ఆంగ్లో ఈస్టర్న్‌ భారీ నియామకాలు | Anglo-Eastern Group plans to add another 1,000 Indian seafarers to existing pool | Sakshi
Sakshi News home page

ఆంగ్లో ఈస్టర్న్‌ భారీ నియామకాలు

Published Tue, Feb 21 2023 4:23 AM | Last Updated on Tue, Feb 21 2023 4:23 AM

Anglo-Eastern Group plans to add another 1,000 Indian seafarers to existing pool - Sakshi

ముంబై: నౌకల నిర్వహణలో ఉన్న హాంగ్‌కాంగ్‌ కంపెనీ ఆంగ్లో ఈస్టర్న్‌ గ్రూప్‌ భారత్‌లో కొత్తగా 2023 డిసెంబర్‌ నాటికి 1,000 మంది నావికులను నియమించుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్‌ పరిశ్రమకు శిక్షణ పొందిన మానవ వనరులను అందించే ప్రధాన సరఫరాదార్లలో భారత్‌ ఒకటి. ఆంగ్లో ఈస్టర్న్‌ గ్రూప్‌ అనుబంధ కంపెనీ ఆంగ్లో ఈస్టర్న్‌ షిప్‌ మేనేజ్‌మెంట్‌ ఇండియాకు ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కత, కొచ్చి, లక్నో, చండీగఢ్‌లో కార్యాలయాలు ఉన్నాయి.

నావికా శిక్షణ కేంద్రం సైతం భారత్‌లో కంపెనీ నిర్వహిస్తోంది. ప్రస్తుతం దేశంలో కంపెనీకి 21,000 మంది సిబ్బంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 27,000. థర్డ్‌ పార్టీ షిప్‌ మేనేజ్‌మెంట్‌ కింద సంస్థ ఖాతాలో 600 నౌకలు కొలువుదీరాయి. 300 బల్క్‌ ట్యాంకర్స్, 200 ట్యాంకర్స్, 100 కంటైనర్‌ షిప్స్‌ ఉన్నాయి. ప్రపంచంలో నౌకల పరంగా తొలి స్థానంలో, సిబ్బంది పరంగా రెండవ స్థానంలో గ్రూప్‌ నిలిచిందని ఆంగ్లో ఈస్టర్న్‌ షిప్‌ మేనేజ్‌మెంట్‌ ఇండియా ఎండీ మనీశ్‌ ప్రధాన్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement