బీజింగ్: రాబోయే కాలంలో అతిపెద్ద పోరాటాలకు, ఊహించని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటినుంచే సంసిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా వ్యవహరించాలని సూచించారు.
చైనా నేషనల్ డే సందర్భంగా ఖిషీ పత్రికలో జిన్‌పింగ్ ఈ మేరకు ఓ వ్యాసం రాశారు. సవాళ్లను ప్రభావవంతంగా అధిగమించే దిశగా ప్రజలను ముందుకు నడిపించాలని పేర్కొన్నారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ కీలక సదస్సు ఈ నెల 16న జరగనుంది. జిన్‌పింగ్ పదవీ కాలాన్ని వరుసగా మూడోసారి మరో ఐదేళ్లపాటు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మావో జెడాంగ్ తర్వాత పదేళ్లకుపైగా అధికారంలో ఉన్న నాయకుడిగా జిన్‌పింగ్ రికార్డు సృష్టిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment