
Twitter Pic
ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సూపర్-4కు టీమిండియా ఆర్హత సాధించింది. భారత విజయంలో సూర్యకుమార్ యాదవ్(68 నాటౌట్), విరాట్ కోహ్లి(59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చేలరేగి కీలక పాత్ర పోషించాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సంచలన త్రో మెరిశాడు.
హాంకాంగ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో ఐదో బంతిని ఆర్ష్‌దీప్ సింగ్ సింగ్ నో బాల్‌గా వేశాడు. దీంతో ప్రత్యర్ధి బ్యాటర్‌కు ఫ్రీ హిట్ లభించింది. అయితే ఈ ఫ్రీ హిట్‌ను హాంకాంగ్ ఉపయోగించుకోకపోవడమే కాకుండా కీలక వికెట్‌ను కూడా కోల్పోయింది. ఈ బంతిని ఎదుర్కొన్న హాంకాంగ్ కెప్టెన్ నిజాకత్ ఖాన్ పాయింట్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.
అయితే నిజాకత్ సింగిల్ తీయడానికి ప్రయత్నించి ముందుకు వెళ్లగా.. నాన్ స్ట్రైక్‌లో ఉన్న బాబర్ హయత్ తిరస్కరించాడు. దీంతో తిరిగి వెనుక్కి వచ్చే క్రమంలో పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజా మెరుపు త్రో తో వికెట్లను గిరాటేశాడు. దీంతో నిజాకత్ ఖాన్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. కాగా ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'అక్కడ ఉన్నది జడేజా.. కొంచెం చూసి వెళ్లాలి కదా భయ్యా' అంటూ కామెంట్ చేశాడు.
#Jaddu what a run out pic.twitter.com/b8mjgMmd7u
— Cricket fan (@Cricket58214082) August 31, 2022
చదవండి: Asia Cup 2022 IND VS HK: కోహ్లి క్లాస్.. సూర్య మాస్.. హాంగ్‌కాంగ్‌ను చిత్తు చేసిన భారత్