Communist Party of China
-
అవినీతికి దూరంగా ఉండండి: జిన్‌పింగ్
బీజింగ్: అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలని అధికార కమ్యూనిస్టు పార్టీ అఫ్ చైనా నాయకులకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సూచించారు. కుటుంబ సభ్యులను, బంధువులను సైతం వాటికి దూరంగా ఉంచాలన్నారు. ఈ నెల 22న సీపీసీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుల భేటీలో జిన్‌పింగ్ ప్రసంగించారు. వ్యక్తిగతంగా క్రమశిక్షణ పాటించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు. అవినీతిపై మనం పోరాటం చేస్తున్నారని, ఈ విషయంలో పార్టీ నేతలంతా సహకరించాలని కోరారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మీ కింద పని చేసేవారు అవినీతి దూరంగా ఉండేలా కఠినమైన నిబంధనలు విధించాలని జిన్‌పింగ్ సూచించారు. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు నాయకుల అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతరులకు ప్రయోజనాలు కలి్పంచి, వారి నుంచి లంచాలు, బహుమతులు స్వీకరిస్తున్నట్లు కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకత్వంగుర్తించింది. కొందరిపై విచారణ సైతం ప్రారంభించింది. -
అదృశ్యం అంటే.. ఇక అంతే
బిలియనీర్ల దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు, క్రీడాకారుల దగ్గర్నుంచి నటీనటుల వరకు అదృశ్యం కావడం చైనాలో సర్వ సాధారణంగా మారింది. కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయిన తర్వాత ఏ అవినీతి ఆరోపణలో చిక్కుకోవడమో, జైలుకు వెళ్లడమో లేదంటే లో ప్రొఫైల్‌లో ఉండడమో జరుగుతోంది. ఇలా అదృశ్యమైన వారి జాబితా క్రమంగా పెరుగుతోంది. ఇన్నాళ్లూ విదేశాంగ మంత్రిగా పని చేసిన చిన్‌గాంగ్ తాజాగా ఆ జాబితాలో చేరారు. నెలరోజులుగా ఆయన కనబడకుండా పోయినా ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. ఆయన స్థానంలో వాంగ్ యీని విదేశాంగ మంత్రిగా నియమించింది. ఆ సమయంలోనూ చిన్‌గాంగ్ ఆచూకీపై మౌనం పాటించింది. చైనా ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారే ఇప్పటివరకు అదృశ్యమవుతూ వచ్చారు. కానీ చిన్‌గాంగ్‌ది దీనికి పూర్తిగా భిన్నం. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరుంది. రష్యా, వియత్నాం, శ్రీలంక నుంచి వచ్చిన అధికారులతో జూన్ 25న చివరిసారిగా ఆయన కనిపించారు. అప్పట్నుంచి ఎన్నో కీలకమైన సదస్సుల్ని చైనా వాయిదా వేసింది. కొన్ని సమావేశాలకు వాంగ్ యీ హాజరయ్యారు. చైనా సోషల్ మీడియాలో నెటిజన్లు చిన్‌గాంగ్ గురించి తెలుసుకోవాలని ప్రయతి్నంచినా ‘నో రిజల్ట్స్ అన్న సందేశమే వస్తోంది. హాంగ్‌కాంగ్‌కి చెందిన మహిళా జర్నలిస్టు ఫు షియోన్‌తో వివాహేతర సంబంధమే చిన్‌గాంగ్ అదృశ్యానికి కారణమని తెలుస్తోంది. ప్రపంచంలోని రాజకీయ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసే ఆమె 2022లో చిన్గాంగ్ను ఇంటర్వ్యూ చేశారు. అదే ఆమె చివరి ఇంటర్వ్యూ. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో ఇద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానాలున్నాయి. వివాహేతర సంబంధాలను చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనుమతించదు. ఈ వ్యవహారం కారణంగానే అధ్యక్షుడితో చిన్‌గాంగ్‌కు విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. చిన్‌గాంగ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కొన్నిసార్లు ప్రభుత్వం చెబుతున్నా నమ్మేట్టు లేదు. అదృశ్యమైన ప్రముఖులు వీరే హు జింటావో చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావోను అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గత ఏడాది అక్టోబర్‌లో చైనీస్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నుంచి బలవంతంగా స్టీవార్డ్స్ బయటకు తీసుకువెళ్లడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రెండు నెలల పాటు ఆయన కనిపించకుండా పోయారు. అనారోగ్య కారణాలతో ఆయన సమావేశం విడిచి వెళ్లారని ప్రభుత్వం అప్పట్లో వెల్లడించింది. రాజకీయ కారణాలతోనే అతన్ని సమావేశం నుంచి పంపేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్లో చైనా నాయకుడు జియాంగ్ జెమిన్ అంత్యక్రియల సమయంలో జింటావో కనిపించారు. జాక్ మా చైనాలో అత్యంత సంపన్నుడు, ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా 2020 చివర్లో కనిపించకుండా పోయారు. చైనా ప్రభుత్వ ఆర్థిక నియంత్రణలను విమర్శిస్తూ ప్రసంగించిన కొద్ది రోజుల్లోనే జాక్ మా అదృశ్యమయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే చైనా దర్యాప్తు సంస్థల నుంచి ఆయనకు సమన్లు అందాయి. ఆయన కొత్తగా పెట్టబోయే కంపెనీలకు అనుమతుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. జాక్ మా సంపదలో సగానికి సగం కోల్పోయినట్టు అంచనా. అప్పట్నుంచి ఆయన ఇప్పటివరకు బహిరంగంగా ఎవరికీ కనిపించలేదు. ప్రస్తుతం ఆయన టోక్యోలో ఉన్నారని తెలుస్తోంది. బావో ఫ్యాన్ చైనాకు చెందిన టెక్నాలజీ డీల్ మేకర్ బావో ఫ్యాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అదృశ్యమయ్యారు. చైనా రనెసాన్స్ హోల్డింగ్స్ అనే ప్రైవేటు బ్యాంకు వ్యవస్థాపకుడైన బావోను చైనా ప్రభుత్వ ఏజెన్సీల అధికారులు విచారిస్తున్నారంటూ ఆయన కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ దర్యా ప్తు సంస్థలు ఆయనని విచారిస్తున్నారో, కారణాలేంటో ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలీదు. గువో గ్వాంగ్‌చాంగ్ 2015లో అదృశ్యమైన అయిదుగురు ఎగ్జిక్యూటివ్‌లలో ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూప్ చైర్మన్ గువో గ్వాంగ్‌చాంగ్ ఉన్నారు. కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ తర్వాత హఠాత్తుగా ఒకరోజు ప్రత్యక్షమయ్యారు. ఫుట్‌బాల్ క్లబ్‌కి యజమాని కూడా అయిన గ్వాంగ్‌చాంగ్‌ని అవి నీతి కేసుల్లో దర్యాప్తు సంస్థలు అదుపులోనికి తీసుకొని తర్వాత విడిచిపెట్టినట్టు వార్తలు వచ్చాయి. రెన్ జికియాంగ్ చైనాలో రియల్ ఎస్టేట్ టైకూన్ రెన్ జికియాంగ్ 2020 మార్చిలో అదృశ్యమయ్యారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒక విదూషకుడు తరహాలో వ్యవహరించారంటూ వ్యాఖ్యానించిన కొద్ది రోజుల్లోనే ఆయన కనిపించకుండాపోయారు. ఏడాది తర్వాత అవినీతి ఆరోపణలపై ఆయనకు 18 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఫ్యాన్ బింగ్‌బింగ్ రాజకీయ నాయకులు వ్యాపార వేత్తలతో పాటు చైనాలో నటీనటుల చుట్టూ అదృశ్యం మిస్టరీ నెలకొంది. 2018 జూలైలో ఫ్యాన్ బింగ్‌బింగ్ అనే నటీమణి హఠాత్తుగా కనిపించకుండాపోయారు. సోషల్ మీడియాకి ఆమె దూరమయ్యారు. బింగ్‌బింగ్ చైనా విడిచిపెట్టారని, గృహ నిర్బంధంలో ఉంచారన్న వదంతులు వ్యాపించాయి. దాదాపుగా ఏడాది తర్వాత బయటకు వచ్చిన ఆమె పన్నులు ఎగ్గొట్టినందుకు 8.83 కోట్ల యువాన్లు జరిమానా చెల్లించారు. పెంగ్ షూయీ చైనా టెన్నీస్ క్రీడాకారిణి పెంచ్ షూయీ 2022లో అదృశ్యమైంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారి జాంగ్ గయోలిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఆమె కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఆమె చైనాలోనే ఉంటున్నారని తెలుస్తోందికానీ లో ప్రొఫైల్‌లో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చరిత్రకెక్కిన జిన్‌పింగ్.. మావో జెడాంగ్ తర్వాత తొలినాయకుడిగా..
బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (69) చరిత్ర సృష్టించారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి నాయకుడు ఆయనే! బీజింగ్‌లోని ఆర్నేట్ గ్రేట్ హాల్లో ఆదివారం సీపీసీ 20వ సెంట్రల్ కమిటీ ప్లీనరీ జిన్‌పింగ్ అధ్యక్షతన జరిగింది. 203 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు, 168 మంది ప్రత్యామ్నాయ సభ్యులు పాల్గొన్నారు. జిన్‌పింగ్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. 24 మందితో సీపీసీ పొలిట్‌బ్యూరోకూ సెంట్రల్ కమిటీ ఆమోదముద్ర వేసింది. జిన్‌పింగ్ సహా ఏడుగురు సభ్యులతో అత్యంత శక్తిమంతమైన స్టాండింగ్ కమిటీనీ ఎన్నుకున్నారు. ఇందులో జిన్‌పింగ్ మద్దతుదారులకే స్థానం దక్కింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఎన్నికయ్యాయని జిన్‌పింగ్ స్వయంగా ప్రకటించారు. సీపీసీ షాంఘై అధ్యక్షుడు లీ ఖియాంగ్.. జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచారు. చైనా ప్రీమియర్ (ప్రధానమంతి) లీ కెఖియాంగ్ వచ్చే ఏడాది మార్చిలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన ప్రీమియర్‌గా లీ ఖియాంగ్ బాధ్యతలు చేపడతారన్న ప్రచారం సాగుతోంది. కమ్యూనిస్ట్ పార్టీ.. చైనా ప్రజలకు వెన్నెముక ప్రపంచానికి చైనా అవసరం, చైనాకు ప్రపంచం అవసరం ఉందని షీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచానికి దూరంగా ఒంటరిగా ఉంటూ చైనా అభివృద్ధి చెందలేదని అన్నారు. అలాగే ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ప్రపంచానికి చైనా కావాలని చెప్పారు. తమ ఆర్థిక వ్యవస్థ నమ్మదగినది, స్వేచ్ఛాయుతమైనది అని పేర్కొన్నారు. పునాది బలంగా ఉందని వివరించారు. దేశ విదేశీ పెట్టుబడుల కోసం తలుపులు తెరిచి ఉంచామని వెల్లడించారు. సంస్కరణల విషయంలో స్థిరంగా ముందుకు కదులుతున్నామని చెప్పారు. సౌభాగ్యవంతమైన చైనా బాహ్య ప్రపంచం కోసం ఎన్నో అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. మార్క్సిజం వైపు మొగ్గు చూపుతుండడంతోపాటు చైనాను ఆధునిక సోషలిస్టు దేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని జిన్‌పింగ్ ఇప్పటికే ప్రకటించారు. నూతన శకంలో సోషలిజం అభివృద్ధిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వందేళ్ల చరిత్ర ఉన్న.. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ స్వయం సంస్కరణ ద్వారా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. మన పార్టీ చైనా ప్రజలకు ఒక బలమైన వెన్నుముకగా మారాలన్నారు. ఘన కీర్తి కలిగిన చైనా అద్భుతమైన కలలతో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తోందని జిన్‌పింగ్ వివరించారు. మార్గసూచి(రోడ్‌మ్యాప్) తయారు చేసుకున్నామని, శంఖం పూరించామని చెప్పారు. మన దేశానికి మెరుగైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీకి పక్షపాతానికి తావులేని వాస్తవికమైన ప్రచారం కల్పించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మూడు అత్యున్నత పదవులు అత్యంత శక్తిమంతమైన సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) చైర్మన్‌గా జిన్‌పింగ్‌ను కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూర్ మరోసారి నియమించింది. ఆయనకు మూడు అత్యున్నత పదవులు దక్కాయి. దేశాధ్యక్షుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ అధినేతగా, సీఎంసీ చైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) జనరల్స్ ఝాంగ్ యుషియా, హీ వీడాంగ్‌ను సీఎంసీ వైస్ చైర్మన్లుగా నియమించారు. పలువురు సైనిక ఉన్నతాధికారులకు సెంట్రల్ మిలటరీ కమిషన్‌లో సభ్యులుగా అవకాశం లభించింది. ఆదివారం సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్స్పెక్షన్ (సీసీడీఐ) స్టాండింగ్ కమిటీ కార్యదర్శి, ఉప కార్యదర్శులు, సభ్యులను కూడా ఎన్నుకున్నారు. 24 మందితో కూడిన సీపీసీ పొలిట్‌బ్యూరోలో మహిళలకు స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: మీడియా సాక్షిగా చైనా మాజీ అధ్యక్షుడి జింటావో గెంటివేత! -
మీడియా సాక్షిగా చైనా మాజీ అధ్యక్షుడి జింటావో గెంటివేత!
బీజింగ్: చైనాలో కమ్యూనిస్టు పార్టీ సదస్సు ముగింపు సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. చైనా మాజీ అధ్యక్షుడు హూ జింటావో (79)ను మీడియా సాక్షిగా హాల్ నుంచి గెంటేశారు. జిన్‌పింగ్ పక్కన ఇతర అత్యున్నత స్థాయి నేతలతో పాటు ముందు వరుసలో కూర్చుని ఉన్న ఆయనతో ఇద్దరు వచ్చి కాసేపు మాట్లాడారు. చివరికి జింటావో అయిష్టంగానే వారితో పాటు వెళ్లిపోయారు. దాంతో పార్టీ నాయకులంతా బిత్తరపోయారు. మీడియాను హాలోలోకి అనుమతించాక అందరి ముందే ఇదంతా జరగడం యాదృచ్ఛికం కాదని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 2012లో జింటావో నుంచే జిన్‌పింగ్ చైనా అధ్యక్ష పగ్గాలు స్వీకరించడం గమనార్హం! Another clip of the moments leading up to the original Hu videohttps://t.co/CkoALIH52A — Danson Cheong (@dansoncj) October 22, 2022 ఇక్కడ చదవండి: జిన్‌పింగ్ మూడోస్సారి! -
జిన్‌పింగ్ మూడోస్సారి!
బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (69) రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు నేడు లాంఛనంగా ప్రకటన వెలువడనుంది. ఐదేళ్లకోసారి జరిగే వారం రోజుల కమ్యూనిస్టు పార్టీ సదస్సు శనివారం 205 మంది సెంట్రల్ కమిటీ సభ్యుల ఎన్నికతో ముగిసింది. ఆదివారం వీరంతా కలిసి 25 మంది పొలిటికల్ బ్యూరో సభ్యులను ఎన్నుకుంటారు. తర్వాత వారు దేశ పాలనా వ్యవహారాలన్నీ చక్కబెట్టేందుకు ఏడుగురు, లేదా అంతకంటే ఎక్కువ మందితో కీలకమైన స్టాండింగ్ కమిటీని ఎన్నుకుంటారు. వారిలోంచి ఒకరు ప్రధాన కార్యదర్శి పార్టీనీ, అధ్యక్ష హోదాలో దేశాన్నీ నడిపిస్తారు. జిన్‌పింగ్‌తో పాటు ఆయన మద్దతుదారులు చాలామంది సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్ వరుసగా మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై అధ్యక్షునిగా కొనసాగడం లాంఛనమేనని పరిశీలకులు భావిస్తున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్అనంతరం పదేళ్లకు పైగా అధ్యక్ష పడవిలో కొనసాగనున్న తొలి నేతగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. అంతేగాక మావో మాదిరిగానే జీవితకాలం పదవిలో కొనసాగినా ఆశ్చర్యం లేదంటున్నారు. మావో అనంతరం చైనా అధ్యక్షులైన వారంతా పార్టీ నియమావళి ప్రకారం రెండుసార్లు పదవీకాలం పూర్తయ్యాక తప్పుకుంటూ వచ్చారు. కమిటీలో కుదుపులు పలువురు ప్రముఖులను ఇంటిదారి పట్టిస్తూ సెంట్రల్ కమిటీని భారీగా ప్రక్షాళించారు. జిన్‌పింగ్ తర్వాత నంబర్ టూగా కొనసాగుతున్న ప్రధాని లీ కీ కియాంగ్ (67), ఉప ప్రధాని హన్ జెంగ్ (68), నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ లీ జాన్షు (72), చైనీస్ పీపుల్స్ పొలికిటల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ చైర్మన్ వాంగ్ యాంగ్ (67) సహా పలువురు ప్రముఖులకు కమిటీలో చోటు దక్కకపోవడం విశేషం! పైగా వీరంతా పదవీకాలం ముగుస్తున్న జిన్‌పింగ్ సారథ్యంలోని ప్రస్తుత స్టాండింగ్ కమిటీలో సభ్యులు కూడా!! జిన్‌పింగ్‌కు మరిన్ని విశేషాధికారాలు కట్టబెడుతూ శనివారం సదస్సు తీర్మానాలను ఆమోదించింది. అనంతరం జిన్‌పింగ్ ప్రసంగించారు. ‘‘కష్టించేందుకు, గెలిచేందుకు భయపడొద్దు. చిత్తశుద్ధితో ముందుకు సాగాలి’’ అంటూ పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
చైనా కమ్యునిస్ట్ పార్టీ ముగింపు వేడుకలో అనూహ్య ఘటన... వీడియో వైరల్
చైనాలో అధికార కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీ 20వ జాతీయ సదస్సు ఈనెల 16న అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈమేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ ముగింపు వేడుకలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఐతే అనుహ్యంగా చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావో ముగింపు వేడుకుల నుంచి నిష్క్రమించి బయటకు వచ్చేశారు. అకస్మాత్తుగా హు జింటావో పైకి లేచి సెక్యూరిటీ సాయంతో బయటకు వెళ్లిపోవడంతో అక్కడున్నవారంతా షాక్‌తో అయోమయంగా చూస్తుండిపోయారు. అదీగాక ఆయన గత ఆదివారం కాంగ్రెస్ పార్టీ సదస్సు ప్రారంభ వేడుకలో కూడా కాస్త అస్వస్థతకు గురైనట్లు కనిపించారు. ఇదిలా ఉండగా..ఐదేళ్లకు ఒకసారి జరిగే కాంగ్రెస్ పార్టీ సదస్సు రాజ్యంగ సవరణలతో ముగిసింది. ఆ సదస్సులో తన పార్టీ రాజ్యంగ సవరణలో తైవాన్ స్వాతంత్య్రాన్ని అడ్డుకోవడం వ్యతిరేకించటంవంటి తీర్మానాన్ని ప్రధానంగా పొందుపరిచింది. అంతేగాదు ఆ సమావేశంలో ముచ్చటగా మూడోసారి జిన్‌పింగ్‌కి అధికారం కట్టబట్టేందుకు పార్టీ సిద్దమైంది కూడా. ఈ మేరకు పార్టీ సెంట్రల్ కమీటీ తోపాటు పార్టీ సభ్యులందరూ ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఐతే ఈ ముగింపు వేడుకలో మాజీ అధ్యక్షుడు హు జుంటావో నిష్క్రమించడం అందర్నీ షాక్‌కి గురి చేసింది Drama in China as former president Hu Jintao is escorted out of the closing ceremony pic.twitter.com/AzsqUJWuFx — Dan Banik (@danbanik) October 22, 2022 (చదవండి: జిన్‌పింగ్‌కు మూడోసారి పట్టం) -
బలప్రయోగానికీ వెనుకాడం
బీజింగ్: తైవాన్ను చైనాలో ఐక్యం చేసుకొనే విషయంలో బలప్రయోగానికి సైతం వెనుకాడబోమని డ్రాగన్ దేశాధిపతి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ప్రధాన కార్యదర్శి షీ జిన్‌పింగ్ తేల్చిచెప్పారు. తైవాన్ ముమ్మాటికీ తమదేశంలో ఒక అంతర్గత భాగమేనని ఉద్ఘాటించారు. చైనా జాతీయ సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాల కోసం సైన్యాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తామని ప్రకటించారు. రాజధాని బీజింగ్‌లోని ‘ఆర్నేట్ గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్’లో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 20వ జాతీయ సదస్సులో జిన్‌పింగ్ ప్రసంగించారు. తైవాన్ విషయంలో తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంచేశారు. తైవాన్‌లో వేర్పాటువాద ఉద్యమాలకు అడ్డుకట్ట వేయడానికి అన్ని రకాల చర్యలు చేపడతామని వెల్లడించారు. బలప్రయోగానికైనా వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. ‘పూర్తిస్థాయి పునరేకీకరణ’ తప్పనిసరి చైనా పునరేకీకరణను పూర్తి చేస్తామని షీ జిన్‌పింగ్ ప్రతినబూనారు. పునరేకీకరణ అంటే తైవాన్ను చైనా ప్రధాన భూభాగంలో(మెయిన్ ల్యాండ్) కలిపేయడమే. జిన్‌పింగ్ ప్రతిజ్ఞకు సదస్సులో చప్పట్లతో పెద్ద ఎత్తున ఆమోదం లభించింది. తైవాన్ అంశంలో కమ్యూనిస్ట్ పార్టీ దృఢసంకల్పంతో వ్యవహరించాలని జిన్‌పింగ్ సూచించారు. పునరేకీకరణ విషయంలో చిత్తశుద్ధిని ప్రదర్శించాలన్నారు. ‘‘తైవాన్ సమస్యను పరిష్కరించుకోవడం అనేది పూర్తిగా చైనాకు సంబంధించిన వ్యవహారం. ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందే చైనానే’’ అని వ్యాఖ్యానించారు. పునరేకీకరణ విషయంలో శాంతియుత మార్గంలోనే ముందకెళ్తామని తెలిపారు. అదేసమయంలో బలప్రయోగానికి పాల్పడబోమన్న హామీని తాము ఇవ్వలేమన్నారు. ‘పూర్తిస్థాయి పునరేకీకరణ’ అనేది వాస్తవరూపం దాల్చడం తప్పనిసరి అని ఉద్ఘాటించారు. తైవాన్ సోదరుల సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నామని చెప్పారు. వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూనే ఉన్నామన్నారు. చైనా–తైవాన్ మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహిస్తామని వివరించారు. ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను కోరుకుంటున్నామని జిన్‌పింగ్ తెలియజేశారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) 2027లో వందేళ్లను పూర్తిచేసుకోనుందని అన్నారు. సైన్యాన్ని ఆధునీకరించాలన్న లక్ష్యాన్ని మరో ఐదేళ్లలో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆధునిక సోషలిస్ట్ దేశ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆహారం, ఇంధనం, పరిశ్రమలు, సప్లై చైన్స్, విదేశాల్లోని చైనీయుల హక్కుల విషయంలో మరింత సామర్థ్యంతో పని చేయాల్సి ఉందన్నారు. బ్రిక్స్, షాంఘై సహకార సంఘం(ఎస్సీఓ) వంటి వాటిలో చురుకైన పాత్ర పోషిస్తామని జిన్‌పింగ్ వివరించారు. హాంకాంగ్‌పై స్పష్టమైన ఆధిపత్యం సాధించామని చెప్పారు. అగ్రనేతలకు స్థానచలనం! కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సదస్సు దాదాపు వారం రోజులపాటు జరుగనుంది. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి ఎన్నుకోనున్నారు. జిన్‌పింగ్ మినహా పార్టీలో అగ్రనేతలందరికీ ఈసారి స్థానచలనం తప్పదని తెలుస్తోంది. నంబర్–2గా పేరుగాంచిన లీ కెఖియాంగ్‌ను సైతం మార్చనున్నారు. ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. తొలిరోజు సదస్సులో 2,300 మందికిపైగా ‘ఎన్నికైన ప్రతినిధుల’తోపాటు కమ్యూనిస్ట్ పార్టీ మాజీ అగ్రనేతలు హూ జింటావో, సాంగ్‌పింగ్ తదితరులు పాల్గొన్నారు. 2002 దాకా అధ్యక్షుడిగా పనిచేసిన 96 ఏళ్ల జియాంగ్ జెమిన్ హాజరు కాలేదు. జిన్‌పింగ్ దాదాపు 45 నిమిషాలపాటు మాట్లాడారు. కీలక అంశాలను ప్రస్తావించారు. ఆయన ప్రసంగం పట్ల ఆహూతులంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. -
హాంకాంగ్ హస్తగతమైంది.. తర్వాత తైవానే!
బీజింగ్: హాంకాంగ్‌ను పూర్తి స్థాయిలో తమ నియంత్రణలోకి తెచ్చుకున్నామని ప్రకటించారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. దాని ద్వారా అల్లర్ల నుంచి సుపరిపాలన దిశగా హాంకాంగ్ మార్పు చెందినట్లు చెప్పారు. మరోవైపు.. తైవాన్ వేర్పాటువాదంపై చైనా పోరాటం చేస్తోందన్నారు. తైవాన్ తమ అంతర్గత భాగమని, ఆ ప్రాంత సమగ్రతను తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్’లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు జిన్‌పింగ్. ‘హాంకాంగ్‌లో పరిస్థితులు ఆందోళనల నుంచి సుపరిపాలన దిశగా మార్పు చెందాయి. స్వీయ పరిపాలన ద్వీపం తైవాన్‌లో వేర్పాటు వాదం, విదేశీ శక్తుల జోక్యంపై ప్రధానంగా పోరాటం చేస్తున్నాం.’ అని పేర్కొన్నారు జిన్‌పింగ్. తైవాన్ను స్వతంత్ర ప్రాంతంగా తాము అంగీకరించబోమని, తైపీ తమ అంతర్గత ప్రాంతమని చాలా సందర్భాలుగా చైనా చెబుతూ వస్తోంది. ఇటీవల అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ, ఇతర చట్ట సభ్యులు తైనాన్‌లో పర్యటించగా.. ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ను అష్టదిగ్భందనం చేసి.. యుద్ధ మేఘాలను ఆవరించింది. ఇదీ చదవండి: చైనా అధ్యక్షుడిగా ముచ్చటగా మూడోసారి ఆయనే! -
జిన్‌పింగ్‌కు మూడోసారి పట్టం!
జన చైనా అధినేతగా షీ జిన్‌పింగ్(69)ను వరుసగా మూడోసారి ఎన్నుకొనేందుకు రంగం సిద్ధమయ్యింది. మరో ఐదేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగడం ఖాయమే. అన్నీ అనుకున్నట్లు జరిగితే జీవితకాలం పదవిలో ఉండేలా అధికార చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) తీర్మానాన్ని ఆమోదించినా ఆశ్చర్యం లేదు. పార్టీ దివంగత నేత మావో జెడాంగ్ తర్వాత మూడుసార్లు చైనా అధ్యక్షుడిగా గద్దెనెక్కిన నాయకుడిగా జిన్‌పింగ్ రికార్డు సృష్టించబోతున్నారు. కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ సదస్సు ఈ నెల 16న జరుగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిన్‌పింగ్ జాగ్రత్తగా ‘ఎన్నిక చేసిన’ 2,296 మంది ప్రతినిధులు పాల్గొంటారు. వీరంతా జిన్‌పింగ్‌కు మరోసారి పట్టంకడతారు. ప్రపంచ శక్తిగా ఎదగాలని తహతహలాడుతున్న డ్రాగన్ దేశంపై అమెరికాతోపాటు పశ్చిమ దేశాలు గుర్రుగా ఉన్నాయి. చైనా దూకుడును అడ్డుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జిన్‌పింగ్ వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతుండడం ఆసక్తికరంగా మారింది. ’పదేళ్ల పదవీ కాలం’ విధానానికి మంగళం చైనాలో ’పదేళ్ల పదవీ కాలం’ అనే నిబంధనకు కాలం చెల్లబోతోంది. ఇన్నాళ్లూ ’రెండు పర్యాయాలు.. ఒక్కోటి ఐదేళ్లు’ అనే విధానం కఠినంగా అమలయ్యింది. అంటే ఒక అధ్యక్షుడు పదేళ్లకు మించి అధికారంలో కొనసాగడానికి వీల్లేదు. ఏకైక రాజకీయ పార్టీ ఉన్న చైనాలో ఏక వ్యక్తి ఆధిపత్యం అరాచకానికి దారితీస్తుందన్న అంచనాతో ఈ విధానం ప్రవేశపెట్టారు. మావో జెడాంగ్ మినహా జిన్‌పింగ్ కంటే ముందు అధికారంలో ఉన్న అధ్యక్షులంతా దీనికి కట్టుబడి ఉన్నారు. మావో జెడాంగ్ 1976 దాకా అధికారంలో కొనసాగారు. పాలనలో తన బ్రాండ్ అయిన ’జెడాంగ్ ఆలోచన’ను అమలు చేశారు. పెట్టుబడిదారులపై కఠిన ఆంక్షలు విధించారు. సాంస్కృతిక విప్లవం వంటి ప్రయోగాలు చేశారు. జెడాంగ్ పాలనలో చైనా దాదాపు దివాలా దశకు చేరుకుంది. అనంతరం సర్వోన్నత నాయకుడిగా పేరుగాంచిన డెంగ్ జియావోపింగ్ అధికారంలోకి వచ్చారు. మావో విధానాలకు మంగళం పాడుతూ తనదైన ఆర్థిక విధానాలకు తెరతీశారు. ఆర్థికాభివృద్ధికి బాటలు వేశారు. ఒకే వ్యక్తి సుదీర్ఘ కాలంలో అధికారంలో ఉంటే దేశానికి ముప్పేనన్న అంచనాతో ’పదేళ్ల పదవీ కాలాన్ని, 68 ఏళ్ల వయోపరిమితిని’ ప్రవేశపెట్టారు. 1982లో జరిగిన సీపీసీ 12వ జాతీయ సదస్సులో వీటికి ఆమోదం లభించింది. ఆ తర్వాత జియాంగ్ జెమిన్, హూ జింటావో అధికారంలోకి వచ్చారు. వారి హయాంలోనే చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ‘నూతన మావో’ జిన్‌పింగ్ 31953 జూన్ 15న జన్మించిన షీ జిన్‌పింగ్ 2008 నుంచి 2013 వరకూ హూ జింటావో హయాంలో చైనా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2012లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అటు పిమ్మట సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) చైర్మన్‌గా మారారు. 2013 మార్చి 14న ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ 7వ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి నిరాటంకంగా కుర్చీని అధిరోహిస్తున్నారు. సైన్యం, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తిగా జిన్‌పింగ్ నియంత్రణలోకి వచ్చాయి. మూడున్నర దశాబ్దాల తర్వాత ‘వన్ లీడర్’ పాలన మొదలయ్యింది. పదేళ్ల పదవీ కాలం నిబంధన ప్రకారం 2023లో ఆయన పాలన ముగిసిపోవాలి. కానీ, ‘నూతన మావో’ కావాలన్నది జిన్‌పింగ్ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఆయన సాధించినట్లేనని చెప్పుకోవచ్చు. ► జిన్‌పింగ్ మరింత శక్తివంతమైన నాయకుడిగా అవతరించబోతున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పదేళ్లలో అధికారాన్ని జిన్‌పింగ్ కేంద్రీకృతం చేశారు. పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించారు. మాజీ అధినేతలతో పోలిస్తే ఎక్కువ అధికారాలను అనుభవిస్తున్నారు. ► జిన్‌పింగ్‌కు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రి జోంగ్‌షున్ జైలుపాలయ్యారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న యువత గ్రామాల్లో రైతులతో కలిసి జీవించాలని మావో ఆదేశించడంతో 1969లో జిన్‌పింగ్ షాన్షీ ప్రావిన్స్‌లోని ఓ మారుమూల పల్లెకు చేరుకున్నారు. అక్కడ ఓ గుడిసెలోనే ఆరేళ్లపాటు జీవనం సాగింది. ► పల్లె జీవితం తర్వాత జిన్‌పింగ్ బీజింగ్‌లోని తిసింగ్‌హువా యూనివర్సిటీలో చేరారు. స్కాలర్‌షిప్‌తో చదువుకున్నారు. తర్వాత చైనా రక్షణశాఖలో మూడేళ్లపాటు పనిచేశారు. 1985లో ఫుజియాన్ ప్రావిన్స్‌లోని షియామెన్ నగర ఉపమేయర్‌గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరం నాటికి ఆదే పావిన్స్ గవర్నర్‌గా ఎదిగారు. ఆ తర్వాత సౌత్ ఆఫ్ బీజింగ్ కౌంటీ కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ► 2002లో జెజీయాంగ్ ప్రావిన్స్‌లో పార్టీ చీఫ్‌గా, 2007లో షాంఘైలో పార్టీ కార్యదర్శిగా వ్యవహరించారు. పార్టీ పొలిట్‌బ్యూరోలో శక్తివంతమైన స్టాడింగ్ కమిటీలో సభ్యుడిగా చేరారు. ► చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ పేరును ప్రతిపాదిస్తూ 2012లో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో తీర్మానాన్ని ఆమోదించారు. ► తైవాన్ విషయంలో అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. తైవాన్ను ఎట్టిపరిస్థితుల్లోనూ చైనాలో కలిపేసుకుంటామని జిన్‌పింగ్ చెబుతున్నారు. ► చైనాలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం, మీడియాపై ఆంక్షలు సర్వసాధారణంగా మారాయి. ► హాంకాంగ్‌లో శాంతియుత నిరసనలను కఠినంగా అణచివేశారు. ► జిన్‌పింగ్ అమల్లోకి తీసుకొచ్చిన ‘జీరో–కోవిడ్’ పాలసీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లాక్డౌన్లు కాదు, స్వేచ్ఛ కావాలంటూ జనం నినదిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
బీజింగ్‌లో జిన్‌పింగ్ వ్యతిరేక బ్యానర్లు
బీజింగ్: చైనాలో మునుపెన్నడూ కనిపించని దృశ్యాలు.. సోషల్ మీడియా సాక్షిగా వైరల్ అవుతున్నాయి. కరోనా కఠిన ఆంక్షలతో జనాలు తీవ్ర అసంతృప్తి.. అసహనంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌పై వ్యతిరేకత తారాస్థాయికి చేరుతోంది. తాజాగా ఏకంగా రాజధాని బీజింగ్ మహానగరంలో జిన్‌పింగ్ వ్యతిరేక బ్యానర్లు వెలిశాయి. అయితే.. అప్రమత్తమైన అధికారులు తొలగించినప్పటికీ అప్పటికే వాటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. జిన్‌పింగ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, కొవిడ్-19 కఠిన ఆంక్షల్ని తొలగించాలని ఆ బ్యానర్లను ఓ ఫ్లై ఓవర్‌పై, మరికొన్ని కూడళ్లలో ఉంచారు. పైగా ఫ్లై ఓవర్‌పై వేలాడదీసిన బ్యానర్లకు కాస్త దూరంలో ఆకర్షణ కోసం మంటలు రాజేశారు. ‘‘కరోనా పరీక్షలు మాకొద్దు. మా ఆకలి తీరితే చాలు. లాక్డౌన్లు అక్కర్లేదు.. స్వేచ్ఛ కావాలి.. అందుకు జిన్‌పింగ్‌కు ఉద్వాసన పలకాలి’’ అంటూ బ్యానర్లను కట్టారు. జిన్‌పింగ్ వ్యతిరేక బ్యానర్లు తొలగిస్తున్న సిబ్బంది బీజింగ్‌తో పాటు హయిదియాన్లో, మరికొన్ని చోట్ల ఆ బ్యానర్లు వెలిశాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులను సైతం ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ పోతున్నారు అధికారులు. వీటిని ఏర్పాటు చేసిన వాళ్లను సాహసవీరులుగా పొగుడుతూ చైనా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ వెబ్‌లో పోస్టులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీటిని ఏర్పాటు చేసిన వాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు అక్కడి అధికారులు. కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తైన దరిమిలా, జింగ్‌పిన్ మూడో దఫా అధ్యక్ష పగ్గాలు చేపడతాడనే ఊహాగానాల నడుమ.. ఈ వ్యతిరేక పరిణామం ఆసక్తికర చర్చకు దారి తీసింది. తాజాగా కొత్త వేరియెంట్ల కేసులతో మరోసారి లాక్డౌన్ విధిస్తోంది చైనా. ఇదీ చదవండి: అప్పుడే అయిపోలేదు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక -
ప్లీనరీలో జిన్‌పింగ్ వర్క్ రిపోర్ట్
బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదివారం అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్లీనరీ నిర్వహించారు. తన పాలనలో సాధించిన విజయాలు, భవిష్యత్తు దార్శనికతపై ఒక వర్క్ రిపోర్ట్‌ను ఈ సందర్భంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది సీనియర్ నేతలు పాల్గొన్నారు. కొన్ని కీలక విధానాలు, డాక్యుమెంట్లపై చర్చించారు. ఈ నెల 16న జరగబోయే కమ్యూనిస్ట్ పార్టీ 20వ జాతీయ సదస్సుకు సన్నాహకంగా ఈ ప్లీనరీని నిర్వహించినట్లు తెలుస్తోంది. జిన్‌పింగ్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ జాతీయ సదస్సులో తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఆయన గత పదేళ్లుగా పదవిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చైనా కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సదస్సును ఐదేళ్లకోసారి నిర్వహిస్తారు. చైనా అధ్యక్షుడు పదేళ్లకు మించి అధికారంలో ఉండడానికి వీల్లేదు. కానీ, 2018లో రాజ్యాంగాన్ని సవరించారు. పదేళ్ల పదవీ కాలం నిబంధనను తొలగించారు. జిన్‌పింగ్ మరో ఐదేళ్లు అధ్యక్షుడిగా పదవీలో ఉండడానికి వీలు కల్పించారు. -
పోరాటాలకు సిద్ధం కావాలి
బీజింగ్: రాబోయే కాలంలో అతిపెద్ద పోరాటాలకు, ఊహించని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటినుంచే సంసిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా వ్యవహరించాలని సూచించారు. చైనా నేషనల్ డే సందర్భంగా ఖిషీ పత్రికలో జిన్‌పింగ్ ఈ మేరకు ఓ వ్యాసం రాశారు. సవాళ్లను ప్రభావవంతంగా అధిగమించే దిశగా ప్రజలను ముందుకు నడిపించాలని పేర్కొన్నారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ కీలక సదస్సు ఈ నెల 16న జరగనుంది. జిన్‌పింగ్ పదవీ కాలాన్ని వరుసగా మూడోసారి మరో ఐదేళ్లపాటు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మావో జెడాంగ్ తర్వాత పదేళ్లకుపైగా అధికారంలో ఉన్న నాయకుడిగా జిన్‌పింగ్ రికార్డు సృష్టిస్తారు. -
చైనా ప్లాన్ మామూలుగా లేదుగా.. ప్రపంచవ్యాప్తంగా రహస్య పోలీస్ స్టేషన్లు!
బీజింగ్: గ్లోబల్ సూపర్‌పవర్‌గా ఎదగాలనే తన లక్ష్యాన్ని సాధించేందుకు చైనా శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. అభివృద్ధి చెందిన కెనడా, ఐర్లాండ్ వంటి దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అక్రమంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఈ రహస్య పోలీస్ స్టేషన్లపై సంచలన విషయాలు వెల్లడించింది ఓ నివేదిక. ఈ అంశంపై మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనడా వ్యాప్తంగా పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో(పీఎస్బీ) అనుబంధంగానే అలాంటి అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్ రిపోర్టికా..స్థానిక మీడియాతో వెల్లడించింది. చైనా విరోధులను నిలువరించేందుకు ఈ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. గ్రేటర్ టొరొంటే ప్రాంతంలోనే ఇలాంటివి మూడు స్టేషన్లు ఉన్నాయని తెలిపింది. మరోవైపు.. ఈ అక్రమ పోలీస్ స్టేషన్ల ద్వారా పలు దేశాల్లో ఎన్నికలను సైతం చైనా ప్రభావితం చేస్తోందని సంచనల విషయాలు వెల్లడించింది. 21 దేశాల్లో 30 అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చైనాలోని ఫుఝో పోలీసులు తెలిపారని రిపోర్టికా పేర్కొంది. ఉక్రెయిన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, యూకే వంటి దేశాల్లోనూ చైనా పోలీస్ స్టేషన్లకు కావాల్సిన సౌకర్యాలు కల్పించారని తెలిపింది. ఆయా దేశాల్లోని పలువురు నేతలు చైనా ప్రబల్యాన్ని ప్రశ్నిస్తున్నారని, మానవ హక్కులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు రిపోర్టికా పేర్కొంది. మరోవైపు.. స్వదేశంలో భద్రత పేరుతో ప్రజలను అణచివేస్తున్న తీరుపై అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాపై విమర్శలు గుప్పిస్తున్నారు మానవ హక్కుల ప్రచారకర్తలు. ఇదీ చదవండి: జనంలోకి జిన్‌పింగ్ -
జనంలోకి జిన్‌పింగ్
బీజింగ్: చైనాలో సైనిక కుట్ర అంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వార్తలను పటాపంచలు చేస్తూ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ మంగళవారం జనబాహుళ్యంలో ప్రత్యక్షమయ్యారు. ఉబ్బెకిస్తాన్‌లో సమర్కండ్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశాల తర్వాత 16న చైనాకు తిరిగొచ్చిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచి సైన్యం అధికార పగ్గాలు చేపట్టిందనే వార్తలు నాలుగైదు రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం విదితమే. ఈ వార్తలన్నీ ఉట్టి కాకమ్మ కథలే అని రుజువుచేస్తూ జిన్‌పింగ్ మంగళవారం బీజింగ్‌లో అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటుచేసిన ఒక ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. దశాబ్దకాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సాధించిన విజయాలు, దేశ పురోగతిని ప్రతిబింబించేలా ఉన్న ప్రదర్శనను అధ్యక్షుడు జిన్‌పింగ్ తిలకించారని చైనా అధికార వార్త సంస్థ జిన్హువా తెలిపింది. జిన్‌పింగ్ వెంట దేశ ప్రధాని లీ క్వెకియాంగ్, పార్టీ కీలక నేతలు ఉన్నారు. జిన్‌పింగ్ నుంచి అధికారాన్ని సైన్యం కైవసం చేసుకుందనే వార్తలు అబద్ధమని దీంతో తేలిపోయింది. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఏడు రోజులపాటు క్వారంటైన్లో ఉండాలనే నిబంధనను జిన్‌పింగ్ కూడా పాటించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
Xi Jinping: పుకార్లకు చెక్ పెట్టేలా.. మళ్లీ పదేళ్లపాటు?
సైనిక తిరుగుబాటు.. గృహ నిర్భంధం.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ గురించి భారత మీడియాలో జరిగిన ప్రచారాలతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్ ఎస్సీవో సదస్సుకు హాజరై.. తిరిగి చైనాకు చేరుకున్న జిన్‌పింగ్ మీడియా కంట కనబడకపోవడంతో ఈ చర్చ మొదలైంది. దీనికితోడు బీజింగ్‌లో మిలిటరీ కదలికలు, భారీగా విమానాలు రద్దు కావడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే.. అవి కేవలం పుకార్లుగా తేలుస్తూ.. త్వరలో ఒక బలమైన ప్రకటనను జింగ్‌పిన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరో దఫా చైనాకు అధ్యక్షుడిగా కొనసాగాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు 20వ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) కాంగ్రెస్ వేదికగా ఆయన ప్రకటన చేయనున్నట్లు అక్కడి బ్లాగులు కొన్ని కథనాలు ప్రచురిస్తున్నాయి. అక్టోబర్ 16వ తేదీ నుంచి వారంపాటు సీపీసీ సమావేశం సాగనుంది. కీలకమైన ఈ సమావేశం నుంచి సీపీసీ బలాన్ని, జిన్‌పింగ్ కీర్తిని ప్రదర్శించడానికి అత్యంత ప్రణాళికాబద్ధమైన వేదికగా ఉపయోగించబోతున్నారు. సుమారుగా రెండు వేలకు పైగా పార్టీ ప్రతినిధుల్ని ఈసారి సీపీసీ వేదికగా నియమించబోతున్నారు. ఇందులో 200 మంది శాశ్వత సభ్యులు, 170 మంది ప్రత్యామ్నాయ సభ్యులు ఉంటారని తెలుస్తోంది. ఇక ఈ దఫా కూడా సీపీసీలో 69 ఏళ్ల జిన్‌పింగ్ ఆధిపత్యమే కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరో దఫా అంటే ఐదేళ్లు లేదంటే.. మరో పదేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగే విధంగా సీపీసీలో ఆయన తీర్మానం ప్రకటిస్తారనే ఊహాగానాలు బయలుదేరాయి. ఈ గ్యాప్‌లో తన వారసుడిని ఎంచుకునేందుకు తనకు వీలు ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు ఆ కథనాల సారాంశం. గతంలో మావో జెడాంగ్ కూడా ఇదే తరహాలో వ్యవహరించాడని, ఒకవేళ జిన్‌పింగ్ గనుక తన వారసుడిని ఎన్నుకున్నప్పటికీ.. ఆ వ్యక్తికి రాజకీయ పలుకబడి ఉంటుందనే గ్యారెంటీ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా నుంచి జిన్‌పింగ్ పట్ల చైనాలో విపరీతమైన ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. కఠిన లాక్డౌన్ నిబంధనలతో పరోక్షంగా మరణాలకు కారణం అయ్యాడంటూ ఆయనపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు అక్కడి జనాలు. మరోవైపు పాలనాపరంగానూ జిన్‌పింగ్ తీరుపట్ల సీపీసీలోనూ అసంతృప్తి నెలకొందనే ప్రచారం వినిపిస్తోంది. అందుకే మిలిటరీ చీఫ్ చైనాకు అధ్యక్షుడు కాబోతున్నాడంటూ ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. -
యువరక్తంతోనే భవిష్యత్ యుద్ధాల్లో విజయం
బీజింగ్: భవిష్యత్ యుద్ధాల్లో విజయం సాధించేందుకు సైన్యంలో యువ రక్తం అవసరం ఎంతో ఉందని, ఆ దిశగా నియామకాలను వేగవంతం చేయాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. సైనిక పోటీలో విజయం సాధించేందుకు, సైన్యం మెరుగైన పనితీరుకు, భవిష్యత్ యుద్ధాల్లో పైచేయి సాధించేందుకు సాయుధ దళాల్లో కొత్తరక్తం కీలకమన్నారు. సైన్యంలో ప్రతిభకు సంబంధించిన విధానాలపై శుక్రవారం నుంచి ఆదివారం వరకు బీజింగ్‌లో జరిగిన సదస్సులో చైనా కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్, సర్వసైన్యాధ్యక్షుడు అయిన జిన్‌పింగ్ ప్రసంగించారు. పోరాడటానికి, విజయం సాధించడానికి అవసరమైన సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడమే సైన్యం (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ–పీఎల్ఏ) లక్ష్యం కావాలన్నారు. ఆధునిక యుద్ధాల్లో గెలుపు సాధించిపెట్టే శాస్త్రీయమైన, సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలన్నారు. ఉత్తమ శ్రేణి మిలటరీ స్కూళ్ల ఏర్పాటు చేసి, అత్యుత్తమమైన సైనికులను తయారు చేయాలని కోరారు. 2027లో జరిగే పీఎల్ఏ వందేళ్ల ఉత్సవాలకు పెట్టుకున్న లక్ష్యాల సాధనకు కొత్తరక్తాన్ని నింపాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన అన్నట్లు అధికార వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. యుద్ధ విధుల్లోకి మరో 3 లక్షల మందిని నియమించుకునేందుకు చైనా సైన్యం పీఎల్ఏ సన్నాహాలు చేస్తోందన్న వార్తల నేపథ్యంలో జిన్‌పింగ్∙ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 209 బిలియన్ డాలర్ల వార్షిక రక్షణ బడ్జెట్ కలిగిన చైనా సైన్యం ఆధునీకరణ ప్రయత్నాలను వేగవంతం చేసింది. సంస్థాగతంగా సంస్కరణలు చేపట్టింది. హైపర్సోనిక్ ఆయుధాలు వంటి కొత్త ఆయుధ వ్యవస్థలను సమకూర్చుకుంటోంది. చైనా ఇటీవల ప్రపంచాన్ని చుట్టి వచ్చే సత్తా కలిగిన దీర్ఘశ్రేణి క్షిపణిని ప్రయోగించినట్లు అమెరికా సైన్యం అంటోంది. ఈ క్షిపణి విడిచిపెట్టిన హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ తిరిగి చైనాలోని లక్ష్యానికి అతి చేరువలోకి వచ్చినట్లు పేర్కొంది. 2012లో జిన్‌పింగ్ అధికార పగ్గాలు చేపట్టాక పీఎల్ఏ ఆధునీకరణ దిశగా చర్యలను వేగవంతం చేశారు. అంతకుముందు 23 లక్షలుగా ఉన్న సైన్యాన్ని ప్రస్తుతం 20 లక్షలకు తగ్గించారని హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. -
ఎదురులేని నేతగా జిన్‌పింగ్
బీజింగ్: డ్రాగన్ దేశంపై అధ్యక్షుడు జీ జిన్‌పింగ్(68) మరింత పట్టు బిగించారు. చైనా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆయన వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమమైనట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. వందేళ్లలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) సాధించిన విజయాలను, జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా సాధించిన ఘనతలను, అభివృద్ధిని ప్రస్తుతిస్తూ అధికార సీపీసీ 19వ కేంద్ర కమిటీ ఆరో ప్లీనరీలో చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించారు. పార్టీ చరిత్రలో ఇలాంటి తీర్మానం చేయడం ఇది మూడోసారి మాత్రమే కావడం గమనార్హం. రాజధాని బీజింగ్‌లో ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన సీపీసీ ప్లీనరీ గురువారం ముగిసింది. నాలుగు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో కీలకమైన అంశాలపై చర్చించారు. కమ్యూనిస్టు పార్టీ శుక్రవారం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనుంది. ప్లీనరీలో జిన్‌పింగ్ సీపీసీ కేంద్ర కమిటీ పొలిటికల్ బ్యూరో తరపున వర్క్ రిపోర్టు సమర్పించారు. తీర్మానం ముసాయిదాపై మాట్లాడారు. సీపీసీ 20వ జాతీయ సదస్సును(ఐదేళ్లకోసారి జరుగుతుంది) 2022లో జూలై తర్వాత నిర్వహించనున్నారు. మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ ఎంపికను ఆ సదస్సులో అధికారికంగా ఆమోదించనున్నారు. ఆయన ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శిగా, చైనా త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌గా(సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్), దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మూడు అత్యంత శక్తివంతమైన పదవుల్లో ఏకకాలంలో కొనసాగుతున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆ వెంటనే మరోసారి అదే పదవిని చేపట్టేందుకు రంగం సిద్ధమైనట్లే. చైనాలో మూడుసార్లు అధ్యక్ష పదవిని అధిష్టించే అవకాశం ఇప్పటిదాకా ఎవరికీ దక్కలేదు. 2018లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం జిన్‌పింగ్ జీవితకాలం అధ్యక్ష పదవిలో కొనసాగే వెసులుబాటు కూడా ఉంది. -
వరుసగా మూడోసారీ జిన్‌పింగ్‌కే పట్టం!
బీజింగ్: డ్రాగన్ దేశం చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) వందేళ్ల చరిత్రలో గతంలో ఎన్నడూ చేయని తీర్మానాన్ని ఆమోదించేందుకు రంగం సిద్ధమయ్యింది. జీ జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకొంటూ చరిత్రాత్మక తీర్మానం చేయబోతున్నట్లు సమాచారం. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా 19వ సెంట్రల్ కమిటీ ఆరో ప్లీనరీ సోమవారం చైనా రాజధాని బీజింగ్‌లో ప్రారంభమయ్యింది. ఈ సమావేశం నాలుగు రోజులపాటు జరగనుంది. తొలిరోజు 400 మంది సీపీసీ కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. సీపీసీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తమ ప్రభుత్వ పనితీరుపై ఒక నివేదికను ఈ సందర్భంగా సమర్పించారు. వందేళ్లలో కమ్యూనిస్టు పార్టీ సాధించిన విజయాలను వివరిస్తూ పొలిటికల్ బ్యూరో తరపున ఒక ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చైనా నూతన అధ్యక్షుడిని 2022లో ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సీపీసీ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. పార్టీ వందేళ్ల చరిత్రను, జయాపజయాలను సమీక్షించుకోవడానికి, భవిష్యత్తు నాయకత్వానికి బాటలు వేయడానికి ప్లీనరీ జరుగుతున్నట్లు నాన్జింగ్ యూనివర్సిటీలోని పొలిటికల్ సైంటిస్టు గూ సూ చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు జిన్‌పింగ్ సాధించిన ఘనతలను గుర్తుచేసుకొని, ప్రశంసించాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉందన్నారు. సీపీసీ ప్లీనరీలో సాధారణంగా పార్టీ వ్యవహారాలు, కీలకమైన నియామకాలు, పార్టీ సిద్ధాంతాలు, భావజాలం, పార్టీ నిర్మాణంపై చర్చిస్తుంటారు. జీవితకాలం అదే పదవిలో? చైనాలోని మూడు ముఖ్యమైన అధికార కేంద్రాలు 68 ఏళ్ల జిన్‌పింగ్ ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన సీపీసీ ప్రధాన కార్యదర్శిగా, శక్తివంతమైన సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) చైర్మన్‌గా(త్రివిధ దళాల సుప్రీం కమాండర్), చైనా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్షుడిగా ఐదేళ్ల పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆయన ఇప్పటికే వరుసగా రెండుసార్లు అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. గత తొమ్మిదేళ్ల పాలనలో మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి కొనసాగనున్నట్లు తెలుస్తోంది. జిన్‌పింగ్ తన జీవితకాలం అదే పదవిని అంటిపెట్టుకొని ఉండే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. జిన్‌పింగ్‌కు 2016లో కమ్యూనిస్టు పార్టీలో ‘అత్యంత కీలకమైన నాయకుడు’ అన్న హోదా లభించింది. -
కమ్యూనిస్టు పార్టీలోకి ప్రపంచ ప్రఖ్యాత నటుడు
బీజింగ్: వందేళ్లు పూర్తి చేసుకున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)లోకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అగ్ర నటుడు చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తమ దేశ మీడియాతో పంచుకున్నారు. తనకు ‘సీపీసీ’లో చేరాలని ఉందంటూ ఆ దేశ అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ చర్చలో ఆయన పేర్కొన్నారు. ఇంతకు ఆయనెవరో కాదు హాలీవుడ్ నటుడు, దర్శకుడు, మార్షల్ ఆర్ట్స్ సినిమాలతో ప్రపంచ ప్రజలను ఆకర్షించిన జాకీ చాన్ (67 ఏళ్లు). జూలై 1వ తేదీన సీపీసీ వంద వసంతాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. శత వసంతాల వేడుకలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై మంగళవారం (జూలై 6) ఆ దేశ సినీ ప్రముఖులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఆ చర్చలో చైనా ఫిలిం అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న జాకీచాన్ పై వ్యాఖ్యలు చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) వందేళ్లల్లో ఏం చెప్పిందో అది చేసి చూపించిందని కొనియాడారు. అది కూడా కొన్ని దశాబ్దాల్లోనే పూర్తి చేసిందని చెప్పారు. ఈ క్రమంలోనే తాను కొన్నేళ్లుగా ఆ పార్టీకి మద్దతుదారుగా ఉన్నట్లు తెలిపారు. జాకీ చాన్ నటుడు, దర్శకుడు. మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు కూడా. గతంలో జాకి చాన్చైనా పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ)లో సభ్యుడిగా పని చేశారు. -
బెదిరింపులకు భయపడం..తైవాన్‌పై మా నిర్ణయం మారదు
బీజింగ్: చైనాను బెదిరించాలనుకునే విదేశీ శక్తులు 140 కోట్ల దేశ ప్రజలు, శక్తిమంతమైన దేశ మిలటరీలతో కూడిన ‘గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్’ను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హెచ్చరించారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల పండుగ సందర్భంగా చైనాను వ్యతిరేకించే దేశాలకు జిన్‌పింగ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షిక ఉత్సవాలను గురువారం ప్రతిష్టాత్మక తియానన్మెన్ స్క్వేర్ వద్ద ఘనంగా నిర్వహించారు. చైర్మన్ మావో జెడాంగ్ భారీ చిత్రపటం నేపథ్యంలో.. తియానన్మెన్ గేట్ బాల్కనీ నుంచి వేలాది దేశభక్తులను ఉద్దేశించి జిన్‌పింగ్ ప్రసంగించారు. చైనాలో తైవాన్ పునఃవిలీనం తమ చరిత్రాత్మక లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకంగా అమెరికా పేరును ప్రస్తావించకుండా.. చైనాను భయపెట్టే అవకాశం ఏ విదేశీ శక్తికి ఇవ్వబోమని సీపీసీ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్ కూడా అయిన జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్య చర్యలకు పాల్పడుతోందని అమెరికా సహా ఇండో పసిఫిక్ దేశాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా గత అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ చైనాతో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించడం, ఆ దిశగా వాణిజ్య ఆంక్షలు విధించడంతో పాటు, మానవహక్కులు, కరోనా పుట్టుక.. తదితర అంశాలపై చైనాను విమర్శించడం తెలిసిందే. ‘విదేశాల బెదిరింపులకు భయపడం. మనం ఇంతవరకు ఏ దేశాన్ని భయపెట్టలేదు.. అణచివేయలేదు.. వేధించలేదు. ఇకపై కూడా అలా చేయబోం. అలాగే, ఏ దేశం కూడా మనల్ని భయపెట్టే, అణచివేసే, వేధించే చర్యలకు పాల్పడితే సహించబోం’ అని జిన్‌పింగ్ తేల్చిచెప్పారు. 3ఒకవేళ ఏ దేశమైనా అందుకు తెగిస్తే.. 140 కోట్ల మందితో కూడిన గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్‌ను ఢీ కొనాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రత్యక్ష ప్రసారమైన ఈ కార్యక్రమంలో దాదాపు 70 వేల మంది పార్టీ కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే, కార్యక్రమంలో అత్యాధునిక జే 20 ఫైటర్ జెట్స్ సహా 71 యుద్ధ విమానాలు సాహసోపేత విన్యాసాలు చేశాయి. ఉత్సవాల్లో మాజీ అధ్యక్షుడు హు జింటావో, మాజీ ప్రధాని వెన్ జియాబావో సహా సీనియర్ పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్టీలో మావో తరువాత ఆ స్థాయి శక్తిమంతమైన నేతగా జిన్‌పింగ్ ఎదిగారు. పార్టీ శతవార్షిక ఉత్సవాల్లో 100 ఏళ్ల క్రితం పార్టీ వ్యవస్థాపకుడు మావో తరహాలో గ్రే కలర్ సూట్‌ను ధరించి జిన్‌పింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తైవాన్ విలీనంపై రెండో ఆలోచన లేదని ఈ సందర్భంగా జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ‘దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకునే విషయంలో దేశ ప్రజల ప్రతిన, పట్టుదల, అసాధారణ సామర్ధ్యాలను ఎవరూ తక్కువగా అంచనా వేయవద్దు’ అని వ్యాఖ్యానించారు. తైవాన్ను స్వతంత్ర దేశంగా ఆ దేశస్తులు భావిస్తారు. కానీ చైనా మాత్రం అది చైనా భూభాగమేనని వాదిస్తోంది. ఒకవేళతైవాన్‌ను ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నిస్తే.. తైవాన్‌కు మిలటరీ సాయం అందించాలని అమెరికా చట్టాల్లోనే ఉంది. రెండు పర్యాయాలు మాత్రమే దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న నిబంధనను తొలగిస్తూ రాజ్యాంగ సవరణ చేసి, నచ్చినంత కాలం అధ్యక్షుడిగా ఉండేలా జిన్‌పింగ్ ఏర్పాట్లు చేసుకున్న విషయం తెలిసిందే. చైనా సాయుధ దళాలను ఆధునీకరించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సి ఉందని జిన్ పింగ్ పేర్కొన్నారు. సాయుధ దళాలను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో ఆధునీకరిస్తామన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాను 1921 జులై 1 న మావో ప్రారంభించారు. 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడినప్పటి నుంచి సీపీసీ అధికారంలో కొనసాగుతోంది. సీపీసీని చైనా ప్రజల నుంచి దూరం చేయడానికి జరిగిన ప్రయత్నాలన్నీ విఫలమవడం ఖాయమని ఈ సందర్భంగా జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. 95 లక్షల మంది పార్టీ సభ్యులు, 140 కోట్ల దేశ ప్రజలు ఆ పరిస్థితిని రానవ్వరన్నారు. సీపీసీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే వైరస్‌లను ఏరివేస్తామని, పార్టీలో అసమ్మతిపై పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, హాంకాంగ్‌లో చైనా నేషనల్ సెక్యూరిటీ చట్టాన్ని అమలు చేయడాన్ని జిన్‌పింగ్ సమర్థ్ధించారు. ‘మనకు చెప్పే హక్కు తమకే ఉందని భావించే వారి నీతులను వినే ప్రసక్తే లేదు’ అని అమెరికాపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థి క వ్యవస్థపై మాట్లాడుతూ.. మైలురాళ్ల వంటి సంస్కరణలతో కేంద్రీకృత ఎకానమీని సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీగా విజయవంతంగా మార్చగలిగామని జిన్‌పింగ్ పేర్కొన్నారు. -
మూడో బిడ్డకూ చైనా ఓకే
బీజింగ్: దేశంలో జననాల రేటు పడితుండటంతో చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ విధానపరమైన కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సంతానం విధానాన్ని దశాబ్దాలపాటు కఠినంగా అమలు చేయడంలో చైనాలో జనాభా పెరుగుదల క్షీణించింది. దీని కారణంగా తలెత్తే దుష్ఫలితాలపై ఆందోళనలు వెల్లువెత్తడంతో ఇద్దరు బిడ్డల్ని కనవచ్చంటూ 2016లో వెసులుబాటు కల్పించింది. పిల్లల్ని పెంచడం ఆర్థికంగా భారంగా మారడంతో చైనాలో చాలా మంది దంపతులు ఇద్దరు సంతానం కలిగి ఉండేందుకు సముఖంగా లేరు. దీంతో తాజాగా, మరో అడుగు ముందుకేసి దంపతులు ముగ్గురు పిల్లల్ని కలిగి ఉండేందుకు వీలు కల్పించింది. కొత్త గణాంకాల ప్రకారం.. వరుసగా నాలుగో ఏడాది కూడా జననాల రేటు అతితక్కువగా నమోదైంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా, రెండోఅతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో పనిచేయగలిగే వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుండటంపై ప్రభుత్వ వర్గాల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో, దేశాధ్యక్షుడు, కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) అధినేత జిన్‌పింగ్..ఇప్పటి వరకు అనుసరించిన కుటుంబ నియంత్రణ విధానాన్ని పక్కనబెట్టి, దంపతులు మూడో బిడ్డను కూడా కలిగి ఉండేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ‘మూడో సంతానాన్ని కనాలనే దంపతులను చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది’అని అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆధ్వర్యంలో జరిగిన సీపీసీ పొలిటికల్ బ్యూరో నిర్ణయించినట్లు అధికార వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. ఈ విధానం అమలుకు అవసరమైన ప్రోత్సాహక చర్యలతో చైనా జనాభా పెరుగుతుందని ఆ సమావేశం పేర్కొందని తెలిపింది. -
బ్రహ్మపుత్రపై చైనా భారీ ప్రాజెక్టు
బీజింగ్: తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చల్లారక ముందే చైనా మరో వివాదానికి తెరలేపింది. టిబెట్ నుంచి భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నది దిగువ భాగంలో అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. చైనా అభివృద్ధి పేరుతో మొత్తం 60 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలతో కూడిన 14వ పంచవర్ష ప్రణాళికకు గురువారం ఆ దేశ పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (సీపీసీ) ఆమోదించింది. అందులో బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ నిర్మాణం కూడా ఉంది. గత ఏడాది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ఆమోదించిన బ్లూ ప్రింట్‌ను ఆ దేశ పార్లమెంటు య«థాతథంగా ఆమోదించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని లీ కెక్వియాంగ్, 2 వేల మందికి పైగా ఇతర నాయకులు కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ ఏడాదే బ్రహ్మపుత్రపై ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు కమ్యూనిస్టు పార్టీ టిబెట్ అటానమస్ రీజియన్ డిప్యూటీ చీఫ్ చె డల్హా ఇప్పటికే వెల్ల డించారు. ఈ డ్యామ్ నిర్మాణానికి సంబం«ధించిన ప్లాన్, ఇతర పర్యావరణ అనుమతులు యుద్ధ ప్రాతిపదికన ఇస్తారని గతంలోనే దక్షిణ చైనా మార్నింగ్ పోస్టు ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రపంచంలోనే ఎత్తయిన నది కాలుష్యం, తద్వారా భూతాపం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో 2060 నాటికి కర్బన్ ఉద్గారాలను కనిష్ట స్థాయికి తగ్గించుకోవాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది. టిబెట్‌లో హైడ్రో పవర్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. జల విద్యుత్ ప్లాంట్లను నిర్మించనుంది. చైనా చర్యలను టిబెట్ పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిని డోర్జీ పాగ్మో అనే దేవత శరీరంగా టిబెట్ ప్రజలు ఆరాధిస్తారు. టిబెటన్ సంస్కృతి, సంప్రదాయాల్లో ఈ పవిత్ర నదికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. పశ్చిమ టిబెట్‌లోని హిమానీనదాల్లో పుట్టిన బ్రహ్మపుత్ర నది సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన నదిగా పేరుగాంచింది. చైనాలో యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రపంచంలో భారీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో ఒకటిగా రికార్డుకెక్కింది. బ్రహ్మపుత్రపై నిర్మించే హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్‌లో త్రీ గోర్జెస్ కంటే మూడు రెట్లు అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. మెడోగ్ కౌంటీలో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 14 వేల మంది నిరాశ్రయులవుతారని అంచనా. భారత్ ఆందోళనలేంటి? టిబెటన్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో (టీఏఆర్) బ్రహ్మపుత్రపై (యార్లంగ్ సాంగ్‌పొ నది) చైనా తలపెట్టిన ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ కానుంది. దీని నిర్మాణంపై భారత్, బంగ్లాదేశ్‌లు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి. టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర 2,900 కిలోమీటర్లు ప్రవహిస్తూ భారత్, బంగ్లాదేశ్‌లలో నీటి అవసరాలను తీరుస్తోంది. బ్రహ్మపుత్ర ఎగువ భాగంలో ఎన్నో ప్రాజెక్టుల్ని నిర్మించిన చైనా ఇప్పుడు దిగువ భాగంపై కన్నేసింది. అరుణాచల్‌కి సమీపంలో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమైంది. 60 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగే ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిగువ ప్రాంతాలకు నీటికి కొరత ఏర్పడుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అంతే కాకుండా వరదలు వంటివి సంభవించినప్పుడు గేట్లు ఎత్తేస్తే దిగువ ప్రాంతాలు కొట్టుకొని పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు భారత్‌కి చైనా ఎలాంటి సమాచారం అందించలేదు. హాంకాంగ్ ఎన్నికల వ్యవస్థపైనా చైనా నియంత్రణ హాంకాంగ్‌పై మరింతగా పట్టు పెంచుకునేలా చైనా అడుగులు ముందుకి వేస్తోంది. అక్కడ ఎన్నికల వ్యవస్థని తన గుప్పిట్లో ఉంచుకునేలా పాట్రియాట్స్ గవర్నింగ్ హాంకాంగ్ తీర్మానాన్ని చైనా పార్లమెంటు గురువారం ఆమోదించింది. దీని ద్వారా హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రతినిధుల సంఖ్య తగ్గి, చైనా అనుకూల ప్యానెల్ తమకు నచ్చినవారిని నామినేట్ చేసే అధికారాలు సంక్రమిస్తాయి. ప్రజాస్వామ్య స్థాపన కోసం హాంగ్‌కాంగ్‌లో వెల్లువెత్తుతున్న ఉద్యమాలను అణచివేతకే చైనా ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలొచ్చాయి. ఈ తీర్మానానికి చైనా పార్లమెంటు 2,895–0 ఓట్ల తేడాతో ఆమోదించింది. దీనిని పార్లమెంటు సభ్యుల్లో ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. మరో పార్లమెంటు సభ్యుడు సమావేశాలకు హాజరు కాలేదు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా చేసిన తీర్మానాలను అక్కడ పార్లమెంటు ఎప్పుడూ ఏకగ్రీవంగానే ఆమోదిస్తుంది. తీర్మానంపై ఓటు వేస్తున్న జిన్‌పింగ్ -
చైనా సర్వోన్నత నేత జిన్‌పింగ్
బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇక జీవితకాలం ఆ పదవిలో కొనసాగేందుకు మార్గం అధికారికంగా సుగమమైంది. ఓ వ్యక్తి అధ్యక్షుడిగా రెండు కంటే ఎక్కువసార్లు పనిచేయకూడదంటూ ఉన్న పరిమితిని ఎత్తివేసే రాజ్యాంగ సవరణకు ఆ దేశ పార్లమెంటు ఆదివారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జిన్‌పింగ్ రెండోసారి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇకపై కూడా ఆయన ఎన్నాళ్లు కోరుకుంటే అన్నాళ్లు, కావాలంటే చనిపోయేంత వరకు కూడా అధ్యక్షుడిగా ఉండొచ్చు. ఇటీవలి దశాబ్దాల్లో చైనాలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా జిన్‌పింగ్ ఎదిగారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) స్థాపక చైర్మన్ అయిన మావో జెడాంగ్ తర్వాత అధ్యక్ష పదవిలో జీవితకాలం కొనసాగనున్న నేతగా జిన్‌పింగ్ రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఎవరూ రెండు కన్నా ఎక్కువసార్లు చేపట్టకూడదంటూ ఉన్న నిబంధనను రద్దు చేయాలని ఇటీవల జరిగిన సీపీసీ మహాసభల్లో తీర్మానించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులపై ఉన్న పరిమితిని ఎత్తివేయాలన్న సీపీసీ నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదించింది. పొరుగుదేశాలకు ఆందోళనకరం.. జిన్‌పింగ్‌కు జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం కల్పించడం భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు ఆందోళన కలిగించే అంశం. 2013లో జిన్‌పింగ్ అధ్యక్షుడయ్యాక ఆయా దేశాలతో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. భారత్‌తో డోక్లాం వివాదం తెలిసిందే. భారత్‌కు శత్రుదేశమైన పాకిస్తాన్‌కు చైనా బాగా దగ్గరవుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చైనా–పాక్ ఆర్థిక కారిడార్‌ను కూడా నిర్మిస్తోంది. మాల్దీవులు, శ్రీలంకల్లోనూ తన ప్రాబల్యాన్ని బాగా పెంచుకుంది. రోడ్డు, రైల్వే ప్రాజెక్టులతో నేపాల్‌తో కూడా సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంది. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాలతోనూ విభేదాలను చైనా పెంచుకుంది. ఇవన్నీ జిన్‌పింగ్ అధ్యక్షుడయ్యాక జరిగినవే. ఈ నేపథ్యంలో జీవితకాలం పదవిలో కొనసాగే అవకాశాన్ని ఆయనకు కల్పించడం పొరుగుదేశాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అత్యంత ప్రాధాన్యం... చైనాను ఆర్థికంగా, సైనికపరంగా ‘సూపర్‌పవర్’గా మార్చాలనేదే జిన్‌పింగ్ లక్ష్యం. మరో 30 ఏళ్లలో చైనాను ›ప్రపంచ ఆర్థికశక్తిగా, ప్రపంచస్థాయి మిలటరీ శక్తిగా రూపుదిద్దే తన జీవితకాల లక్ష్యాన్ని సాధించేందుకు జిన్‌పింగ్‌కు తాజా నిర్ణయం దోహదపడతుందని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలను చేపట్టడంతో పాటు పార్టీ కఠినమైన క్రమశిక్షణ పాటించేలా చేయడం, వివిధస్థాయిల్లో అవినీతిని అంతమొందించేందుకు తీసుకున్న ధృడచిత్త వైఖరి ఆయనకు ప్రజాదరణ తెచ్చిపెట్టింది. ఈ విషయంలో పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో ఉన్న వారిని కూడా ఉపేక్షించలేదనే పేరు గడించారు. ఇప్పటికే ఆయన చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రధానకార్యదర్శిగా, చైనా పీపుల్స్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా, సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్‌గా దేశంలోని అన్ని వ్యవస్థలపై కీలకబాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేపథ్యమిదీ... విప్లవోద్యమ కాలంలో నిర్వహించిన పాత్రతో జిన్‌పింగ్ తండ్రి పార్టీలో కీలకబాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయనను తప్పించడంతో షీ కుటుంబం కష్టాలు ఎదుర్కొంది. పార్టీలో జిన్‌పింగ్ నిబద్ధతతో, అత్యంత క్రమశిక్షణతో పనిచేశారు. 1971లోనే కమ్యూనిస్ట్ యూత్‌లీగ్‌లో చేరారు. పార్టీలో చేరేందుకు పదిసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమై 1974లో దానిని సాధించగలిగారు. 1999లో ఫుజియన్ ప్రావిన్స్ గవర్నర్ పదవిని చేపట్టారు. 2002లో ఝేజియాంగ్ ప్రావిన్స్, 2007లో షాంఘై పార్టీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. 2007లోనే పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో, సెంట్రల్ సెక్రటేరియట్లో చేరారు. హుజింటావో అధ్యక్షుడిగా ఉన్నపుడు 2008–13 మధ్యలో ఉపాధ్యక్షుడిగా, 2010–12 మధ్యకాలంలో సెంట్రల్ మిలటరీ కమిషన్ వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. 2012లో తొలిసారిగా ప్రధానకార్యదర్శి పదవిని చేపట్టిన ఆయన 2017లో మళ్లీ ఆ పదవికి ఎన్నికయ్యారు. -
ప్రణాళికలే చైనా వృద్ధి సోపానాలు
నేటి నవచైనా నిర్మాణం వెనుక కమ్యూనిస్టు ప్రణాళికతో కూడిన పాలన సంస్కరణలు అనేకం ఉన్నాయి. 70 ఏండ్ల క్రితం 1949 అక్టోబర్ 1న ఏర్పడిన చైనా పీపుల్స్ రిపబ్లిక్ గడిచిన నాలుగైదు దశాబ్దాలుగా పలు సంస్కరణలు అమలు జరిపింది. అక్కడి ప్రజల, పాలకుల అవి రళకృషి ఫలితమే నేటి చైనా అభివృద్ధికి కారణంగా కనిపిస్తోంది. చైనా సుదూర లక్ష్యాలను, ప్రజల కలలను సాకారం చేయడంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ ప్రక్రియ కూడా అత్యంత ముఖ్య భూమిక పోషిస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆహ్వానం మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ 13 మంది ప్రతినిధుల బృందం వారం రోజుల పాటు ఆ దేశంలో పర్యటించింది. సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు అరవింద్ శ్రీవాత్సవ నాయకత్వంలో దేశం నలుమూలల నుంచి కొంతమందిమి చైనాలో పర్యటించాం. వారం రోజుల పాటు చైనా దేశం లోని గుయ్జూ ప్రావిన్స్ రాజధాని గుయాంగ్ నగరం, హంగౌస్, పింగ్బా జిల్లాలోని అన్షు నగరం, జియోవాన్ గ్రామం, జునై నగరం, బైజియాబా గ్రామం, బోజ్ జిల్లాలోని ఉజ్జియాగ్ టౌన్‌షిప్‌తో పాటు జిబైపోనగరం, ఆ దేశ రాజధాని బీజింగ్ నగరాల్లో పర్యటించి అక్కడి ప్రజలను, రైతులను, కార్మికులను, పార్టీ శ్రేణులను కలవడమైనది. మా పర్యటనా కాలంలోనే అత్యంత ప్రధానమైన ప్రపంచ రాజకీయ పార్టీల ఉన్నతస్థాయి సదస్సు బీజింగ్ నగరంలో మూడు రోజుల పాటు జరిగింది. 120 దేశాల నుంచి 200 పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ, 600 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సును చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రారంభించారు. చైనా అభివృద్ధిలో భాగమైన వ్యవసాయం సహకార పద్ధతిలో కొనసాగడం గమనార్హం. సహకార సంఘాలుగా రైతులు ఏర్పడి ప్రభుత్వం నుంచి భూమిని ఉచితంగా లీజ్‌కు తీసుకుని పంటలు పండిస్తూ జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకుంటారు. ప్రైవేటు భూమి అనేది లేకుండా ప్రభుత్వం చేతిలోనే భూమి నిక్షిప్తమై ఉన్నది. రైతులకు, వ్యవసాయ కూలీలకు పూర్తిగా వందశాతం ప్రభుత్వమే ఆరోగ్యబీమా అమలు జరుపుతున్నది. అక్కడ ప్రతిగ్రామంలో ఆరోగ్య కేంద్రాలు కూడా ఉండి ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తారు. దేశంలో 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా నిర్బంధ విద్య అమలులో ఉన్నది. ప్రతి ఏటా జీడీపీలో 5 శాతం నిధులు విద్యపై ఖర్చు చేస్తున్నారు. నిరుద్యోగం ఉన్నప్పటికీ దానిని అధిగమించి అందరికీ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధ కృషి కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90 శాతం యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించారు. అభివృద్ధిలో మౌలిక సదుపాయాల కల్పనలో నూటికి నూరుశాతం చైనా విజయం సాధించింది. ప్రపంచీకరణ అమలులో ఉన్నప్పటికీ ఆ దేశ ప్రయోజనాలకు అనుకూలంగా బహుళ జాతి సంస్థలను అనేక షరతులతో అనుమతిస్తున్నారు. సమసమాజ నిర్మాణానికి తమదైన పద్ధతుల్లో ప్రయత్నిస్తున్నామని, తాము విప్లవాన్ని ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోలేదని... ఎగుమతి కూడా చేయబోమని చైనా నిపుణులు చెప్పడం గమనార్హం. (గత నెలలో సీపీఐ ప్రతినిధుల బృందం చైనా పర్యటన సందర్భంగా) – తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
మావో తర్వాత జిన్‌పింగ్
బీజింగ్: ఆధునిక చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రస్తుత చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. జిన్‌పింగ్‌కు దిగ్గజ గౌరవాన్ని కల్పిస్తూ అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) మంగళవారం తీర్మానం చేసింది. జిన్‌పింగ్ పేరును, ఆయన సిద్ధాంతాలను సీపీసీ రాజ్యాంగంలో చేరుస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. తాజాగా సెంట్రల్ కమిటీకి ఎన్నికవడంతో రెండోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం జిన్‌పింగ్‌కు లాంఛనమే. అయితే మావో తరహాలో మూడోసారి కూడా అధ్యక్ష పదవి చేపట్టేలా ఆయన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సమావేశాల చివరి రోజున జిన్‌పింగ్ సిద్ధాంతాలను రాజ్యాంగంలో చేరుస్తూ సీపీసీ ఆమోదం తెలిపింది. జిన్‌పింగ్‌కు ముఖ్యనేత(కోర్ లీడర్) స్థాయిని ప్రకటించింది. దీంతో ఇకపై పార్టీలోని నేతలందరికంటే అత్యున్నత స్థాయిలో జిన్‌పింగ్ ఉంటారు. ఇప్పటి వరకూ మావోతో పాటు మాజీ అధ్యక్షుడు డెంగ్ జియావోపింగ్ ఆలోచనలకు మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగంలో చోటు దక్కింది. చైనాలో సంస్కరణలకు నాంది పలికిన నాయకుడిగా పేరున్న జియావోపింగ్ మరణానంతరం ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలకు రాజ్యాంగంలో చోటు కల్పించారు. సీపీసీ చరిత్రకారులు 64 ఏళ్ల జిన్‌పింగ్‌ను పార్టీ వ్యవస్థాపకుడు మావోతో పోలుస్తున్నారు. జిన్‌పింగ్‌కు ముందు అధికార పగ్గాలు చేపట్టిన జియాంగ్ జెమిన్, హుజింటావో ఆలోచనలకు కూడా రాజ్యాంగంలో చోటు దక్కినా వారి పేర్లు మాత్రం చోటు సంపాదించలేకపోయాయి. తన ఆలోచనలతో పాటు పేరుకు కూడా రాజ్యాంగంలో చోటు దక్కిన మూడో నాయకుడు జిన్‌పింగ్ కావడం గమనార్హం. జిన్‌పింగ్‌తో పాటు అధ్యక్షుడు లీ కెకియాంగ్ కేంద్ర కమిటీలోకి మళ్లీ చోటుదక్కించుకున్నారు. భారత్–చైనా సరిహద్దు చర్చల ప్రత్యేక ప్రతినిధి యాంగ్ జిచికి సీపీసీ కేంద్ర కమిటీలో స్థానం లభించింది.