హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో సూర్య, విరాట్ కోహ్లి
Asia Cup 2022- India vs Hong Kong- Suryakumar Yadav- Virat Kohli: ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. దుబాయ్ వేదికగా బుధవారం(ఆగష్టు 31) జరిగిన మ్యాచ్‌లో సూర్య నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు.13 ఓవర్లలో 94 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ బ్యాట్ ఝులిపించాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి అద్భుత అర్ధ శతకం సాధించాడు.
మొత్తంగా 26 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 68 పరుగులు పిండుకున్నాడు. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(44 బంతుల్లో 59 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరి హాఫ్ సెంచరీలతో టీమిండియా ఆఖరి ఏడు ఓవర్లలో 98 పరుగులు రాబట్టడం విశేషం.
ఒకే ఓవర్లో నాలుగు సిక్స్‌లు.. కోహ్లి ఫిదా!
ముఖ్యంగా ఆఖరి ఓవర్లో సూర్య వరుసగా 6, 6, 6, 0, 6, 2 బాది 26 పరుగులు సాధించడం మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. ఇక సూర్య ఇన్నింగ్స్.. మరో ఎండ్‌లో కోహ్లికి సైతం ముచ్చటగొలిపింది. దీంతో ‘కింగ్’ టేక్ ఏ బో అన్నట్లుగా తలవంచి సూర్యకు అభినందనలు తెలిపారు.
ఇందుకు సంబంధించిన వీడియోను బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. ‘‘మనం కూడా ఇలాగే తలవంచాలా? అవును.. ఆయన కింగ్.. ఆ కింగ్ స్వయంగా తలవంచాడు కదా మరి’’ అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక వీడియోపై నెటిజన్లు.. ముఖ్యంగా కోహ్లి అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘హుందాతనానికి మారుపేరు మా కింగ్.. ఎట్టకేలకు అర్ధ శతకం సాధించావు భయ్యా. సూర్య భాయ్‌కు కూడా శుభాకాంక్షలు’’ అని విషెస్ తెలుపుతున్నారు.
నాడు అలా.. నేడు ఇలా!
మరికొందరు మాత్రం ఐపీఎల్-2020 సీజన్‌లో కోహ్లి- సూర్య మధ్య జరిగిన ఘటనను గుర్తుచేస్తూ.. ‘‘అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఆనాడు సూర్యతో గొడవపడ్డ కోహ్లి ఈనాడు మాత్రం తన ముందు తలవంచి మరీ అభినందించాడు. దేశానికి ఆడినప్పుడు ఒకలా.. ఫ్రాంఛైజీకి ఆడినపుడు మరొకలా.. ఇదేం పద్ధతి’’ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే, కోహ్లి ఫ్యాన్స్ మాత్రం మైదానంలో ప్రత్యర్థులుగా ఉన్నపుడు అలాంటివి సహజమేనని కొట్టిపారేస్తున్నారు.
ఐపీఎల్-2020 సందర్భంగా సూర్య- కోహ్లి(PC: IPL)
అప్పుడు కోహ్లి వర్సెస్ సూర్య.. ఇప్పుడు సూర్యపై ప్రేమతో విరాట్!
కాగా ఐపీఎల్-2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో జట్టును గెలిపించి.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు సూర్య. నాటి మ్యాచ్‌లో 13వ ఓవర్‌లో కోహ్లి బంతిని షైన్ చేస్తూ సూర్య వద్దకు వచ్చిన కోహ్లి దూకుడుగా వ్యవహరించాడు. అద్భుతమైన షాట్లు ఆడుతున్న సూర్యతో వాగ్వాదానికి సిద్ధమయ్యాడు.
అయితే సూర్యకుమార్ ఏమాత్రం స్పందన లేకుండా కళ్లతోనే బదులిస్తూ, కోహ్లికి దూరంగా వెళ్లిపోయాడు. ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇక మెరుగైన ప్రదర్శన కనబరిచినా సూర్యకు టీమిండియాలో చోటు దక్కకపోవడానికి నాటి కెప్టెన్ కోహ్లినే కారణం అంటూ అప్పట్లో సూర్యకుమార్ ఫ్యాన్స్.. ఈ మాజీ సారథిని ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజా మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగుల తేడాతో హాంగ్ కాంగ్‌పై విజయం సాధించి సూపర్-4కు అర్హత సాధించింది.
చదవండి: IND VS HK: అక్కడ ఉన్నది జడేజా.. కొంచెం చూసి వెళ్లాలి కదా! వీడియో వైరల్
Asia Cup 2022 Ind Vs HK: ఆరేళ్ల తర్వాత కింగ్ కోహ్లి బౌలింగ్.. అభిమానులు ఫిదా!
Comments
Please login to add a commentAdd a comment