిన ఎజెండాను ప్రధాని మోదీ శుక్రవారం జీ–20 సదస్సులో ప్రవేశపెట్టారు. రెండ్రోజుల జీ–20 సదస్సు అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్లో జరుగుతుండటం తెలిసిందే. విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను త్వరగా స్వదేశాలకు అప్పగించడం, ఇతర న్యాయపరమైన విషయాల్లో జీ–20 సభ్యదేశాల మధ్య సహకారం ఉండాలని ఈ ఎజెండాలో భారత్ పేర్కొంది. స్వదేశాల్లో భారీ ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు ఇతర దేశాల్లో నివసించేందుకు ఆయా దేశాలు అనుమతి ఇవ్వకుండా చూసేలా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలంది. వివిధ దేశాల ఆర్థిక నిఘా వ్యవస్థలు, దర్యాప్తు సంస్థల మధ్య అత్యంత వేగంగా సమాచార మార్పిడి కోసం ఆర్థిక కార్యాచరణ దళం (ఎఫ్ఏటీఎఫ్)ను సహాయం తీసుకోవాలని సూచించింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను గుర్తించేందుకు, న్యాయప్రక్రియను పూర్తి చేసేందుకు, ఇతర దేశాలకు అప్పగించేందుకు ఓ నిర్దిష్టమైన ఉమ్మడి ప్రణాళిను ఎఫ్ఏటీఎఫ్ రూపొందించాలని కూడా భారత్ కోరింది. ఇతర దేశాలకు పారిపోయిన నేరగాళ్ల ఆస్తులు ఏ దేశంలో ఉన్నా వాటిని స్వాధీనం చేసుకునేలా ఓ వ్యవస్థ ఉండాలని కూడా భారత్ అభిప్రాయపడింది. హవాలా, ఉగ్రవాద సంస్థలకు నిధులు తదితర ఆర్థిక నేరాల కేసుల పరిష్కారం కోసం ఎఫ్ఏటీఎఫ్ అంతర్జాతీయ సంస్థను ఏర్పాటుచేశారు. 12 ఏళ్ల తర్వాత తొలిసారి రష్యా, భారత్, చైనాల మధ్య 12 ఏళ్లలో తొలి, మొత్తంగా రెండో త్రైపాక్షిక సమావేశం శుక్రవారం జరిగింది. మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతోనూ భేటీ అయ్యారు. ఐరాస, ప్రపంచ వాణిజ్య సంస్థసహా పలు బహుళపక్ష సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. వివిధ రంగాల్లో మూడు దేశాల మధ్య సహకారంపై వారు చర్చించారు. అంతర్జాతీయ వేదికలపై పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై పుతిన్, మోదీ, జిన్‌పింగ్‌లు చర్చించారని భారత విదేశాంగ శాఖ ఓ ప్రనకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక పరిపాలనను సరైన దిశలో నడిపించేందుకు, ప్రాంతీయంగా శాంతిని పరిరక్షించేందుకు కలిసి పనిచేయాలని మూడు దేశాలు నిర్ణయించాయి. ‘వుహన్’ తర్వాత పురోగతి జిన్‌పింగ్‌తో ఈ ఏడాది ఏప్రిల్‌లో మోదీ చైనాలోని వుహన్ నగరంలో అనధికారిక భేటీలో పాల్గొనడం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాల్లో మంచి పురోగతి నమోదవుతోందని ఇరుదేశాధినేతలు తెలిపారు. వుహన్ భేటీ తర్వాత సంబంధాలు బాగున్నాయనీ, 2019లో మరింత బలపడే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వీరు కలవడం ఇది నాలుగోసారి. అంతకుముందు ఎస్సీవో సదస్సు కోసం చైనాలోని చింగ్డావ్లో, బ్రిక్స్ సదస్సు సమయంలో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో వీరిద్దరూ కలిశారు. వచ్చే ఏడాది భారత్‌కు రావాల్సిందిగా జిన్‌పింగ్‌ను మోదీ తాజాగా ఆహ్వానించారు. ఇలా తరచూ కలుస్తూ ఉండటం వల్ల సంబంధాలు చెడిపోకుండా ఉంటాయని ఆయన తెలిపారు. -
డిజిటల్‌తో అవకాశాల వెల్లువ
జోహన్నెస్‌బర్గ్: డిజిటల్ విప్లవంతో బ్రిక్స్, ఇతర వర్థమాన దేశాలకు కొత్త అవకాశాలు వెల్లువెత్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కృత్రిమ మేథ, బిగ్‌డేటా అనలిటిక్స్ వల్ల వచ్చే మార్పుకు ఈ దేశాలు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు చివరి రోజు శుక్రవారం నిర్వహించిన ‘ఔట్రీచ్ సెషన్’లో మోదీ ప్రసంగించారు. డిజిటల్ మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధికి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. ఆఫ్రికా దేశాలతో భారత్‌కున్న చారిత్రక, లోతైన సంబంధాలను ప్రస్తావించారు. ‘డిజిటల్ విప్లవం వల్ల ఈ రోజు మనం మరో చారిత్రక సందర్భానికి చేరువలో ఉన్నాం. కొత్త అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కృత్రిమ మేథ, బిగ్‌డేటా అనలిటిక్స్ తీసుకొచ్చే మార్పుకు పూర్తిగా సంసిద్ధం కావాలి. ఆఫ్రికాలో అభివృద్ధి, శాంతి స్థాపనకు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. భారత్–ఆఫ్రికా దేశాల మధ్య ఆర్థిక, అభివృద్ధి సహకారం కొత్త శిఖరాలను తాకింది. గత నాలుగేళ్లలో ఇరు వర్గాల మధ్య దేశాధినేతలు, ఉన్నతాధికారుల స్థాయిలో 100కు పైగా ద్వైపాక్షిక చర్చలు, పర్యటనలు జరిగాయి. 40 ఆఫ్రికా దేశాలకు సుమారు రూ.75 వేల కోట్లకు పైగా రుణ సాయం కల్పించాం. ఆఫ్రికా ప్రాంతీయ ఆర్థిక కూటమికి జరుగుతున్న ప్రయత్నాలను భారత్ స్వాగతిస్తోంది. స్వేచ్ఛా వాణిజ్యం వల్ల గత మూడు దశాబ్దాల్లో లక్షలాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచీకరణ ఫలాలను వారికి చేరువచేయడం చాలా ముఖ్యం. 2008 నాటి ఆర్థిక సంక్షోభం తరువాత ప్రపంచీకరణకు రక్షణాత్మక వాణిజ్య విధానాలు సవాలుగా మారాయి’ అని మోదీ అన్నారు. ఆఫ్రికా దేశాలతో సంబంధాల బలోపేతానికి ఉగాండా పార్లమెంట్లో ప్రతిపాదించిన 10 మార్గదర్శక సూత్రాలను మరోసారి ప్రస్తావించారు. మూడు ఆఫ్రికా దేశాల పర్యటన, బ్రిక్స్ సదస్సు ముగించుకుని మోదీ శుక్రవారం సాయంత్రం భారత్ తిరుగు పయనమయ్యారు. పుతిన్‌తో మోదీ భేటీ.. జోహన్నెస్‌బర్గ్‌లో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘పుతిన్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయి. రష్యా–భారత్‌ల స్నేహం దృఢమైనది. భిన్న రంగాల్లో సహకారం, కలసిపనిచేయడాన్ని రెండు దేశాలు కొనసాగిస్తాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, పర్యాటకం తదితరాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు, టర్కీ, అంగోలా, అర్జెంటీనా అధ్యక్షులతోనూ మోదీ వేర్వేరుగా సమావేశమై చర్చలు జరిపారు. గోల్డ్ మైనింగ్‌కు ‘బ్రిక్స్’ ప్రశంస.. రష్యాలోని సైబీరియాలో భారత్ నేతృత్వంలో ప్రారంభంకానున్న బంగారం తవ్వకాల ప్రాజెక్టును బ్రిక్స్ కూటమి ప్రశంసించింది. çక్లుచెవెస్కోయె గోల్డ్ మైనింగ్ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టులో భారత్‌కు చెందిన సన్ గోల్డ్ లిమిటెడ్‌దే కీలక పాత్ర. చైనా నేషనల్ గోల్డ్ గ్రూప్ కార్పొరేషన్, రష్యా సావెరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఫార్ ఈస్ట్ అండ్ బైకాల్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్లతో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఇందులో భాగస్వామ్యం కల్పించారు. ఈ గనుల నుంచి ఏటా 6.5 టన్నుల బంగారాన్ని వెలికితీసేలా ప్రణాళికలు రచించారు. ఉత్పాదకత ప్రారంభించడానికి ముందు సుమారు రూ.34 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. అతిపెద్ద పెట్టుబడి, సాంకేతిక భాగస్వామి చైనా కంపెనీ కాగా, రష్యాలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సన్ గోల్డ్ లిమిటెడ్ అనుభవం ఈ ప్రాజెక్టుకు కీలకం కానుంది. -
సుదృఢ బంధానికి 10 సూత్రాలు
న్యూఢిల్లీ: భారత్, ఆఫ్రికా దేశాల బంధం బలోపేతం కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ 10 మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. ఆఫ్రికా ఆర్థికాభివృద్ధికి, పర్యావరణ సవాళ్లు, ఉగ్ర ముప్పు ఎదుర్కొనేందుకు ఇవి దోహదపడతాయన్నారు. రక్షణ, పర్యావరణం, సైబర్ భద్రత, వ్యవసాయం, సముద్ర వనరుల సద్వినియోగం తదితరాలకు సంబంధించి ఈ సూత్రాలను వివరించారు. అంతర్జాతీయ సంస్థల్లో ఆఫ్రికా దేశాలకు సమాన ప్రాధాన్యత లభించేంత వరకూ, అందులో సంస్కరణల కోసం భారత్ చేస్తున్న కృషి సంపూర్ణం కాదని తెలిపారు. ఉగాండా పర్యటనలో ఉన్న మోదీ బుధవారం ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిం చారు. సమానత్వం, గౌరవం, పారదర్శకత కోసం ఆఫ్రికా చేస్తున్న ప్రయత్నాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోసారి ఆఫ్రికా వైరి రాజకీయాలకు వేదిక కాకుండా, యువత ఆకాంక్షలు నెరవేర్చే ప్రాంతంగా భాసిల్లాలని వ్యాఖ్యానించారు. మిగతా ప్రపంచంతో కలసి ఆఫ్రికా దేశాలు ముందుకు సాగాలని, భారత్ వాటితో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. అపారమైన ఖనిజ వనరులు, వార సత్వ సంపదకు నిలయమైన ఉగాండాకు తమ ఆఫ్రికా విధానంలో కేంద్రక స్థానం ఉంటుంద ని చెప్పారు. వలస పాలన, స్వాతంత్య్ర ఉద్యమం, తీరప్రాంత సంబంధాలు తదితరాల్లో రెండు దేశాలకు చాలా సారూప్యతలు ఉన్నా యని చెప్పారు. సముద్ర సంపద నుంచి అన్ని దేశాలు ప్రయోజనం పొందేలా, భారత్ ఆఫ్రికా దేశాలతో కలసిపనిచేస్తుందని మోదీ అన్నారు. తూర్పు ఆఫ్రికా, తూర్పు హిందూ మహాసముద్రాల్లో సహకారం తప్ప పోటీ ఉండొద్ద న్నారు. ఉగాండా పార్లమెంట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. రాజధాని కంపాలాకు 85 కి.మీ దూరంలోని జింజా అనే గ్రామంలో జాతిపిత గాంధీ జ్ఞాపకార్థం వారసత్వ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. కాగా, బ్రిక్స్ సదస్సులో పాల్గొనేం దుకు మోదీ దక్షిణాఫ్రికా చేరుకున్నారు. -
రువాండాకు మోదీ బహుమతి
కిగాలి: రువాండా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మంగళవారం రువేరు అనే గ్రామంలో జరిగిన కార్యక్రమంలో నిరుపేదలకు 200 ఆవులను కానుకగా ఇచ్చారు. పేదరికం, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు కుటుంబానికొక ఆవును పంపిణీచేయడం 2006 నుంచి అక్కడ సంప్రదాయంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ‘గిరింకా’ అని పిలుస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాల రీత్యా రువాండాలోని మారుమూల గ్రామంలో ఆవులకు ఇస్తున్న ప్రాధాన్యం భారతీయులను సంతోషానికి గురిచేస్తుందని మోదీ అన్నారు. గిరింకా గ్రామాల్లో గొప్ప మార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. తేనెటీగల పెంపకంపై కూడా దృష్టిపెట్టాలని రువాండా ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఆఫ్రికా తాళంచెవి రువాండా.. మోదీ రువాండాలో ప్రవాసులతో మాట్లాడుతూ.. ప్రపంచం దృష్టి ఆఫ్రికాపై పడకముందే, భారతీయులు అక్కడికి వెళ్లడానికి ప్రాధాన్యమిచ్చారని అన్నారు. ప్రవాస భారతీయులు ఎక్కడున్నా తమ ప్రత్యేకతను చాటుకుంటూ దేశాన్ని గర్వపడేలా చేస్తున్నారని కితాబిచ్చారు. అంతకుముందు, ఆ దేశాధ్యక్షుడు కగామేతో విస్తృతస్థాయి చర్చలు జరిపారు. వ్యవసాయం, రక్షణ, వాణిజ్యం, ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల బలోపేతం తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వాణిజ్యవేత్తల సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ఆఫ్రికాకు దారితీసే అన్ని ప్రవేశద్వారాల తాళంచెవి రువాండా వద్దే ఉందని అన్నారు. ఆ దేశ అభివృద్ధికి భారత్ సహకారం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. రెండు దేశాల వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. భారత్‌లో అమలుచేస్తున్న ‘మేకిన్ ఇండియా’లో రువాండా కూడా భాగమైతే, రెండు దేశాల మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని అన్నారు. తర్వాత మోదీ రువాండా పర్యటనను ముగించుకొని ఉగాండా చేరుకున్నారు. ఉగాండాకు రూ.1377 కోట్ల రుణం... కంపాలా: ఉగాండాకు భారత్ రూ.1377 కోట్ల రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ నిధులను ఇంధన మౌలిక వసతులు, వ్యవసాయం, పాడి రంగాల అభివృద్ధికి వెచ్చించనున్నారు. ఉగాండాలో ప్రధాని మోదీ ఆ దేశాధ్యక్షుడు యువేరి ముసెవేనితో సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. రక్షణ సహకారం, దౌత్యవేత్తలు, ఇతర అధికారులకు వీసా మినహాయింపు, సాంస్కృతిక మార్పిడి, మెటీరియల్ టెస్టింగ్ లేబొరేటరీలపై 4 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నేటి నుంచి బ్రిక్స్ సదస్సు దక్షిణాఫ్రికాలో మూడు రోజులపాటు.. జోహన్నెస్‌బర్గ్: అమెరికా వైఖరి కారణంగా ఏర్పడుతున్న అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ వాతావారణంపై చర్చించడమే ప్రధాన ఎజెండాగా మూడు రోజుల బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) సదస్సు బుధవారం నుంచి ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్ పదవ సదస్సుకు ఆ దేశాధ్యక్షుడు సిరిల్ రమఫోసాతోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా, చైనాల అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, షీ జిన్‌పింగ్‌లతోపాటు సభ్యదేశాల ఉన్నత స్థాయి అధికార బృందాలు హాజరు కానున్నాయి. చైనా నుంచి వస్తువుల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను పెంచడం, చైనా కూడా అందుకు దీటుగా స్పందించడం తెలిసిందే. యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు, కెనడా, మెక్సికో నుంచి ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై కూడా ట్రంప్ సుంకాలను పెంచి అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ కొత్త పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత బ్రిక్స్ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకున్న ఆయన మంగళవారం ప్రిటోరియాలో రమఫోసాను కలిసి పలు విషయాలను చర్చించారు. చైనా, అమెరికాల వాణిజ్య యుద్ధంపైనే ఈ సమావేశంలో ఎక్కువగా చర్చించే అవకాశం ఉందని రష్యా ఆర్థిక మంత్రి తెలిపారు. భారత్‌లో సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్తాన్ ప్రోత్సహిస్తుండటాన్ని మోదీ ప్రస్తావించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కొన్ని ఆసక్తికర అంశాలు.. ♦ బ్రిక్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) అనే పదాన్ని 2001లో బ్రిటన్ ఆర్థికవేత్త జిమ్ ఓనీల్ తొలిసారి వాడారు. ♦ మొదటి బ్రిక్ సమావేశం రష్యాలోని యెకటెరిన్‌బర్గ్‌లో 2009లో జరిగింది. ♦ 2010లో ఈ కూటమిలో దక్షిణాఫ్రికా చేరడంతో దీని పేరు బ్రిక్స్‌గా మారింది. ♦ మన దేశంలో బ్రిక్స్ సదస్సులు 2012లో ఢిల్లీలో, 2016లో గోవాలో జరిగాయి. ♦ ప్రపంచంలోని మొత్తం జనాభాలో 40% మంది బ్రిక్స్ దేశాల్లోనే నివసిస్తున్నారు. -
బ్రిక్స్ సదస్సుకు మోదీ
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది జరగబోయే 10వ బ్రిక్స్ సదస్సుకు ప్రధాని∙మోదీ హాజరుకానున్నారు. జూలై 25 నుంచి 27 వరకు జరగబోయే బ్రిక్స్ సదస్సులో ఈసారి అంతర్జాతీయ శాంతి, రక్షణ అంశాలపై చర్చ జరిగే వీలుంది. అంతకుముందు రువాండా, ఉగాండాలో పర్యటించనున్నారు. జూలై 23 నుంచి 27 వరకు మోదీ మూడు దేశాల్లో పర్యటిస్తారు. మొదట రువాండాలో రెండ్రోజుల పాటు పర్యటిస్తారు. తర్వాత జూలై 24న ఉగాండాకు బయల్దేరి వెళ్లి, అక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్తారు. అక్కడి జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్ సదస్సులో అంతర్జాతీయ శాంతి, రక్షణ, అంతర్జాతీయ పరిపాలన, వాణిజ్య సంబంధ సమస్యలపై సభ్య దేశాల నేతలు చర్చిస్తారు. సదస్సు సందర్భంగా పలువురు దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కాగా, బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ కానున్నట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇరువురు నేతలు వాణిజ్యంలో అమెరికా వైఖరి సహా ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను చర్చిస్తారు. -
బ్రిక్స్ దేశాలకూ రేటింగ్ ఏజెన్సీ!
►మూడీస్ కాదిక... మోడీస్!! ► వర్ధమాన దేశాల ఆర్థిక అవసరాలకు తోడ్పాటు ► అమెరికన్ ఏజెన్సీల ఆధిపత్యానికి చెక్ ► బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ ప్రతిపాదన జియామెన్: ఇప్పటిదాకా క్రెడిట్ రేటింగ్ విభాగంలో ఆధిపత్యం చలాయిస్తున్న పశ్చిమ దేశాల ఏజెన్సీలకు చెక్ చెప్పే దిశగా వర్ధమాన దేశాలు తమ కోసం ప్రత్యేకంగా రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వర్ధమాన దేశాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు, ఇతర కార్పొరేట్ల ఆర్థిక అవసరాల కోసం బ్రిక్స్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ తోడ్పడగలదని ఆయన చెప్పారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, సౌతాఫ్రికా) కూటమి 9వ సదస్సు ప్లీనరీ సెషన్లో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ సూచన చేశారు. బ్రిక్స్ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తే కూటమిలో సభ్యత్వం ఉన్న దేశాలతో పాటు ఇతర వర్ధమాన దేశాలకూ లాభం ఉంటుందని చెప్పారాయన. ‘‘దీని గురించి గత ఏడాది కూడా చర్చించాం. సాధ్యాసాధ్యాలను ఒక నిపుణుల బృందం అధ్యయనం చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఇందుకు సంబంధించిన మార్గదర్శ ప్రణాళిక సిద్ధం చేయాలని కోరుకుంటున్నాను‘ అని ఆయన తెలిపారు. అలాగే ఆర్థిక రంగంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం మరింతగా పెరగాలని మోదీ పేర్కొన్నారు. ఇందులో కేంద్రీయ బ్యాంకులు కీలకపాత్ర పోషించాలని సూచించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా సీఆర్ఏ (క్రెడిట్ రేటింగ్) మార్కెట్లో ఎస్అండ్పీ, మూడీస్, ఫిచ్ వంటి సంస్థల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ మూడు సంస్థలూ అమెరికాకు చెందినవే కావటం గమనార్హం. సావరిన్ క్రెడిట్ రేటింగ్స్ మార్కెట్లో ఈ మూడు సంస్థలకూ ప్రస్తుతం 90 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలోనే గతేడాది గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో వర్ధమాన దేశాలు రేటింగ్స్ పరంగా ఎదుర్కొంటున్న సవాళ్లను భారత్ ముందుకు తెచ్చింది. ప్రత్యామ్నాయ ఏజెన్సీ ఏర్పాటు అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. టెక్నాలజీతో అవినీతి, పేదరిక నిర్మూలన... పేదరికం, అవినీతి నిర్మూలనకు టెక్నాలజీ, డిజిటల్ వనరులు అత్యంత శక్తిమంతమైన సాధనాలని నరేంద్ర మోదీ చెప్పారు. భారత ప్రభుత్వం వీటి ఊతంతో నల్లధనం, అవినీతిపై మరింత బలంగా పోరు సాగిస్తోందని ఆయన తెలిపారు. కొంగొత్త ఆవిష్కరణలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థల రూపకల్పనలో బ్రిక్స్ దేశాలన్నీ భాగస్వాములైతే వృద్ధికి ఊతం లభిస్తుందని, పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు నిలకడగా అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చని ప్రధాని తెలిపారు. పన్ను ఎగవేతలు అరికట్టేందుకు సమాచార మార్పిడి .. పన్ను ఎగవేతల సమస్యను అరికట్టే దిశగా పన్నులపరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, ఇతర వర్ధమాన దేశాలకూ కావాల్సిన సాంకేతిక సహకారాన్ని అందించాలని బ్రిక్స్ కూటమి తీర్మానించింది. తద్వారా సహేతుకమైన, అధునాతనమైన అంతర్జాతీయ స్థాయి పన్ను వ్యవస్థ రూపకల్పనకు కృషి చేయాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. బ్రిక్స్ సదస్సు ప్లీనరీ సెషన్ ముగింపు సందర్భంగా ఈ మేరకు షియామెన్ తీర్మాన ప్రకటనను విడుదల చేశాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ (సీఆర్ఏ) మొదలైన వాటి ఏర్పాటు ఫలవంతం కావడంపై బ్రిక్స్ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ ఆర్థిక వేదికలపై అభివృద్ధి చెందుతున్న దేశాలు, వర్ధమాన దేశాల గళం వినిపిస్తామని పేర్కొన్నాయి. ‘అంతర్జాతీయ పన్ను నిబంధనల రూపకల్పనలో తన వంతుగా మరింత కీలకపాత్ర పోషించే క్రమంలో బ్రిక్స్ కూటమి దేశాలు పన్నులపరమైన అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుకుంటాయి. అలాగే ప్రాధాన్యతలను బట్టి.. ఇతర వర్ధమాన దేశాలకూ తగిన సాంకేతిక సహకారాన్ని అందిస్తాయి‘ అని తీర్మానంలో బ్రిక్స్ కూటమి పేర్కొంది. నాలుగు ఒప్పందాలు .. సదస్సు సందర్భంగా బ్రిక్స్ కూటమిలో భారత్ సహా అయిదు సభ్య దేశాలు.. నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్థిక, వాణిజ్య సహకారంపై బ్రిక్స్ కార్యాచరణ ప్రణాళిక, నవకల్పనల ఆవిష్కరణలో పరస్పర సహకారం (2017–2020), బ్రిక్స్ కస్టమ్స్ కోఆపరేషన్‌పై వ్యూహాత్మక విధానంపై ఒప్పందాలు ఇందులో ఉన్నాయి. అలాగే, వ్యూహాత్మక సహకారంపై బ్రిక్స్ వ్యాపార మండలి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. -
‘ఉగ్ర’సాయం ఆపాలి..!
తొలిసారి ఉగ్రవాదాన్ని డిక్లరేషన్‌లో చేర్చిన బ్రిక్స్ ► జైషే, లష్కరే సహా ఉగ్ర సంస్థల ప్రస్తావన ► పరోక్షంగా పాక్‌కు హెచ్చరిక.. భారత్‌కు భారీ దౌత్య విజయం ► ‘అజర్ నిషేధం’పై సమాధానం దాటవేసిన చైనా ► జీఎస్టీతో భారత్‌లో వ్యాపారానుకూలత: మోదీ జియామెన్: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై కొనసాగిస్తున్న పోరులో భారత్‌కు మరో భారీ దౌత్య విజయం దక్కింది. చైనాలోని జియామెన్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు డిక్లరేషన్‌లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సహా ఉగ్రసంస్థలపై బ్రిక్స్ సభ్యదేశాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. పాక్ పేరెత్తకుండానే.. శాంతికి విఘాతం కల్పిస్తున్న ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఉగ్రవాద సంస్థలపై సమైక్యంగా పోరాడాలని నిర్ణయించాయి. ప్రధాని నరేంద్ర మోదీతోపాటుగా చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల అధ్యక్షులు జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్, మైకెల్ టెమర్, జాకబ్ జుమాలు ఈ సదస్సులో పాల్గొన్నారు. బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదంపై చర్చ జరగటం ఇదే తొలిసారి కావటం విశేషం. బ్రిక్స్ సమావేశాల ముగింపు సందర్భంగా 43 పేజీల జియామెన్ డిక్లరేషన్‌ను సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. భద్రతామండలిలో సంస్కరణలపైనా సదస్సులో చర్చించారు. అటు, భారత చరిత్రలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్టీ ద్వారా పారదర్శకంగా వ్యాపారం చేసుకునేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని బ్రిక్స్ బిజెనెస్ కౌన్సిల్ భేటీలో మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై ఆందోళన బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదం అంశాన్ని మోదీ లెవనెత్తారు. దీనికి ఇతర నేతల నుంచి మద్దతు లభించింది. ఉగ్రవాదంపై పోరాటం విషయంలో వారు కూడా మోదీ ప్రతిపాదనను సమర్థించారు. ఆసియా ప్రాంతంలో హింసకు పాల్పడుతున్న తాలిబాన్, ఐసిస్, అల్‌కాయిదాతోపాటుగా హక్కానీ నెట్వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్, ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూమెంట్ (ఈటీఐఎమ్), ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, తెహ్రికే తాలిబాన్, హిజ్బుత్ తహ్రీర్ వంటి సంస్థలు శాంతికి విఘాతం కల్పించటంపై బ్రిక్స్ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. తూర్పు తుర్కిస్తాన్ ఏర్పాటుచేయాలంటూ చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సులో ఈటీఐఎమ్ చేస్తున్న విధ్వంసంపై ప్రత్యేకంగా చర్చించింది. ‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. ఉగ్రవాదులకు మద్దతు తెలిపే వారినే పూర్తిగా బాధ్యులు చేయాలని పునరుద్ఘాటిస్తున్నాం’ అని డిక్లరేషన్ పేర్కొంది. దేశాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించటం, ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవాలని కూడా బ్రిక్స్ సదస్సు నిర్ణయించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా.. దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ వారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండానే ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగా ముందుకెళ్లనున్నట్లు పేర్కొన్నాయి. తొలిసారి ‘ఉగ్ర’ చర్చ ‘ఉగ్రవాదుల నిమాయకం, ఉగ్ర కదలికలు, విదేశీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించటం, డ్రగ్స్ అక్రమ రవాణాతోపాటుగా ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరా, ఆర్థిక సాయాన్ని అడ్డుకోవటం, ఉగ్ర కేంద్రాలను ధ్వంసం చేయటం, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్టవేయటం ద్వారా ఉగ్రవాదంపై పోరాటం చేయాలి’ అని డిక్లరేషన్ స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై భద్రతామండలి తీర్మానాలు, ఎఫ్ఏటీఎఫ్ అంతర్జాతీయ ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని అభిప్రాయపడింది. గతేడాది ఉడీ ఘటన జరిగిన కొద్ది రోజులకే గోవా బ్రిక్స్ సదస్సులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని డిక్లరేషన్‌లో చేర్చేందుకు చైనా అడ్డుపడిన సంగతి తెలిసిందే. కాగా, లష్కరే, జైషే సంస్థలపై తీవ్ర పదజాలంతో డిక్లరేషన్‌లో మండిపడ్డ నేపథ్యంలో జైషే చీఫ్ మసూద్ అజర్‌పై నిషేధంపై చైనా సమాధానాన్ని దాటవేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం నిర్ణయానికి ఎప్పటిలాగానే కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. కాగా, తొలిసారిగా బ్రిక్స్‌లో ఉగ్రవాదంపై చర్చ జరిగిందని.. భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం విషయంలో చైనా ధోరణిలో స్వల్ప మార్పు కనిపించిందని పేర్కొంది. సౌరశక్తి వినియోగాన్ని పెంచే ఎజెండాతో అంతర్జాతీయ సౌరకూటమి (ఐఎస్ఏ)ని మరింత బలోపేతం చేసే విషయంలో బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకోసం వినియోగించుకునేలా బ్రిక్స్ దేశాలు కలసి పనిచేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. సాంప్రదాయ వైద్యాన్ని ఇచ్చిపుచ్చుకోవటంలో దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేయాలని కూడా సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎబోలా, హెచ్ఐవీ, క్షయ, మలేరియాతోపాటుగా ఇతర వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యల్లో సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించింది. ఉత్తరకొరియా అణుపరీక్షలపైనా బ్రిక్స్ కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ ఓపెన్ ఎకానమీ: మోదీ ప్రపంచంలోని ఓపెన్ ఎకానమీల్లో ఒకటిగా భారత్ వేగంగా పరిణామం చెందుతోందని ప్రధాని మోదీ తెలిపారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా బిజినెస్ కౌన్సిల్‌తో సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. భారత చరిత్రలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ ద్వారా దేశమంతా ఒకే మార్కెట్‌గా మారిందని వెల్లడించారు. చెల్లింపులు, లావాదేవీలను డిజిటల్ రూపంలోకి మార్చేలా ప్రోత్సహిస్తున్న కార్యక్రమాల ద్వారా స్టార్టప్‌లు స్థానికంగా తయారీని ప్రారంభించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. ‘నేటి ప్రపంచంలో అతివేగంగా ఓపెన్ ఎకానమీగా భారత్ పరిణామం చెందుతోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తొలిసారిగా 40 శాతానికి చేరాయి. 2016–17లో రూ.3.86 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి’ అని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు వ్యాపారానుకూల సూచీలో భారత్ స్థానం గణనీయంగా మెరుగుపడిందన్నారు. ‘డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు జ్ఞానం ఆధారిత, నైపుణ్యం, సాంకేతికతతో కూడిన సమాజంగా భారత్ మారేందుకు దోహదపడుతున్నాయి’ అని ప్రధాని పేర్కొన్నారు. వాణిజ్యాన్ని పెంచుకోవటం, పెట్టుబడుల్లో సహకారం వంటి బ్రిక్స్ దేశాల ఉమ్మడి లక్ష్యాలను చేరుకోవటంలో బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ తోడ్పడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. పేదరిక నిర్మూలనతోపాటుగా వైద్యం, పారిశుద్ధ్యం నైపుణ్యం, ఆహార భద్రత, లింగ సమానత, విద్యుత్, విద్య రంగాలపై భారత్ మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని ప్రధాని వెల్లడించారు. నేడు మోదీ–జిన్‌పింగ్ భేటీ భారత్–చైనా దేశాల మధ్య ఇటీవల ఉద్రిక్తతకు కారణమైన డోక్లాం ఘటన తర్వాత ఇరుదేశాల అధినేతలు తొలిసారిగా సమావేశం కానున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని భారత విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. వీరి సమావేశంలో డోక్లాం సమస్యపై చర్చ జరగనుందని భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి విశ్వాసం పెరిగే దిశగా ఇద్దరు నేతలు చర్చిస్తారని తెలుస్తోంది. అయితే ఏయే అంశాలపై వీరిద్దరు మాట్లాడుకుంటారనే విషయాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. జూన్ 16న సిక్కిం సరిహద్దులో డోక్లాం వద్ద చైనా నిర్మించతలపెట్టిన రోడ్డు నిర్మాణ పనులను భారత్అడ్డుకోవటంతో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. కాగా, జిన్‌పింగ్‌తో సమావేశం అనంతరం.. ప్రధాని మోదీ మయన్మార్‌కు పయనమవుతారు. -
‘సరిహద్దు’కు శాంతియుత పరిష్కారం
► బ్రిక్స్ సదస్సులో జిన్‌పింగ్ ► మోదీతో చర్చలు ఆర్థిక, సామాజికంగా భారత్ ముందుకెళ్తోందని ప్రశంస హాంబర్గ్: బ్రిక్స్ దేశాల మధ్యనున్న ప్రాంతీ య అసమానతలు, వివాదాలను రాజకీయ, శాంతియుత పద్ధతిలో పరిష్కారం చేసుకోవా లని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. భారత్–చైనా దేశాల మధ్య సిక్కిం సరిహద్దు ఘర్షణ, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బ్రిక్స్ సదస్సులో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ సభ్యదేశాలు దృఢమైన బహుముఖ విధానాన్ని అవలంబించాలన్నారు. సహకారం, పరస్పర ప్రయోజనాల భద్రత, పరస్పర అనుసంధానతను పెంచుకునే విధంగా ముందుకెళ్లాలన్నారు. అటు జిన్‌పింగ్ కూడా భారత్‌ను ప్రశంసించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వ పోరాటాన్ని జిన్‌పింగ్ కొనియాడారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో భారత్ ముందడుగేస్తోందని.. భవిష్యత్తులో మరింత విజయం సాధించాలని ఆయన అభిలషించారు. అంతకుముందు మోదీ మాట్లాడుతూ.. చైనా నాయకత్వంలో బ్రిక్స్ దూసుకెళ్తోందని ప్రధాని కొనియాడారు. ‘జిన్‌పింగ్ నేతృత్వంలో బ్రిక్స్ పురోగతి సానుకూలంగా ఉంది. భవిష్యత్తులో మన సహకారం మరింత బలోపేతం అవుతుంది. సెప్టెంబర్‌లో చైనాలోని జియామెన్‌లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు మా పూర్తి సహకారం ఉంటుంది’ అని మోదీ స్పష్టం చేశారు. అనంతరం, మోదీ–జిన్‌పింగ్ విస్తృత అంశాలపై చర్చలు జరిపారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే వెల్లడించారు. అయితే ఏయే అంశాలపై చర్చించారనే విషయాన్ని మాత్రం బాగ్లే చెప్పలేదు. మోదీ–జిన్‌పింగ్ సమావేశం ఉండబోదంటూ చైనా విదేశాంగ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. -
మేమూ అప్పటి చైనా కాదు!
భౌగోళిక సార్వభౌమత్వ రక్షణకు దేనికైనా సిద్ధం ► భారత ఆర్మీ వెనక్కు వెళ్లిపోవాలి ► డోకా లా చైనా అంతర్భాగమే ► సిక్కిం సరిహద్దు వివాదంపై చైనా స్పందన ► 26న బ్రిక్స్ సదస్సుకు బీజింగ్ వెళ్లనున్న దోవల్ బీజింగ్/న్యూఢిల్లీ: భారత్ – చైనా మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సిక్కిం సరిహద్దుల్లో నెలరోజులుగా ఇరుదేశాల ఆర్మీ మధ్య ఘర్షణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పుడున్న భారత్ 1962నాటి భారత్ కాదన్న జైట్లీ ప్రకటనపై చైనా స్పందించింది. ‘జైట్లీ సరిగ్గానే చెప్పారు. 1962 కన్నా 2017నాటి భారతం భిన్నంగా ఉంది. ప్రస్తుత చైనా కూడా అప్పటి చైనా కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ సోమవారం హెచ్చరించారు. 1890 నాటి చైనా–బ్రిటిష్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత ఆర్మీ మోసం చేస్తోందని.. నిబంధనలకు విరుద్ధంగా తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చిందని ఆరోపించారు. వెంటనే భారత బలగాలను వెనక్కు తీసుకోవాలని లేని పక్షంలో భౌగోళిక సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు చైనా అన్ని అత్యవసర చర్యలు చేపడుతుందని పరోక్షంగా యుద్ధానికైనా సిద్ధమనే సంకేతాలిచ్చారు. సిక్కిం ప్రాంతంలో భారత్–చైనా దేశాల మధ్య సరిహద్దులు ముందుగా నిర్ణయించినట్లుగానే ఉన్నాయన్నారు. ‘మా భూభాగంలోకి ప్రవేశించటం, మా సైనికుల కార్యక్రమాలకు అడ్డుతగలటం ద్వారా అంతర్జాతీయ సరిహద్దు నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తోంది. సరిహద్దుల్లో శాంతికి ఆటంకం కలిగిస్తోంది. వెంటనే భారత ఆర్మీ వెనక్కు వెళ్లిపోవాలి’ అని గెంగ్ అన్నారు. దౌత్య చర్చలకు సిద్ధం ‘సిక్కింపై 1890 నాటి చైనా–బ్రిటిష్ ఒప్పందాన్ని తొలి భారత ప్రధాని నెహ్రూ 1959లో నాటి చైనా ప్రధాని చౌ ఎన్‌లైకి రాసిన లేఖలో ఆమోదించారు. తర్వాతి భారత ప్రధానులందరూ దీన్ని గౌరవిస్తూనే వచ్చారు. కానీ ఈ మధ్య సిక్కిం సరిహద్దుల్లో భారత్ తీసుకున్న చర్య మోసపూరితం. డోకా లా చైనాకు సంబంధించిన ప్రాంతం. అందుకే భారత్ వెనక్కు వెళ్లిపోవాలి’ అని గెంగ్ హెచ్చరిక స్వరంతో తెలిపారు. అయితే దౌత్యపరంగా ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. భూటాన్‌ను భారత్ రక్షణ కవచంలా వినియోగించుకుంటోందని గెంగ్ ఆరోపించారు. అవసరమైతే భూటాన్ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల (భారత్) జోక్యం లేకుండా ఉండేందుకు తాము పూర్తిగా సహకరిస్తామని గెంగ్ తెలిపారు. చైనాతో ఎటువంటి దౌత్యపరమైన సంబంధాల్లేని భూటాన్‌కు మిలటరీ పరంగా, దౌత్యపరంగా భారత్ రక్షణ పూర్తి మద్దతిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ టిబెట్ ప్రాంతమైన చుంబీ లోయపై ఆధిపత్యం ప్రదర్శించటం ద్వారా భారత–భూటాన్ సరిహద్దుల్లో జరిగే కార్యకలాపాలపై దృష్టిపెట్టాలని చైనా ప్రయత్నిస్తోందని రక్షణరంగ నిపుణులు భావిస్తున్నారు. నెలాఖర్లో బీజింగ్‌కు దోవల్ భారత్–చైనా సరిహద్దు చర్చల ప్రత్యేక ప్రతినిధి అయిన జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ జూలై 26న బ్రిక్స్ దేశాల ఎన్ఎస్ఏల సమావేశానికి హాజరుకానున్నారు. ఆ సమయంలోనే చైనా ఎన్ఎస్ఏ యాంగ్ జీచీతో సిక్కింపై చర్చించే అవకాశం ఉంది. చైనా సరిహద్దుల్లో ఉన్న సిక్కిం 1976లో భారత్‌లో అంతర్భాగమైంది. 1898లో చైనాతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం సిక్కిం సరిహద్దులను నిర్ణయించారు. సిక్కింలో చైనా రోడ్డు నిర్మాణాన్ని భారత్ అడ్డుకోవటం.. మోదీ అమెరికా పర్యటనలో ట్రంప్‌ను ఆకట్టుకునేందుకేనని చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.