హాంకాంగ్‌లోని ఒక చెరువులో బయటపడింది ఈ వింతజీవి. జెల్లీఫిష్ జాతికి చెందిన ఈ జీవికి ఏకంగా ఇరవైనాలుగు కళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక అంగుళం పరిమాణంలో పారదర్శకమైన శరీరం, మూడు పొడవాటి టెంటకల్స్ కలిగి ఉన్న ఈ జీవిని హాంకాంగ్‌లోని మై పో రిజర్వ్ చెరువులో గుర్తించారు. ఇది జెల్లీఫిష్‌లో ఇప్పటివరకు తెలియని కొత్తజాతికి చెందినదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
గంట మాదిరిగా కనిపించే దీని శరీరం లోపలి వైపు ఆరుభాగాల్లో పన్నెండు జతల కళ్లు ఉన్నాయని, ఆస్ట్రేలియన్ బాక్స్ జెల్లీఫిష్ మాదిరిగానే ఇది కూడా విషపూరితమైనదని శాస్త్రవేత్తలు వివరించారు. హాంకాంగ్ బాప్టిస్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వింత జెల్లీఫిష్‌ను మూడేళ్ల కిందటే గుర్తించారు. దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి, ఇటీవల దీని విశేషాలను మీడియాకు వెల్లడించారు.
చదవండి: కాంగోలో వరదల బీభత్సం..200 మందికిపైగా మృతి
Comments
Please login to add a commentAdd a comment