Ravindra Jadeja Set To Miss T20 World Cup: టీ20 వరల్డ్‌కప్ 2022కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. మోకాలి గాయంతో ఆసియా కప్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు కూడా దూరంగా కానున్నాడని తెలుస్తోంది. మోకాలి శస్త్ర చికిత్స నేపథ్యంలో జడ్డూ మెగా టోర్నీ మొత్తానికే దూరం కానున్నాడని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ శనివారం వెల్లడించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు జడేజాకు మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని అంచనా. దీంతో జడేజా మరో ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటాడని సమాచారం.
కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చిన జడ్డూ.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో ఔటయ్యాడు. ఆతర్వాత హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చిన జడేజా ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో జడ్డూకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్ అనంతరం మోకాలి గాయం తిరగబెట్టడంతో జడ్డూ టోర్నీ నుంచి మధ్యలోనే నిష్క్రమించాడు. జడేజా ఇటీవలి కాలంలో వరుసగా గాయాల బారిన పడుతూ జట్టులోకి వచ్చి పోతున్న విషయం తెలిసిందే.
చదవండి: టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాక్‌కు ఎదురుదెబ్బ
Comments
Please login to add a commentAdd a comment