సాక్షి, ఢిల్లీ: ప్రధాని మోదీ రష్యా పర్యటన ముగిసింది. 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న ఆయన.. బుధవారం ఢిల్లీకి బయల్దేరారు. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా ఆయా దేశాధినేతలను కలుసుకున్నారు. వారితో చర్చలు జరిపారు. ప్రధాని మోదీ రష్యా పర్యటన విజయవంతంగా కొనసాగిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
బ్రిక్స్ సదస్సులో మోదీ ప్రసంగిస్తూ.. ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసి పోరాడాలని పిలుపు నిచ్చారు. బ్రిక్స్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించారంటూ పుతిన్‌పై ప్రశంసలు కురిపించారు. గ్లోబల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో సంస్కరణలు తీసుకురావాలన్నారు. బ్రిక్స్ దేశాలు లోకల్ కరెన్సీ ద్వారా వ్యాపారం చేసుకోవడాన్ని ప్రోత్సహించాలని కోరిన ప్రధాని మోదీ.. భవిష్యత్‌లో బ్రిక్స్ మరింత పటిష్టమైన వేదిక అవుతుందని ఆకాంక్షించారు. పర్యటన తొలి రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కాగా, రెండోరోజు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మోదీ, జిన్‌పింగ్ తొలిసారి భేటీ అయ్యారు.
ఇదీ చదవండి: రష్యాకు ‘కిమ్’ బలగాలు.. ‘సియోల్’ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment