మావో స్థాయి నేతగా జిన్‌పింగ్
బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌సింగ్‌ను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా శక్తివంతమైన ‘కోర్’ లీడర్‌గా ఏకగ్రీవంగా గుర్తించింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మావో జెడాంగ్ స్థాయి నేతగా ఈయనకు గుర్తింపునిచ్చింది. 2012 నవంబర్లో జిన్‌పింగ్ అధికార పగ్గాలు చేపట్టినప్పటినుంచి.. ఆయన తీసుకున్న నిర్ణయాలు, బలమైన శక్తిగా ఆవిర్భవించిన విధానం దేశాన్ని, పార్టీని గర్వపడేలా చేశాయని సీపీసీ సెంట్రల్ కమిటీ ప్రకటించింది. పార్టీ కీలక బృందంపై పూర్తిపట్టున్న జిన్‌పింగ్ తన పదవీకాలమైన మరో ఆరేళ్ల పాటు అధ్యక్షుడిగా ఉండనున్నారు. అవసరమైతే మరికొంతకాలం దీన్ని పెంచుకునే అవకాశం కూడా ఉందని నిపుణులు అంటున్నారు.