IND VS PAK: ఆసియా కప్ 2022లో గత ఆదివారమే (ఆగస్ట్ 28) పాకిస్తాన్‌తో తలపడిన టీమిండియా.. వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 4) మరోసారి చిరకాల ప్రత్యర్ధిని ఢీకొట్టే అవకాశం ఉంది. అదెలా అంటే.. షెడ్యూల్ ప్రకారం గ్రూప్-ఏలో ఉన్న భారత్, పాక్, హాంగ్‌కాంగ్ జట్లు ప్రత్యర్ధి జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెప్టెంబర్ 4న సూపర్ 4లో తలపడతాయి.
గ్రూప్-ఏలో టీమిండియా ఇప్పటికే పాక్‌ను మట్టికరిపించి, టేబుల్ టాపర్ (ఏ-1) బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. గ్రూప్ తదుపరి మ్యాచ్‌ల్లో ఆగస్ట్ 31న టీమిండియా, హాంకాంగ్ జట్లు.. ఆ తర్వాత సెప్టెంబర్ 2న పాకిస్తాన్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. పై రెండు మ్యాచ్‌ల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. పసికూన హాంగ్‌కాంగ్ గెలిచే అవకాశం లేదు.
ఈ లెక్కన గ్రూప్-ఏలో తొలి స్థానంలో భారత్.. రెండో స్థానంలో పాకిస్తాన్ జట్లు ఉంటాయి. షెడ్యూల్ ప్రకారం.. గ్రూప్-ఏలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెప్టెంబర్ 4న సూపర్ 4లో తలపడతాయి. ప్రస్తుత సమీకరణల ప్రకారం చూస్తే.. భారత్-పాక్ జట్లు సూపర్-4 దశలోనే కాకుండా మరోసారి కూడా ఎదురెదురుపడే అవకాశం ఉంది.
అదెలా అంటే.. సూపర్-4కు చేరిన జట్లు తమ గ్రూప్‌లోని జట్టుతో పాటు ఇతర గ్రూప్‌లోని (గ్రూప్-బి) తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లతో (బి1, బి2) ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఈ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెప్టెంబర్ 11న (ఆదివారం) ఫైనల్లో తలపడతాయి. ఆయా జట్ల ప్రస్తుత ఫామ్‌ను బట్టిచూస్తే.. సూపర్-4లో భారత్, పాక్ జట్లకే తొలి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అన్నీ ఊహించినట్టు జరిగితే.. భారత్, పాక్‌లు సూపర్-4లో ఓసారి, ఫైనల్లో మరోసారి తలపడే అవకాశం ఉంది. ఈ లెక్కన వచ్చే రెండు ఆదివారాలు (సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 11) భారత్, పాక్ అభిమానులకు క్రికెట్ పండుగ కనువిందు చేయడం ఖాయం.
చదవండి: నాలుగేళ్ల క్రితం చెమటలు పట్టించారు.. లైట్ తీసుకుంటే అంతే!
Comments
Please login to add a commentAdd a comment