
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్ జట్టు సూపర్-4లోకి ప్రవేశించింది. శుక్రవారం హాంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 156 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్ కాంగ్‌ను పాక్ బౌలర్లు వణికించారు. ఏ దశలోనూ పోరాడలేకపోయిన హాంగ్ కాంగ్ 38 పరుగులకే కుప్పకూలి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. హాంగ్ కాంగ్ బ్యాటర్లలో పది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. మహ్మద్ నవాజ్ మూడు, నసీమ్ షా రెండు, దహినీ ఒక వికెట్ తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్(57 బంతుల్లో 78 పరుగులు నాటౌట్, 6 ఫోర్లు, ఒక సిక్సర్) బాధ్యతాయుతంగా ఆడగా.. ఫఖర్ జమాన్(41 బంతుల్లో 53, 3 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించగా.. ఆఖర్లో కుష్‌దిల్ షా(15 బంతుల్లో 35 పరుగులు నాటౌట్, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.ఇక గ్రూఫ్-ఏ నుంచి ఏ-2గా సూపర్-4లో అడుగుపెట్టిన పాకిస్తాన్ జట్టు.. ఈ ఆదివారం(సెప్టెంబర్ 4న) మరోసారి చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో తలపడనుంది. ఆ తర్వాత వరుసగా అఫ్గానిస్తాన్, శ్రీలంకలతో ఆడనుంది.
చదవండి: జట్టును ప్రకటించి 24 గంటలు కాలేదు.. టి20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ స్టార్ దూరం
Comments
Please login to add a commentAdd a comment