
ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 156 పరుగుల తేడాతో హాంగ్ కాంగ్ ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో టోర్నీ నుంచి హాంగ్ కాంగ్ ఇంటిముఖం పట్టగా.. పాకిస్తాన్ సూపర్-4లో అడుగుపెట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(57 బంతుల్లో 78 పరుగులు నాటౌట్), ఫఖర్ జమాన్(53) పరుగులతో రాణించగా.. అఖర్లో కుష్‌దిల్ షా (15 బంతుల్లో 35 పరుగులు నాటౌట్, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా పాకిస్తాన్ ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన అజాజ్ ఖాన్ బౌలింగ్‌లో.. కుష్‌దిల్ షా ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు. దాంట్లో నాలుగు భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ హాంగ్ కాంగ్ బౌలర్ ఆర్షద్ వేసిన అఖరి ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ ఏకంగా 26 పరుగులు రాబట్టాడు.
అతడు కూడా నాలుగు భారీ సిక్సర్లతో ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఇక 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్ కాంగ్ కేవలం 38 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. మహ్మద్ నవాజ్ మూడు, నసీమ్ షా రెండు, దహినీ ఒక వికెట్ తీశారు. ఇక సూపర్-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 4న) భారత్‌తో పాకిస్తాన్ తలపడనుంది.
చదవండి: Babar Azam: 'నువ్వే సరిగ్గా ఆడడం లేదు.. ఇంకెందుకు సలహాలు!'
Comments
Please login to add a commentAdd a comment