జనచైనాలో ‘ఒక బిడ్డ’కు చెల్లు | China to ease controversial one-child policy | Sakshi
Sakshi News home page

జనచైనాలో ‘ఒక బిడ్డ’కు చెల్లు

Published Sat, Nov 16 2013 5:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM

China to ease controversial one-child policy

బీజింగ్: సామాజిక సంస్కరణల దిశగా పయనిస్తున్న జన చైనా గొప్ప మార్పునకు నాంది పలికింది. దశాబ్దాలుగా కొనసాగిస్తున్న వివాదాస్పద ‘ఒక బిడ్డ’ విధానానికి స్వస్తి పలకనుంది. అలాగే అమానవీయమైన కార్మిక శిబిరాల పద్ధతినీ రద్దు చేసింది. ఈ విషయాలను అధికారిక కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) శుక్రవారం ప్రకటించింది. చైనా అధ్యక్షుడు, సీపీసీ ప్రధాన కార్యదర్శి జీ జిన్‌పింగ్ నేతృత్వంలో ఈనెల 9 నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన ప్లీనరీలో చర్చల మేరకు ఈ నిర్ణయాలు తీసుకుంది.

 

పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు 376 మందికిపైగా పాల్గొన్న ఆ ప్లీనరీలో దేశంలో సమకాలీన పరిణామాలపై చర్చించారు. జనాభా పెరుగుదలను నియంత్రించడానికి దాదాపు మూడు దశాబ్దాల నుంచి అమలుచేస్తున్న ‘ఒకే బిడ్డ’ విధానంలో మార్పు చేసి, ఇద్దరు సంతానం ఉండటానికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే ఇప్పటివరకు కఠినంగా అమలుచేసిన కుటుంబ నియంత్రణ విధానంలో ఒక బిడ్డకే పరిమితమైన లక్షలాది మంది దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వడానికి కొత్త నిబంధన సమ్మతిస్తుంది. ఈ మార్పునకు కారణం... ఒకే బిడ్డ విధానం వల్ల చైనాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటమే. గత ఏడాది గణాంకాల ప్రకారం... 18.5 కోట్ల మంది (జనాభాలో 13.7 శాతం) మంది 60 ఏళ్లకు మించి వయసు ఉన్నవారే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement