brics plus
-
ఉమ్మడి భద్రత కోసం పనిచేయాలి: జిన్‌పింగ్
కజన్: గ్లోబల్ సౌత్ దేశాలు కలిసికట్టుగా ఆధునికత దిశగా ముందుకు సాగుతుండడం ప్రపంచ చరిత్రలో, మానవ నాగరికతలో అపూర్వమైన ఘట్టమని చైనా అధినేత జిన్‌పింగ్ ప్రశంసించారు. శాంతి, ఉమ్మడి భద్రత కోసం బ్రిక్స్ ప్లస్ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన బ్రిక్స్ ఔట్రీచ్ సదస్సులో ప్రసంగించారు. బ్రిక్స్‌ప్లస్ దేశాల శాంతి ప్రపంచ శాంతితో ముడిపడి ఉందన్నారు. ఉమ్మడి ప్రగతి కోసం ఆయా దేశాలన్నీ స్వయంగా చోదక శక్తిగా మారాలని సూచించారు. దేశాల మధ్య సమాచార మారి్పడి, సంప్రదింపులు మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ గ్లోబల్ సౌత్‌ను ఎప్పటికీ తమ గుండెల్లో నిలుపుకుంటామని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. తమ మూలాలను మర్చిపోవడం లేదన్నారు. ముగిసిన బ్రిక్స్ సదస్సు రష్యాలో మూడు రోజులపాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసింది. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలు కాగా, కొత్తగా ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా, యూఏఈ, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. కూటమిలో సభ్యత్వం కోసం తుర్కియే, అజర్బైజాన్, మలేసియా దరఖాస్తు చేసుకున్నాయి. మరికొన్ని దేశాలు సైతం బ్రిక్స్‌లో చేరడానికి ఆసక్తి ప్రదర్శించాయి. ముగింపు సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రసంగించారు. రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా సాగించిన ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. ప్రపంచంలో బ్రిక్స్ పాత్రను పశి్చమ దేశాలకు ప్రత్యామ్నాయంగా అభివరి్ణంచారు. -
'బ్రిక్స్ ప్లస్'కు చైనా ప్లాన్.. భారత్ ఆశలపై నీళ్లు!
ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్న చైనా కొత్త ప్రపోజల్‌ను తెచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి 'బ్రిక్స్ ప్లస్' కూటమిని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు చెప్పింది. ఇదే జరిగితే బ్రిక్స్ దేశాల్లో ఎక్కువ నష్టపోయేది భారతే. బ్రిక్స్‌ను బ్రిక్స్ ప్లస్‌గా మారిస్తే.. భారత్‌లో బ్రిక్స్ సాయంతో చేస్తున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రోత్సాహకాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా చైనా రాజకీయంగా ఎదగడానికి బ్రిక్స్ ప్లస్ దోహదపడుతుంది. తనకు ఆప్త మిత్రులుగా మారిన పాకిస్తాన్, శ్రీలంకలతో పాటు మెక్సికోను బ్రిక్స్ ప్లస్‌లోకి చైనా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా చైనా వేసిన ఈ స్కెచ్ భారత్‌కు ఆందోళన కలిగించేదే. 2016లో గోవాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని భారత్ చేసిన వ్యాఖ్యలను చైనా వ్యతిరేకించింది. బ్రిక్స్ ప్లస్ కూటమి ఏర్పాటైతే చైనా బలం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం బ్రిక్స్ బ్యాంకు(న్యూ డెవలప్మెంట్ బ్యాంకు) ద్వారా భారత్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం-చెన్నై పారిశ్రామికి కారిడార్‌కు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు రూ.3 వేల కోట్లకు పైగా ఆర్ధిక సాయం చేసింది. బ్రిక్స్ ప్లస్ కూటమి ఏర్పాటు ఆలోచనను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వార్షిక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బయటపెట్టారు. అభివృద్ధి చెందతున్న కొన్ని రాజ్యాలతో ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. దక్షిణాసియా ఉన్న స్నేహితులతో మరింత సంబంధాలను పెంచుకునేందుకు మరిన్ని దేశాలను బ్రిక్స్ ప్లస్‌లో చేర్చాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి చైనా అధ్యక్షత వహించనుంది. అయితే, బ్రిక్స్ ప్లస్ ఆలోచనకు భారత్ ఆమోదం ఇవ్వదనే ఆలోచనలో కూడా డ్రాగన్ దేశం ఉన్నట్లు తెలిసింది.