Asia Cup Super 4 Schedule: India Vs Pakistan On Sunday; Check Here Dates, Timings, Venues, Qualified Teams - Sakshi
Sakshi News home page

Asia Cup 2022: మరోసారి తలపడనున్న భారత్‌-పాక్‌.. సూపర్‌-4 షెడ్యూల్‌ ఇదే

Published Sat, Sep 3 2022 10:23 AM | Last Updated on Sat, Sep 3 2022 12:39 PM

Asia Cup Super 4 schedule: India vs Pakistan on Sunday; Dates, timings, venues, qualified teams - Sakshi

PC: Sports Star

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆసియాకప్‌-2022లో మరోసారి దయాదుల పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్‌ సూపర్-4లో భాగంగా భారత్‌- పాకిస్తాన్‌ జట్లు దుబాయ్‌ వేదికగా ఆదివారం(సెప్టెంబర్‌ 4)న తలపడనున్నాయి. కాగా శుక్రవారం హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన పాకిస్తాన్‌ సూపర్‌-4కు ఆర్హత సాధించింది.

కాగాఅంతకు ముందు ఇదే హాంగ్‌కాంగ్‌పై 40 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ ఆసియా కప్ సూపర్-4కి అర్హత సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఆసియాకప్‌-2022 లీగ్‌ దశ మ్యాచ్‌లు శుక్రవారంతో ముగిశాయి.

గ్రూపు-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌ జట్లు అర్హత సాధించగా.. గ్రూప్‌-బి నుంచి ఆఫ్గానిస్తాన్‌, శ్రీలంక సూపర్‌-4లో అడుగు పెట్టాయి.  ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌, హాంగ్‌ కాంగ్‌ జట్లు నిష్క్రమించాయి. ఇక శనివారం నుంచి  సూపర్-4 దశకు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఆసియాకప్‌ సూపర్‌-4 షెడ్యూల్‌ను ఓసారి పరిశీలిద్దాం.

ఆసియాకప్‌ సూపర్‌-4 షెడ్యూల్‌ ఇదే
మ్యాచ్ 1: సెప్టెంబర్ 3: ఆప్ఘానిస్థాన్ వర్సెస్‌ శ్రీలంక, (షార్జా)

మ్యాచ్ 2: సెప్టెంబర్ 4: భారత్ వర్సెస్‌ పాకిస్తాన్‌ (దుబాయ్)

మ్యాచ్ 3: సెప్టెంబర్ 6: శ్రీలంక వర్సెస్‌ భారత్ (దుబాయ్)

మ్యాచ్ 4: సెప్టెంబర్ 7: పాకిస్తాన్‌ వర్సెస్‌ ఆప్ఘానిస్థాన్ (దుబాయ్)

మ్యాచ్ 5: సెప్టెంబర్ 8: భారత్ వర్సెస్‌ ఆప్ఘానిస్థాన్ (దుబాయ్)

మ్యాచ్ 6:  సెప్టెంబర్ 9: శ్రీలంక వర్సెస్‌ పాకిస్తాన్‌, దుబాయ్

ఫైనల్‌: సెప్టెంబర్ 11 (వేదిక దుబాయ్‌)
చదవండి
Asia cup 2022: భారత్‌ రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్‌.. ప్రపంచంలోనే రెండో జట్టుగా!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement