బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. ఇవాళ ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఇరువురు నేతలు ఐదేళ్ల తర్వాత తొలిసారిగా భేటీ కానుండటం గమనార్హం.
మరోవైపు.. ఇరుదేశాల మధ్య సరిహద్దు గస్తీకి సంబంధించి కీలక ఒప్పందం జరిగిన నేపథ్యంలో మోదీ, జిన్ పింగ్ మధ్య తాజాగా భేటీ జరగనుండటంపై ఆసక్తి నెలకొంది. గత నాలుగున్నరేళ్లుగా సరిహద్దుల్లో భారత్, చైనాల దేశాల మధ్య ఉద్రిక్తతలు, గల్వాన్ లోయలో ఇరు సైన్యాల మధ్య ఘర్షణతో తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.
అదీకాక నాలుగేళ్లుగా ఇరు దేశాల మధ్య నేరుగా విమాన రాకపోకలు కూడా సాగలేదు. ఇక.. గల్వాన్ ఘటన తర్వాత ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌లు 2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సుకు హాజరైన సమయంలో మొదటిసారి అక్కడ కలిశారు. అనంతరం ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్నారు. ఇక.. అప్పటినుంచి ప్రత్యకంగా ఇరు దేశాధినేతల మధ్య భేటీ జరగకపోవటం గమనార్హం.
16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మంగళవారం రష్యాలోని కజాన్ నగరం చేరుకున్నారు. గత మూడు నెలల్లో మోదీ రష్యా వెళ్లడం ఇది రెండోసారి. కజాన్ చేరిన కాసేపటికే ఆయన పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పలు అంశాలపై నేతలిద్దరూ లోతుగా చర్చించుకున్నారు.
చదవండి: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి...అన్నివిధాలా సహకరిస్తాం: మోదీ
Comments
Please login to add a commentAdd a comment