Ravindra Jadeja Starts Training After Knee Surgery And Share Video - Sakshi
Sakshi News home page

టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. గాయం నుంచి కోలుకున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌

Published Wed, Oct 19 2022 10:36 PM | Last Updated on Thu, Oct 20 2022 9:05 AM

Ravindra Jadeja Starts Training After Knee Surgery - Sakshi

ఆసియా కప్‌ సందర్భంగా గాయపడి టీ20 ప్రపంచకప్‌ ఆడే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకున్న టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా.. సర్జరీ అనంతరం పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తున్నాడు. జడ్డూ తాజా ట్విటర్‌ పోస్ట్‌ చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. జడ్డూ.. జిమ్‌లో అటు ఇటూ పరిగెడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ వీడియోలో అతను పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఫిట్‌నెస్‌ సాధించగలడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఒకవేళ జడేజా ఫిట్‌నెస్‌ సాధించినా ఇప్పట్లో అతను టీమిండియాతో కలవడం సాధ్యం కాదు. టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, గాయం కారణంగా జడేజా జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో అక్షర్‌ పటేల్‌ వరల్డ్‌కప్‌ జట్టులోకి వచ్చాడు. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా అక్షర్‌ ప్రస్తుతానికి బాగానే రాణిస్తున్నాడు. ఆసియా కప్‌ తర్వాత స్వదేశంలో జరిగిన సిరీస్‌ల్లో అక్షర్‌ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియా.. అక్టోబర్‌ 23న దాయాది పాకిస్తాన్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement