G Jinping
-
మావో స్థాయి నేతగా జిన్‌పింగ్
-
మావో స్థాయి నేతగా జిన్‌పింగ్
బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్సింగ్ను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా శక్తివంతమైన ‘కోర్’ లీడర్‌గా ఏకగ్రీవంగా గుర్తించింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మావో జెడాంగ్ స్థాయి నేతగా ఈయనకు గుర్తింపునిచ్చింది. 2012 నవంబర్‌లో జిన్‌పింగ్ అధికార పగ్గాలు చేపట్టినప్పటినుంచి.. ఆయన తీసుకున్న నిర్ణయాలు, బలమైన శక్తిగా ఆవిర్భవించిన విధానం దేశాన్ని, పార్టీని గర్వపడేలా చేశాయని సీపీసీ సెంట్రల్ కమిటీ ప్రకటించింది. పార్టీ కీలక బృందంపై పూర్తిపట్టున్న జిన్‌పింగ్ తన పదవీకాలమైన మరో ఆరేళ్ల పాటు అధ్యక్షుడిగా ఉండనున్నారు. అవసరమైతే మరికొంతకాలం దీన్ని పెంచుకునే అవకాశం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. -
జనచైనాలో ‘ఒక బిడ్డ’కు చెల్లు
బీజింగ్: సామాజిక సంస్కరణల దిశగా పయనిస్తున్న జన చైనా గొప్ప మార్పునకు నాంది పలికింది. దశాబ్దాలుగా కొనసాగిస్తున్న వివాదాస్పద ‘ఒక బిడ్డ’ విధానానికి స్వస్తి పలకనుంది. అలాగే అమానవీయమైన కార్మిక శిబిరాల పద్ధతినీ రద్దు చేసింది. ఈ విషయాలను అధికారిక కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) శుక్రవారం ప్రకటించింది. చైనా అధ్యక్షుడు, సీపీసీ ప్రధాన కార్యదర్శి జీ జిన్‌పింగ్ నేతృత్వంలో ఈనెల 9 నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన ప్లీనరీలో చర్చల మేరకు ఈ నిర్ణయాలు తీసుకుంది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు 376 మందికిపైగా పాల్గొన్న ఆ ప్లీనరీలో దేశంలో సమకాలీన పరిణామాలపై చర్చించారు. జనాభా పెరుగుదలను నియంత్రించడానికి దాదాపు మూడు దశాబ్దాల నుంచి అమలుచేస్తున్న ‘ఒకే బిడ్డ’ విధానంలో మార్పు చేసి, ఇద్దరు సంతానం ఉండటానికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే ఇప్పటివరకు కఠినంగా అమలుచేసిన కుటుంబ నియంత్రణ విధానంలో ఒక బిడ్డకే పరిమితమైన లక్షలాది మంది దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వడానికి కొత్త నిబంధన సమ్మతిస్తుంది. ఈ మార్పునకు కారణం... ఒకే బిడ్డ విధానం వల్ల చైనాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటమే. గత ఏడాది గణాంకాల ప్రకారం... 18.5 కోట్ల మంది (జనాభాలో 13.7 శాతం) మంది 60 ఏళ్లకు మించి వయసు ఉన్నవారే.